Locations: Hyderabad

  • ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో సిట్ విచారణ

    HYD: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో ముగ్గురు నిందితులైన నమ్రత, కళ్యాణి, సదానందలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని 2రోజుల కస్టడీకి కోరగా..నాంపల్లి కోర్టు ఒకరోజుకు అనుమతించింది. నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిందితులను తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈకేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

  • ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

    HYD: ప్రేమలో విఫలమై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువతి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి(21) అనే యువతి ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. 3రోజుల క్రితం పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది.

  • అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

    మేడ్చల్: మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని ఇంద్రనగర్ ఫేజ్-2 మరియు మంగాపురం కాలనీలలో రూ. 24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

     

     

  • ఖైరతాబాద్ గణేషుడు కోసం భారీ ట్రాలీ.. 26 టైర్లు, 75 అడుగుల పొడవు..

    HYD: ఖైరతాబాద్‌లోని 69 అడుగుల గణేశ్ విగ్రహం నిమజ్జనం కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. 40 నుంచి 50 టన్నుల బరువున్న విగ్రహాన్ని తరలించడానికి విజయవాడ నుంచి 26 చక్రాలు, 100 టన్నుల బరువు మోయగల సామర్థ్యం ఉన్న భారీ టస్కర్ ట్రక్కును తెప్పించారు. శుక్రవారం అర్ధరాత్రి దర్శనాలు ముగిసిన తర్వాత విగ్రహాన్ని ఈట్రక్కుపైకి ఎక్కిస్తారు. శనివారం ఉదయం నిమజ్జన ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్ర సుమారు 2-3 కిలోమీటర్లు ఉంటుంది.

  • రికార్డు బ్రేక్ చేసిన లడ్డూ వేలం

    HYD: మాదాపూర్ మై హోమ్ భూజాలో గణేష్ లడ్డు వేలం రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ లడ్డు ఏకంగా రూ. 51,07,777 పలికింది. ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఈ లడ్డును దక్కించుకున్నారు. గత సంవత్సరం లడ్డు ధర రూ. 29లక్షలు మాత్రమే పలకగా.. ఈసారి దాదాపు రెట్టింపు ధరకు అమ్ముడైంది.

  • సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం.. HYDలో కనిపిస్తుంది..!

    సెప్టెంబర్7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారతదేశం అంతటా ఈగ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని 15 నగరాల్లో చాలాస్పష్టంగా కనపడనుంది. చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగావెళ్లడం వల్ల ఎరుపురంగులో మెరుస్తూ కనువిందు చేయనున్నాడు. ఈసమయంలో చంద్రుడిని నేరుగా చూడవచ్చు. ఎలాంటి ప్రత్యేక కళ్లజోడు అవసరం లేదు. బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ఉపయోగిస్తే చంద్రుడి ఉపరితలంపై ఉండే క్రేటర్లను కూడా చూడవచ్చు.

  • నిబద్ధతకు నిదర్శనం.. ఎండోమెంట్ ఆఫీసర్‌కు పదోన్నతి

    HYD: దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న జి.సురేందర్ కుమార్‌కు గ్రేడ్-2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ చేతుల మీదుగా ఆయన ఈ పదోన్నతి పత్రాన్ని అందుకున్నారు. కాచిగూడలోని పూనమ్ చంద్ గాంధీజైన్ ధర్మశాల సహా పలుదేవాలయాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు.

  • మందుబాబులకు షాక్.. HYDలో 36 గంటలు షాపులు బంద్

    గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం దుకాణాల మూసివేతకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం 6 గంటల వరకు 36 గంటలపాటు అన్ని వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అయితే, రిజిస్టర్డ్ క్లబ్‌లు, ఫైవ్‌స్టార్ హోటళ్లకు ఈనిబంధనలు వర్తించవని తెలిపారు. నిమజ్జన శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

    మేడ్చల్: ఓల్డ్ బోయిన్‌పల్లిలోని బోయిన్ చెరువు సుందరీకరణలో భాగంగా కోటి రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అస్మత్‌పేట్ కట్ట మైసమ్మ నుండి డంపింగ్ యార్డ్ వరకు ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

  • హైదరాబాద్‌కు మరో వందే భారత్ రైలు

    హైదరాబాద్‌కు మరో వందేభారత్ రైలు రానుంది. సికింద్రాబాద్-పుణే మధ్య ఈరైలు సర్వీసు ప్రారంభం కానుంది. 2నగరాల మధ్య ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈనిర్ణయం తీసుకున్నారు. వందేభారత్ రైలు 592 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే ఇది అత్యంత వేగవంతమైనది. ఈరైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం పుణేకు చేరుకుని, తిరిగి రాత్రికి సికింద్రాబాద్ వస్తుంది.