HYD: దోమల నివారణ కార్యక్రమాల పేరిట జీహెచ్‌ఎంసీ అధికారులు రోజూ వేలాది లీటర్ల డీజిల్‌ను దోచుకుంటున్నారు. ఏటా రూ.20 కోట్ల ప్రజాధనం స్వాహా అవుతోంది. ‘వన్ డే.. వన్ డివిజన్’ కార్యక్రమంతో డీజిల్ చోరీ తగ్గకపోగా మరింత పెరిగింది. గతంలో డివిజన్ సూపర్‌వైజర్లు, సిబ్బంది మాత్రమే వాటాలు తీసుకోగా, ఇప్పుడు సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్ల సిబ్బంది ఇంధన కొనుగోళ్లలో పోటీపడుతున్నారు.
Locations: Hyderabad
-
బక్రీద్ కోఆర్డినేషన్ సమావేశం
HYD: రానున్న బక్రీదు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, మతపెద్దలు, ఆయా శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్, శానిటేషన్ రూల్స్ పాటించాలని సూచించారు. అత్యవసరమైతే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ అనుదీప్, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవం
మేడ్చల్: డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లో నూతనంగా ఏర్పాటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి, వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ గూడ్స్ రోడ్‌లో శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవాలయంలో పోచమ్మ, ఎల్లమ్మ, బంగారు మైసమ్మ,ముత్యాలమ్మ, ఉప్పలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన ఇంఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు జిల్ల జీత్ రావు, బాబురావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
-
బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన
HYD: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. నగర వ్యాప్తంగా వీధిలైట్లు వెలగకపోవడం, రోడ్లు దెబ్బతినడం, తరచూ సీవరేజ్, డ్రైనేజీ సమస్యలు తలెత్తడంతో లాంతర్లు, పారిశుద్ధ సిబ్బంది వేషధారణలో నిరసన తెలిపారు. ప్రభుత్వం మారినా సమస్యలు అలాగే ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆయా డివిజన్ల పరిధిలోని సమస్యలను సుమోటోగా స్వీకరించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
-
ఆయూబీ నిర్మాణానికి చర్యలు
మేడ్చల్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో గౌతమ్‌నగర్ రైల్వే గేటు వద్ద ఆర్‌యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు గౌతమ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతరామ్ యాదవ్ తెలిపారు. గౌతమ్‌నగర్ గేటు వద్ద ఆర్‌యూబీ నిర్మాణం కోసం, ఎలక్ట్రికల్ ఆధునీకరణ నిధుల కోసం అంచనా వ్యయం సిద్ధం చేయాలని ఎలక్ట్రికల్ ఎస్సీ ప్రతిమను ఉప్పల్‌లో కలిసి వినతిపత్రం అందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.
-
చర్లపల్లిలో పర్యటించిన కార్పొరేటర్
మేడ్చల్: చర్లపల్లిలో ఎస్పీడీసీఎల్ ఏఈ బాబురావు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ యాదవ్‌తో కలిసి పర్యటించారు. వేలాడుతున్న వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల లోటుపాట్లను పరిశీలించి, వంగిపోయిన స్తంభాలను వెంటనే మార్చాలని ఆదేశించారు. 2-3 రోజుల్లో స్తంభాలు మార్చి సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నాగిళ్ల బాల్ రెడ్డి, బుడిగ ప్రభు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
-
సర్దార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
HYD: బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్ పరామర్శించారు. సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్‌ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, ఇప్పటికైనా అరెస్టు చేయకపోతే బోరబండలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
-
అయోధ్య రామ్‌దర్బార్ ఆలయాలకు ద్వారాల ఏర్పాటు
HYD : అయోధ్య రామమందిరం భవనంలోని పైఅంతస్తులో గురువారం ప్రారంభం కానున్న రామ్ దర్బార్ మందిరానికి సంబందించి ద్వారాలను తయారు చేసి అక్కడ ఏర్పాటు చేసినట్లు కార్ఖానాలోని అనురాధ టింబర్ ఎస్టేట్ నిర్వాహకుడు చదలవాడ శరత్‌బాబు తెలిపారు. ఇదివరకే ప్రధాన ద్వారాన్ని తమ సంస్థ ఆధ్వర్యంలోనే తయారు చేసి ఏర్పాటు చేశామని, దీనికి ప్రధాని మోదీ ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందన్నారు.
-
నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!
HYD: నగరానికి చెందిన ఓ యువకుడు భారత నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని MJCET నుంచి మహ్మద్ అబూబకర్ సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయ్యారు. అబూబకర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(SSB)లో అర్హత సాధించారు. కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న అతను అధికారికంగా భారత నావికాదళంలో అధికారిగా చేరారు.