HYD: సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని పార్టీ కమిటీల ఏర్పాటు కోసం గతంలో జిల్లాకు ఇద్దరు చొప్పున నియమించిన పరిశీలకులతో బుధవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మేరకు జిల్లాల పరిశీలకులకు గాంధీభవన్ నుంచి సమాచారం వెళ్లింది.