Locations: Hyderabad

  • ఖైరతాబాద్‌.. పోలీసుల అదుపులో 930 మంది ఆకతాయిలు

    HYD: ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపం పరిసరాల్లో ఆకతాయిల చేష్టలు హద్దు మీరాయి. 9 రోజుల వ్యవధిలో మహిళలను వేధింపులకు గురి చేసిన 930 మంది ఆకతాయిల్ని షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి. వారిలో 55 మంది మైనర్లు కాగా.. మిగతావారంతా మేజర్లే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మహాగణపతి మండపం పరిసరాల్లోనే 15 మంది షీ టీమ్స్‌తో నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే.. డయల్‌ 100 ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

  • మహిళా సంఘం కమిటీ ప్రమాణ స్వీకారం

    వికారాబాద్: కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో రాజ్పుత్ మహిళా సంఘం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. రాజ్పుత్ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు అనిత ఠాకూర్ ఆధ్వర్యంలో అప్పాయిపల్లి గ్రామ అధ్యక్షురాలిగా మోతి ఠాగూర్, ప్రధాన కార్యదర్శిగా జాను ఠాగూర్, గౌరవ అధ్యక్షురాలిగా గోరి ఠాగూర్, కోశాధికారిగా రుక్మిణి ఠాకూర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

     

  • మందుబాబులకు షాక్.. వైన్స్ బంద్

    TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం దుకాణాల మూసివేతకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం 6 గంటల వరకు 36 గంటలపాటు అన్ని వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అయితే, రిజిస్టర్డ్ క్లబ్‌లు, ఫైవ్‌స్టార్ హోటళ్లకు ఈనిబంధనలు వర్తించవని తెలిపారు. నిమజ్జన శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

     

  • హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

    HYD:గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ వైపు సాగుతాయి కాబట్టి, ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

  • ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: MLA

    HYD: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని గణేశ్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, విద్యార్థులు చదువుల్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, ప్రభాకర్ గౌడ్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • రైలు కిందపడి బీటెక్ స్టూడెంట్ సూసైడ్

    HYD: వ్యక్తిగత కారణాలతో ఒక బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన చీర సాయప్రకాశ్(22) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సికింద్రాబాద్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరి తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు.

  • ALERT: OU పరీక్షలు వాయిదా

    ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ వన్‌టైమ్‌ ఛాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ(ఇయర్ వైస్ స్కీమ్) వన్‌టైమ్‌ ఛాన్స్ పరీక్షలు వచ్చేనెల 7 నుంచి ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • “ప్రపంచానికి సూర్యుడు ఎలాగో.. సమాజానికి ఉపాధ్యాయులు అలాగా”

    HYD: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించారు. “ప్రపంచానికి సూర్యుడు ఎలా వెలుగు ఇస్తాడో, సమాజానికి ఉపాధ్యాయులు అలాగే వెలుగునిస్తారు” అని ఆయన అన్నారు. పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయులకు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డులు అందజేశారు. ఈసందర్భంగా తనకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్‌ను సత్కరిస్తూ శ్రీగణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

  • వాటర్ ట్యాంక్‌లో నిమజ్జనం

    HYD: సైదాబాద్‌లోని శ్రీ వైష్ణవి అపార్ట్‌మెంట్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఈకో-ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ ట్యాంక్‌లో నిమజ్జనం చేశారు. ఈ ఏడాది లడ్డూ వేలంపాటలో టీ.పర్వతాలు లక్షా 15 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. 9రోజుల పాటు అపార్ట్‌మెంట్ వాసులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా మహిళలు నృత్యాలతో సందడి చేశారు.

  • KCR కుటుంబం అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్

    HYD: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మాట్లాడుతూ..కేవలం కవిత మాత్రమే కాకుండా కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. పదేళ్ల పాలనలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు ఇసుక మాఫియాపై కూడా విచారణ జరిపించాలని కోరారు.