Locations: Hyderabad

  • బడా గణేశ్ నిమజ్జనంపై టెన్షన్ టెన్షన్!

    HYD: ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం కోసం ప్రతి సంవత్సరం లక్షలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనివల్ల తోపులాటలు, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈఏడాది పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శోభాయాత్ర, నిమజ్జన పాయింట్ వద్ద ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలుచేయాలి. ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, డివైడర్లపై ప్రమాదకరంగా నిలబడేవారిని నియంత్రించాలి. ఈసారి నిమజ్జనం ఎలా జరుగుతుంతో టెన్షన్ నెలకొంది.

  • ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ లారీలకు ప్రత్యేక రూట్లు

    HYD: గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్‌ బండ్‌కు వచ్చిన లారీలు తిరిగి వెళ్ళేందుకు అధికారులు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. ఎన్‌టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం పూర్తి చేసుకున్నవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాచ్యూ, కేసీపీల మీదుగా వెళ్ళాలి. అదేవిధంగా అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చిన లారీలు చిల్డ్రన్స్‌పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా తిరిగి వెళ్ళాలని అధికారులు సూచించారు.

  • NIRF-2025 ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యాసంస్థలు భేష్

    HYD: ఎన్‌ఐఆర్‌ఎఫ్-2025 ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యాసంస్థలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించగా..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) 26వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) 53వ ర్యాంకు పొందాయి. ఇంజనీరింగ్‌లో ఐఐటీహెచ్ 7వ ర్యాంకుతో టాప్‌లో నిలిచింది. ఓయూ ర్యాంకు ఈఏడాది మెరుగుపడగా..వరంగల్ నిట్, నైపర్ ర్యాంకులు మాత్రం పడిపోయాయి. లా కేటగిరీలో నల్సార్ 3వ ర్యాంకు సాధించింది.

  • GHMC కీలక నిర్ణయం.. గిన్నిస్ రికార్డే లక్ష్యం..

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఈ సంవత్సరం దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా బతుకమ్మ వేడుకలను మూడు రోజుల పాటు కార్నివాల్ తరహాలో నిర్వహించనుంది. అంతేకాకుండా, 11 లక్షల మంది ఆడపడుచులకు బతుకమ్మ కానుకలు అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

  • డ్రైన్ క్లీనింగ్‌లో రోబోటిక్ టెక్నాలజీ

    హైదరాబాద్‌లోని వరద కాలువలను శుభ్రం చేయడానికి జీహెచ్‌ఎంసీ రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా సర్కిల్-12 మెహిదీపట్నంలో ఈ పనులు మొదలయ్యాయి. కాలువల్లోని బురదను, వ్యర్థాలను వేగంగా తొలగించడం ద్వారా వర్షాల సమయంలో నీటి నిల్వలను తగ్గించి, లోతట్టు ప్రాంతాల ముంపు సమస్యను నివారించవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ టెక్నాలజీ విజయవంతమైతే, నగరవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని చెప్పారు.

  • చంపాపేట్‌లో రూ.1,11,000కు పలికిన లడ్డూ..

    HYD: చంపాపేట్‌లోని రెడ్డి బస్తీలో యంగ్‌బాయ్స్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేశుని లడ్డూ వేలంపాటలో రూ.1,11,000 కు దయానంద్ యాదవ్ దక్కించుకున్నారు. గత 14 సంవత్సరాలుగా తాము గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూను కైవసం చేసుకున్న దయానంద్ యాదవ్ కుటుంబ సభ్యులను సన్మానించారు.

  • వినాయక ఉత్సవాలు.. అక్రమార్కులకు పండగ

    HYD: వినాయక నవరాత్రి ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ ఏటా రూ.22-25 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే, నిధుల వినియోగంలో అవినీతి జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమజ్జన కోనేర్ల శుభ్రత పనుల్లో ఇంజినీర్లు, గుత్తేదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారం. ఉదాహరణకు, మియాపూర్ గుర్నాథం కోనేరుపనుల అంచనా వ్యయం రూ.11లక్షలు కాగా..కేవలం రూ.10,384 ఖర్చు చేసి భారీగా నిధులు దుర్వినియోగం చేసినట్లు వెల్లడవ్వటంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

  • HYDలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. 303 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్రల కోసం 30 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధంగా ఉన్నయి. హుస్సేన్ సాగర్‌లో 134 క్రేన్లు, 9 బోట్లు అందుబాటులో ఉంచారు. శానిటేషన్ కోసం 14,486 మంది జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు.

     

  • చల్లని తల్లి.. బల్కంపేట ఎల్లమ్మ

    హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించడం అష్టాదశ శక్తిపీఠాలను దర్శించినంత ఫలమని చెబుతారు. సుమారు 700 సంవత్సరాల క్రితం ఓరైతు బావి తవ్వుతుండగా అమ్మవారి విగ్రహం బయటపడింది. శివసత్తులు ఆఅమ్మవారిని రేణుకాంబగా గుర్తించి అక్కడే పూజలుచేయాలని సూచించారు. కాలక్రమేణా ఆప్రాంతం బెహలూఖాన్‌ గూడా నుంచి బల్కంపేటగా మారి, ఎల్లమ్మబల్కంపేట ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందారు. సృష్టిలోని జీవులందరికీ అమ్మకాబట్టి ఎల్లమ్మ అని పేరు వచ్చిందని చెబుతారు.

  • బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలి : ఆర్.కృష్ణయ్య

    HYD: బీసీ మహిళలకు అన్నిరంగాల్లో ప్రాతినిథ్యం కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జి.పద్మ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్లో పాసైన మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్‌కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.