హైదరాబాద్‌కు మరో వందేభారత్ రైలు రానుంది. సికింద్రాబాద్-పుణే మధ్య ఈరైలు సర్వీసు ప్రారంభం కానుంది. 2నగరాల మధ్య ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈనిర్ణయం తీసుకున్నారు. వందేభారత్ రైలు 592 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే ఇది అత్యంత వేగవంతమైనది. ఈరైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం పుణేకు చేరుకుని, తిరిగి రాత్రికి సికింద్రాబాద్ వస్తుంది.
Locations: Hyderabad
-
కాలీఖబర్ ప్రాంతంలో కొండచిలువ కలకలం..
HYD: మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలిఖబర్ ప్రాంతంలో కొండచిలువ కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు స్నేక్ సొసైటీకి కాల్ చేశారు. ఘటనా స్థలాానికి చేరుకున్న సొసైటీ సభ్యులు కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
-
Festivals Efect: 12 ప్రత్యేక రైళ్లు
HYD: పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం గోమ్టినగర్-మహబూబ్‌నగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 28 నుంచి నవంబర్ 2 వరకు గోమ్టినగర్-మహబూబ్‌నగర్ మధ్య, ఈనెల 29 నుంచి నవంబర్ 3 వరకు మహబూబ్‌నగర్-గోమ్టినగర్ మధ్య 6చొప్పున ఈరైళ్లు నడుస్తాయి. ఈరైళ్లు కాచిగూడ, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, రామగుండం, కాజీపేట, మల్కాజిగిరి వంటి పలుస్టేషన్లలో ఆగుతాయి. ఈసేవలు ప్రయాణికులకు చాలా ఉపయోగపడతాయి.
-
మంత్రి లక్ష్మణ్ కుమార్ నివాసంలో గణేష్ శోభాయాత్ర
HYD: ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన అధికార నివాసంలో ఏర్పాటు చేసిన గణేష్ శోభాయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రెటరీ దాడిగా సందీప్ రాజ్, కేకేసి డీసీసీ జిల్లా ఛైర్మన్ గంట రాజుసాగర్, సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనంత కృష్ణారావు, హైదరాబాద్ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ భూపతి హరి తదితరులు పాల్గొన్నారు.
-
హ్యాపీ సిరామిక్స్ ప్రీమియం టైల్స్ షోరూం ప్రారంభం
మేడ్చల్: సైనిక్‌పురిలోని ఈశ్వరపురి కాలనీలో ‘హ్యాపీ సిరామిక్స్ ప్రీమియం టైల్స్’ షోరూంను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆధునికమైన ఏజీఎల్ ప్రీమియం టైల్స్, బాత్‌రూమ్ సామగ్రి అందుబాటులో ఉంచామని షోరూం యజమాని ఎన్.రమేష్ యాదవ్ తెలిపారు. నాణ్యత, అందమైన డిజైన్లతో కూడిన టైల్స్ వినియోగదారులకు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీఎల్ టైల్స్ అసోసియేట్ డైరెక్టర్ షానాక్ పటేల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
-
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై కార్పొరేటర్లతో మేయర్ టెలీ కాన్ఫరెన్స్
HYD: గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్పొరేటర్లతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ఆరా తీశారు. కొన్నిచోట్ల గుంతలు, రోడ్డు ప్యాచ్‌వర్క్‌లు, చెట్ల కొమ్మలను తొలగించాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తెచ్చారు. నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడాలని కోరారు.
-
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసం.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని అరెస్ట్
మేడ్చల్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద డబ్బులు వసూలు చేసిన ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఎం.గీత, బాధితుల నుంచి రూ.2.5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.
-
HYDలో పెరిగిన ఇండ్ల నిర్మాణాలు.. 5 నెలల్లోనే..
గ్రేటర్ హైదరాబాద్‌లో భవన నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ భారీ సంఖ్యలో అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5నెలల్లో 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా రూ.759.98 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదేకాలంలో రూ.399.61 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే, గతేడాదితో పోలిస్తే రూ.360.37కోట్లు అదనపు ఆదాయం లభించింది. ఈఏడాది సుమారు రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని జీహెచ్‌ఎంసీ ఆశిస్తోంది.
-
HYDలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ముఠాను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ‘Grindr’ అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 8 మంది ‘గే’ కన్స్యూమర్లను, డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు నైజీరియన్ పెడ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 6న అతడిని ఆసుపత్రిలో చేర్పించగా.. రాత్రి తుదిశ్వాస విడిచాడని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ పండారి తెలిపారు. మృతుడు ‘PS MANAGEMENTS’ ప్రింట్ ఉన్న నీలంరంగు టీషర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసినవారు 8712658581, 8712568516 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.