Locations: Hyderabad

  • చిట్టీల మోసం.. రూ.3 కోట్లతో మహిళ పరార్

    HYD: జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని శాంతినగర్‌లో చిట్టీల పేరుతో 200 మందిని మోసం చేసి ఒక మహిళ పరారైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వప్న అనే మహిళ గత 14 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తోంది. ఇటీవల చిట్టీలు ఎత్తుకున్న వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో సుమారు రూ. 3కోట్లు తీసుకుని ఆమె పారిపోయిందని బాధితులు తెలిపారు.

  • యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి బెదిరింపులు

    మేడ్చల్: అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓయువతి కారులో ట్రాకింగ్ డివైస్‌తో బెదిరిస్తున్న నిత్య పెళ్లికొడుకు రవి అలియాస్ రఫీ, అతని సోదరుడు రూపేష్‌లపై కేసు నమోదైంది. జిమ్‌లో పరిచయమైన యువతి ఆడియోలను మార్ఫింగ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన నిందితులు, రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, స్థానికనాయకుడు సాయిప్రసాద్‌పై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

  • CSMCRIలో ఉద్యోగాలు.. అర్హత.. ఇతర వివరాలు ఇవే..!

    సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎస్‌ఎంసీఆర్‌ఐ) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీలో ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు ఈపోస్టులకు అర్హులు. గరిష్ట వయస్సు 35 ఏళ్లు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.csmcri.res.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

     

  • ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనాలు ప్రారంభం

    హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. డప్పుల శబ్దాలు, కళాకారుల నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, ఎన్‌టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిమజ్జనం కోసం అధికారులు 15 క్రేన్లు, కంట్రోల్ రూమ్‌లు, మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు వంటి ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

  • సిటీలో చిమ్మచీకట్లు..

    గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి దీపాల నిర్వహణ సరిగా లేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఈఈఎస్‌ఎల్‌ గడువు ముగిసి ఏడు నెలలైనా, కొత్త ఏజెన్సీని నియమించకపోవడమే దీనికి కారణం. దాదాపు 35% వీధిదీపాలు వెలగడం లేదని, దీనివల్ల ప్రమాదాలు, దొంగతనాల భయం పెరుగుతోందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. రూ.13కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నా, పాత ఏజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • ఫ్యాన్సీ నెంబర్.. యమ కాస్లీ గురూ.!

    తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడేవారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ, రవాణా శాఖ వాటి ధరలను భారీగా పెంచింది. గతంలో రూ.50,000 ఫీజు ఉన్న 9999 నంబర్‌కు ఇప్పుడు రూ.1.50 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా, 1, 9 వంటి సింగిల్ నంబర్లకు ఫీజు రూ.50,000 నుంచి లక్షకు పెరిగింది. ఫీజులు పెంచడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్

    HYD: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్నారు. రేపటితో టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకోబోతున్న మహేష్ కుమార్ గౌడ్ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి నాయకులు, ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి మహేష్ కుమార్ గౌడ్‌ను సత్కరించి, విఘ్నేశ్వరుడి ప్రతిమను బహుకరించారు.

  • భారీ చోరీ.. 80 తులాల బంగారం అపహరణ

    మేడ్చల్: కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని ఐదో ఫేజ్‌లో భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్ చారి కుటుంబం తిరుపతికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో సుమారు 80 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. యజమానులు తిరిగి వచ్చిన తర్వాతే చోరీకి గురైన మొత్తం ఆస్తి విలువపై పూర్తి వివరాలు తెలుస్తాయి.

  • కులమతాలకు అతీతంగా గణేశ్ నిమజ్జన వేడుకలు

    మేడ్చల్: రాంపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో హిందూ, క్రిస్టియన్, ముస్లింలు కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం చివరి రోజు నిమజ్జన కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ఇలా కలిసి ఉత్సవాలు నిర్వహించడం చాలా మంచి విషయమని కొనియాడారు. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాన్ని జరుపుకోవాలని ఆయన కోరారు.

  • Teachers Day Special: గురువులకు ఆకుపై చిత్రంతో..

    మేడ్చల్: అల్వాల్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ కుమార్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన కళను ప్రదర్శించారు. ఒక ఆకుపై ఉపాధ్యాయుడు, విద్యార్థి చిత్రాలను అద్భుతంగా చిత్రించి ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇప్పటికే దేశ, రాష్ట్ర నాయకుల చిత్రాలను గీసి ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న ప్రదీప్, మరోసారి తన కళతో చూపరులను ఆకట్టుకున్నారు.