Locations: Hyderabad

  • వినాయక విగ్రహాల నిమజ్జనం..ట్యాంక్‌బండ్‌ వద్ద ట్రాఫిక్ జామ్

    హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. నగర నలుమూలల నుంచి గణనాథులు ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలివచ్చారు. దీంతో అబిడ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు గణనాథులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

     

  • 1994లో రూ.450.. 2024లో రూ.30.01 లక్షలు

    హైదరాబాద్‌లోని బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ వేలంపాట ఏటా ఆసక్తిని పెంచుతోంది. 1994లో రూ.450తో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గతేడాది కొలన్‌ శంకర్‌రెడ్డి రూ.30.01 లక్షలకు లడ్డూను పాడుకున్నారు. ఈ వేలంలో ముస్లింలు కూడా పాల్గొని మతసామరస్యాన్ని చాటారు. ఈ సంప్రదాయం ఇప్పటికే 31 ఏళ్లు పూర్తి చేసుకుంది.

  • HYDలో గ్రీన్ బిల్డింగ్స్.. వీటి గురించి తెలియాలంటే ఓ లుక్కేయండి!

    హైదరాబాద్‌లో గ్రీన్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)లో నగరం నుండి 1,054 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. ఇందులో ఇళ్ళు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, మెట్రోస్టేషన్లు ఉన్నాయి. ఈగ్రీన్ బిల్డింగ్స్‌‌తో పర్యావరణ వ్యర్థాలు తగ్గి, పునర్వినియోగ వస్తువులు వాడతారు. వీటిద్వారా నీటి పొదుపు(30-50%), విద్యుత్ఆదా(20-30%) అవుతుంది. సౌరశక్తి, వర్టికల్ గార్డెన్స్ వంటివి ఉపయోగిస్తారు. ఇవి నివాసితుల ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపరచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి.

  • సేంద్రీయ సాగు.. నానో బయోటెక్నాలజీ తోడు

    హైదరాబాద్: సేంద్రీయ వ్యవసాయం, నానో బయోటెక్నాలజీతో కూరగాయల పోషక విలువలు, దిగుబడి పెంచవచ్చని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), బయోఫాక్టర్ సంస్థల ప్రయోగాల్లో వెల్లడైంది. తెలుగురాష్ట్రాలు, మహారాష్ట్రల్లోని రైతులకు ఈపద్ధతిని ప్రయోగాత్మకంగా పరిచయం చేయగా..40శాతం పోషకాలు, 15శాతం అధికదిగుబడి లభించింది. ఈఫలితాలను ఇక్రిశాట్ ధ్రువీకరించాక, తెలుగురాష్ట్రాల్లోని రైతులను ప్రోత్సహించనున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పంటల్లో విషపూరిత రసాయనాలు లేకుండా చేసేందుకు ఈపరిశోధనలు దోహదపడతాయి.

  • గంజాయి సేవిస్తున్న విద్యార్థుల అరెస్టు

    రంగారెడ్డి: మోకిల పీఎస్ పరిధిలోని ఓప్రైవేట్ యూనివర్సిటీ సమీపంలోని వసతిగృహంలో పోలీసులు దాడులుచేసి,గంజాయి తాగుతున్న 8మంది విద్యార్థులు, ఇద్దరు స్థానిక యువకులను అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరు బీటెక్, లాకోర్సులు చదువుతున్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వర్షిత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ఈనెల 28న HYDకి మిస్ వరల్డ్ సుచాత

    హైదరాబాద్‌: ప్రపంచ సుందరి ఓపల్‌ సుచాత ఈ నెల 28న నగరానికి రానున్నారు. రొమ్ము క్యాన్సర్‌ అవగాహనపై ఆ రోజు ఉదయం 5.30 గంటలకు నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించే ‘పింక్‌ పవర్‌ రన్‌’ రెండో ఎడిషన్‌లో పాల్గొంటారు. ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ ప్రాజెక్టు గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఉన్న నేపథ్యంలో ఆమెతో పాటు ఈ రన్‌కు పలు ఖండాల మిస్‌ పోటీల విజేతలు హాజరవుతున్నారు.

  • వినాయక నిమజ్జనం.. కారణం ఇదే!

    HYD: నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడిని అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఆధ్యాత్మిక, పర్యావరణ కారణాలు ఉన్నాయి. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు నీటిలో కరిగి, మళ్లీ ప్రకృతిలోకి చేరతాయని నమ్ముతారు. ఇది ఒక జీవన చక్రానికి ప్రతీక. అంతేకాకుండా, విగ్రహానికి పూజల ద్వారా లభించిన దివ్యశక్తులు నిమజ్జనం తర్వాత జలాల్లో కలిసి, సర్వత్రా వ్యాపిస్తాయని భక్తుల విశ్వాసం.

  • గణేశుడి వద్ద అసభ్య ప్రవర్తన.. పోలీసులకు చిక్కిన 930 మంది పోకిరీలు

    HYD: ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన 930 మందిని షీటీమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. 9రోజుల్లో ఈ అరెస్టులు జరిగాయని పోలీసులు తెలిపారు. క్యూలైన్లలో ఉన్న మహిళలను ఉద్దేశపూర్వకంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో 55 మంది మైనర్లు ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, మిగతా వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.

  • హైడ్రా పేరుతో రూ.50 లక్షలు మోసం

    HYD: హైడ్రా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఓ మహిళ నుంచి రూ.50లక్షలు వసూలు చేశారు. దీనిపై సదరు మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేయగా.. విచారణలో విషయం వెలుగులోకి వచ్చింది. కమిషనర్‌ ఆదేశాల మేరకు పహాడిషరీఫ్‌ ఠాణాలో నిందితులపై ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఇద్దరు డిజిటల్ మీడియా ప్రతినిధులు, ఒక న్యాయవాది ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • రాజేంద్రనగర్‌లో లారీ బోల్తా..

    రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లోని ఆరంఘర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి బేగంబజార్ వెళ్తున్న పప్పు లోడు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం కావడంతో ట్రాఫిక్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.