హైదరాబాద్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరు ‘Grindr’ అనే గే డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒక్కో గ్రామును రూ.10,000కు కొని, రూ.15,000కు అమ్ముతున్నారు. ఏడుగురిలో ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. డ్రగ్స్ వాడేవారిలో కొందరికి హెచ్‌ఐవీ వ్యాధి కూడా ఉన్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలా స్వామి వెల్లడించారు.
Locations: Hyderabad
-
దొంగతనం కేసు ఛేదన.. పనిమనిషే..
హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీసులు ఒక దొంగతనం కేసును ఛేదించారు. మీర్ షఫీ అలీ ఖాన్ ఇంట్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించిన పనిమనిషి షాబియా బేగంను అరెస్ట్ చేశారు. ఈబంగారు ఆభరణాల విలువ రూ.30లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని ఆమె ఓం జ్యువెలర్స్, మనుప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌లో తాకట్టు పెట్టింది. పోలీసులు తాకట్టు పెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
-
మరో 4 రోజులే గడువు.. నెలకు రూ.1,69,025 వరకు జీతం
HYD: LIC దేశవ్యాప్తంగా AAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 841 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగిఉండి ఆగస్టు 1, 2025 నాటికి 21-30సంవత్సరాలు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 8, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్3, 2025న, మెయిన్స్ పరీక్ష నవంబర్ 8, 2025న నిర్వహిస్తారు. నెలకు రూ.88,635- రూ.1,69,025 వరకు జీతం ఉంటుంది.
-
అంబర్‌పేట్‌లో గంజాయి విక్రేత అరెస్ట్
మేడ్చల్: ఉప్పల్ రోడ్డులోని అంబర్‌పేట్ చౌరస్తాలో గంజాయి విక్రయిస్తున్న కోవ్వూరి ఆనంద్‌ను ఎస్టీఎఫ్ డి-టీమ్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీ రమణ థియేటర్ వద్ద గంజాయి అమ్ముతుండగా అతడిని పట్టుకున్న పోలీసులు, అతని వద్ద నుంచి 460 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు గంజాయి, సెల్‌ఫోన్‌ను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
-
గంజాయి విక్రయం.. ముగ్గురు అరెస్ట్
మల్కాజిగిరిలోని ఆర్‌కేపురం ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. డీటీఎఫ్ టీం దాడులు నిర్వహించి నందకిశోర్, వంశీ, అఖిల్‌వార్‌లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2.2 కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
-
ఎక్కడ ఉన్నా RTCకే నా మద్దతు: సజ్జనార్
HYD: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తయింది. ఈసందర్భంగా ఆయన సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఓ సందేశం పంపారు. సిబ్బంది, కార్మికులు, అధికారుల సహకారం వల్లే ఆర్టీసీ ఆదాయం రూ.9వేల కోట్లకు పెరిగిందని అన్నారు. భవిష్యత్తులో తాను ఎక్కడ ఉన్నా ఆర్టీసీకి తన మద్దతు ఉంటుందని, సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
-
మహాగణపతి శోభాయాత్ర.. ఉ.6 గంటలకే ప్రారంభం
HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. శుక్రవారం అర్ధరాత్రి దర్శనాలు ఆగిపోయిన తర్వాత, విగ్రహాన్ని క్రేన్‌పైకి చేర్చే పనులు మొదలవుతాయి. ఈ పనులన్నీ రాత్రంతా జరుగుతాయి. ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు.
-
సచివాలయం- ఖైరతాబాద్ భారీ ట్రాఫిక్ జామ్
HYD: సచివాలయం నుంచి ఖైరతాబాద్ మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గణేష్ నిమజ్జనాలు, ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ పరిసరాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
-
ఖైరతాబాద్ మహా గణపతికి భారీ కాషాయ కండువా
HYD: ఖైరతాబాద్ మహా గణపతికి ఈ ఏడాది కూడా భారీ కాషాయ కండువాను బీజేపీ ఎస్సీ మోర్చా నగర కార్యదర్శి చంద్రు బాబా సమర్పించారు. 80 అడుగుల పొడవున్న ఈ కండువాను దేశ సైనికుల ఆపరేషన్ సింధూర్ విజయానికి కృతజ్ఞతగా, అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాలకు గుర్తుగా రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
-
శోభాయాత్ర.. 30 వేల మంది మోహరింపు
HYD:గణేశ్ మహా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా జీహెచ్‌ఎంసీ, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీపీ సీవీ ఆనంద్, జిల్లా కలెక్టర్ హరిచందన తదితర ఉన్నతాధికారులు శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు సాగే యాత్రలో ట్రాఫిక్ మళ్లింపు, పారిశుద్ధ్యం, భద్రత ఏర్పాట్లపై చర్చించారు. దాదాపు 30వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని సీపీ తెలిపారు.