Locations: Hyderabad

  • హెచ్‌ఏఎల్ కాలనీలో రికార్డు ధర పలికిన లడ్డూ..

    మేడ్చల్: జీడిమెట్ల 132వ డివిజన్‌లోని హెచ్‌ఏఎల్ రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వసిద్ధి వినాయకుడి లడ్డూ వేలంలో రూ.76,000 పలికింది. గంగిడి రాజశేఖర్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. నిమజ్జన శోభాయాత్రలో యువత, మహిళలు కోలాటాలు, డీజే పాటలతో ఘనంగా పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • అసలు తగ్గేదేలే.. ముంబైకి పోటీగా హైదరాబాద్‌

    HYD: గణేశ్‌ నిమజ్జనోత్సవాలంటే గతంలో ముంబై ఒక్కటే గుర్తుకొచ్చేది. ఇప్పుడు హైదరాబాద్‌ ముంబైకి గట్టి పోటీ ఇస్తోంది. ముంబైలో 3 లక్షల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, హైదరాబాద్‌లో 1.71 లక్షలు ప్రతిష్ఠించారు. అక్కడ 70 చెరువుల్లో నిమజ్జనం జరిగితే, ఇక్కడ 20 చెరువుల వద్ద జరుగుతోంది. అలాగే, ఇక్కడ 30 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, అక్కడ 24 వేల మంది మాత్రమే విధుల్లో ఉంటున్నారు.

  • ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం

    HYD: హుస్సేన్సాగర్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. 4, 5వ క్రేన్ పాయింట్ల వద్ద ఏర్పాట్లను అధికారులను, ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు ఉన్నారు.

  • ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య.. కారణమిదే!

    HYD: ప్రేమ వ్యవహారంలో విఫలమై మెదక్ జిల్లాకు చెందిన సక్కుబాయి(21) అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నారాయణఖేడ్‌కు చెందిన కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని ఇంట్లో చెప్పింది. వరుసకు అతడు అన్న అవుతాడని తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఈ నెల 1న ఆమె పురుగుల మందు తాగింది. హైదరాబాద్‌లోని గాంధీఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

  • ఆహూతులను ఉర్రూతలూగించిన ‘రసభివ’

    HYD: రవీంద్రభారతిలో గురువారం రాత్రి ఒడిశా డ్యాన్స్‌ అకాడమీ (భువనేశ్వర్‌) మర్పించిన ‘రసభివ’ ఆహూతులను ఉర్రూతలూగించింది. ‘మన్యం వీరుడు – అల్లూరి సీతారామరాజు’ నృత్య రూపకాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.

  • గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

    HYD: ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అన్ని శాఖల సమన్వయంతో గణేశ్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపై సమీక్ష చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. గణనాథుడి ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగుస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

  • పచ్చని వనంలా మారిన హుస్సేన్ సాగర్ తీరం

    HYD: హుస్సేన్‌సాగర్‌ తీరం పచ్చని వనంలా మారిపోయింది. నెక్లెస్‌ రోడ్, పీవీ ఘాట్‌ చుట్టూ కనిపించే ఈ సుందర దృశ్యం నగరవాసులను కనువిందు చేస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు, దూరంగా ఉన్న సాగరం, మధ్యలో రోడ్డు.. అన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని మరింత  ఆహ్లాదకరంగా మార్చాయి.

  • యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి రూ.4 కోట్ల ఇంటి విరాళం

    హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు, తిలక్ నగర్‌లోని తన ఇంటిని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి విరాళంగా ఇచ్చారు. రూ.4కోట్ల విలువైన జీ+3 ఇంటిని దేవస్థానం ఈవో వెంకట్రావు సమక్షంలో దేవుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈమహత్తరమైన భక్తికి గాను దాతను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్ అభినందించారు.

  • ఇదేందయ్యా.. ఇదీ.. 60 గజాలు.. ఆరు అంతస్తులు!

    HYD: నార్సింగి మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం జీప్లస్ 1 మాత్రమే అనుమతి ఉన్న 60 గజాల స్థలాల్లో 6అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. రోడ్లు కేవలం 15 అడుగులు ఉన్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు భారీగా ముడుపులు తీసుకుని అక్రమార్కులకు సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోవటంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • నిమజ్జన ఘట్టం సాఫీగా సాగేలా…

    హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం హుస్సేన్‌సాగర్‌లో జరుగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపులు సైతం ఉంటాయి. వీటి కారణంగా నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు.