హైదరాబాద్‌లోని ప్రణవ వన్ ప్రెసెంట్స్ అనే సంస్థ ఆర్గానిక్ కమ్యూనిటీ ఫామ్, ప్లాంటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ప్రణవ వన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ హాల్‌లో ఈనెల 7న (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆర్గానిక్ మొక్కలు, కూరగాయలు, పండ్లు, సాంప్రదాయ మొక్కలు నాటనున్నారు.
Locations: Hyderabad
-
మహిళ దారుణ హత్య
మేడ్చల్: జవహర్ నగర్ పరిధిలోని సాకెట్ టవర్స్ సమీపంలో ఒక మహిళా మృతదేహం లభించింది. మృతురాలిని మణెమ్మ (35)గా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల క్రితం ఆమె కనపడడంలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోది ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
HYDలో ట్రాఫిక్ ఆంక్షలు
HYD: గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ వైపు వెళ్లే ప్రధాన శోభాయాత్రల నేపథ్యంలో ఈమార్గాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. బాలాపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే ఊరేగింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
-
నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్
HYD: గణేష్ నిమజ్జనం సందర్భంగా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. రాచకొండ పరిధిలో నేడు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు. సైబరాబాద్ పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్‌లు మూసేయాలని సీపీలు సుధీర్ బాబు, అవినాష్ మహంతి తెలిపారు.
-
బడా గణేశ్ వద్ద పోలీసుల అత్యుత్సాహం
HYD: ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి వెళ్లే భక్తుల దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టైం అంటే టైమే.. చెప్పినట్లే సరిగ్గా రాత్రి 12గం.కు బడా గణేశ్ దర్శనానికి వెళ్లే దారులన్నింటినీ మూసేశామంటూ భక్తులకు తెలిపారు. ‘దూరం నుంచి వచ్చాం సార్.. మొక్కేసి వెళ్తాం’ అన్నా వినకపోవడంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. దీంతో ఉత్సవ కమిటీ తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
రేపు మహా నిమజ్జనం.. సర్వం సిద్ధం
HYD : మహా నిమజ్జనంకు శనివారం హుస్సేన్‌సాగర్‌తోపాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 19కి.మీల ప్రధాన మార్గంతో పాటు.. గ్రేటర్ వ్యాప్తంగా 303కి.మీల మేర శోభాయాత్ర జరగనుంది. సాగర తీరంలోని NTR మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ట్యాంక్‌బండ్‌పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు.
-
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి రావొద్దు
HYD: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు గురువారంతో ముగిశాయని, శుక్రవారం ఎవరూ రావొద్దని సైఫాబాద్ డివిజన్ ACP సంజయ్ కుమార్ సూచించారు. నిన్నటి నుంచే నిమజ్జన పనులు ప్రారంభించారు. గణపతిని తరలించే భారీ ట్రాలీపై బేస్ పనులకు వెల్డింగ్ చేస్తున్నారు. ఎస్టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లో బెడ్ వాహనాన్ని శోభాయాత్రకు వినియోగిస్తున్నారు. ఇది 100 టన్నుల బరువును తరలించగలదు.
-
నేడు వారికి పురస్కారాలు అందజేయనున్న CM రేవంత్‌రెడ్డి
HYD : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 120 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు ‘ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2025’కు ఎంపికయ్యారు. వీరిలో పాఠశాల విద్యాశాఖ నుంచి 49, ఇంటర్ విద్యాశాఖ నుంచి 11, వర్సిటీల నుంచి 56 మంది, సాంకేతిక విద్యాశాఖ నుంచి నలుగురు ఉన్నారు.వీరందరికీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించే గురుపూజోత్సవం సందర్భంగా CM రేవంత్‌రెడ్డి పురస్కారాలను అందజేయనున్నారు.
-
వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
TG: హైదరాబాద్‌లో రేపు వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 50వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. 30వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.
-
వినాయక నిమజ్జనం వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
TG: వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7న ఉదయం 10గంటల వరకు హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.