Locations: Hyderabad

  • జనసంద్రంగా ఖైరతాబాద్.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో..

    HYD: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులకు ఈ రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. దర్శనానికి తక్కువ సమయం ఉండటంతో లక్షలాది మంది భక్తులు గణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. రేపు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయనున్నందున, దర్శన సమయాన్ని కుదించారు.

  • ALERT: నేటి అర్థరాత్రి వరకే..

    HYD: వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు కూడా నేటితో ముగియనున్నాయి. గురువారం అర్ధరాత్రి వరకు మాత్రమే భక్తులు గణపతిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. శనివారం జరగనున్న నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున, దర్శనాలను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శోభాయాత్ర, క్రేన్ల ఏర్పాటు పనులు సాఫీగా జరిగేందుకు భక్తులు, ప్రజలు సహకరించాలని నిర్వాహకులు, పోలీసులు కోరారు.

  • సైబర్ నేరాలపై అవగాహన

    మేడ్చల్, శామీర్‌పేట్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు విద్యార్థులకు వివరించారు. ఈకార్యక్రమంలో శామీర్‌పేట్ ఎస్ఐ దశరథ్, సైబర్ వారియర్ సుధామాధురి, కళాశాల ప్రిన్సిపల్ ఇష్రత్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • వాకింగ్‌కు వెళ్లిన వృద్దుడు మిస్సింగ్

    HYD: రాచకొండ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎన్ఎస్ కాలనీలో నివసించే జంగయ్య(70) కనిపించకుండా పోయాడు. సెప్టెంబర్ 3న ఉదయం 11:30 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. తెలిసిన చోట్లంతా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుమారుడు కృష్ణయ్య మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

  • కూకట్‌పల్లిలో అంగరంగ వైభవంగా నిమజ్జనాలు

    HYD: కూకట్‌పల్లిలో వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువు (ఐడిఎల్ లేక్) వద్ద నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నిన్న సాయంత్రం వరకు ఆ చెరువులో 9,547 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

  • పనికి వెళ్తున్నానని చెప్పి వివాహిత మిస్సింగ్

    HYD: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఒక గృహిణి అదృశ్యంపై కేసు నమోదైంది. కనుమూరి మహాలక్ష్మి(43) మూడు నెలల క్రితం కడమంచి యాదగిరిని రెండవ పెళ్లి చేసుకుని అతనితో కలిసి నివసిస్తోంది. సెప్టెంబర్ 1న పనికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన మహాలక్ష్మి తిరిగి ఇంటికి రాలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

  • గణేశ్ ఉత్సవ సమితి వార్నింగ్.. దిగొచ్చిన GHMC, HMDA

    HYD: గణేశ్ నిమజ్జనం కోసం భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి హెచ్చరికతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు దిగొచ్చారు. నిన్నటివరకు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద మాత్రమే క్రేన్‌లు ఏర్పాటు చేయగా..ఇప్పుడు ట్యాంక్‌బండ్‌పై కూడా క్రేన్‌లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌లు ఏర్పాటు చేయకపోతే తామే ఆ పని చేస్తామని ఉత్సవ సమితి డెడ్‌లైన్ విధించడంతో, ఈరోజు అధికారులు అక్కడ క్రేన్‌లను ఏర్పాటుచేశారు.

  • ఖైరతాబాద్ గణేశుడు @1954

    ఖైరతాబాద్ గణేశుడిని 1954 నుంచి ప్రతిష్ఠిస్తున్నారు. మొదటి సంవత్సరం ఒక అడుగు ఎత్తుతో ప్రారంభమై..ఇప్పుడు 69 అడుగుల భారీ విగ్రహంగా రూపొందించారు. గత 72 సంవత్సరాలలో వివిధ రూపాల్లో, ఎత్తుల్లో విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఇటీవల కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. 2020లో కోవిడ్ కారణంగా 9అడుగుల విగ్రహాన్ని మాత్రమే పెట్టారు. 2021 నుంచి మళ్ళీ విగ్రహంఎత్తును పెంచారు. ఈవిగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది.

  • NIRF ర్యాంకింగ్స్‌లో OUకు మెరుగైన స్థానం

    ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం సాధించింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో జాతీయస్థాయిలో 53వ స్థానానికి ఎగబాకింది. గతేడాది ఓయూ 70వస్థానంలో ఉంది. యూనివర్సిటీల కేటగిరీలో 30వస్థానం, రాష్ట్ర యూనివర్సిటీల కేటగిరీలో 6వ స్థానం సంపాదించింది. ఈఫలితాలపై ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఓయూ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని ఆయన అన్నారు.

  • UPSCలో లెక్చరర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాలు!

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి మంచి జీతం ఉంటుంది.