HYD: ఖైరతాబాద్ గణనాథుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనితో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్డు, లక్డీకాపూల్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ వంటి మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
Locations: Hyderabad
-
HYD అరణ్య భవన్లో టైగర్ సెల్..!
TG: రాష్ట్రంలో పులులు, చిరుతల సంచారం పెరిగిన నేపథ్యంలో అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈసెల్ పులులు, ఇతర వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా నివారించడం, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షించడం, వేటగాళ్ల నుంచి రక్షించడం వంటి పనులు చేస్తుంది. త్వరలో ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించేలా ప్రణాళికలు రూపొందించారు.
-
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల
HYD: మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. మొత్తం 2,116 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేశారు. వీరంతా అక్టోబర్ 9 నుంచి 18 వరకు హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి.
-
గణేశ్ నిమజ్జనం.. ఈ జిల్లాల్లో సెప్టెంబర్ 6న సెలవు
HYD: గణేశ్ నిమజ్జనం సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 11న రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
-
జంతువులకు ఎమోషన్స్ ఉంటాయి: గొల్లనపల్లి
HYD: మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు(ఎమోషన్స్) ఉంటాయని, వాటిని గౌరవించాలని ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్ అన్నారు. జంతువుల హక్కుల పరిరక్షణ కోసం ఈనెల7న శిల్పారామం నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ‘యానిమల్ రైట్స్ మార్చ్- 2025’ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మనిషి స్వార్థం కోసం జంతువుల స్వేచ్ఛను హరిస్తున్నారని, వాటికి కూడా నొప్పి, సంతోషం, బాధ ఉంటాయని ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు.
-
శ్రీ యోగ గణపతి అలంకరణలో గణనాథుడు దర్శనం
HYD: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని సంపత్ వినాయగర్ ఆలయంలో స్వామి వారు బుధవారం శ్రీ యోగ గణపతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు స్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
-
ఇదొక సజీవ శిల్పం.. చక్కని బార్బి రూపం..
హైదరాబాద్: ఇదొక సజీవ శిల్పం.. చక్కని బార్బి రూపం.. రెండు రకాల గ్రౌండ్‌కవర్స్ మొక్కలతో పచ్చని గౌనేసినట్లు తీర్చిదిద్దారు. హైడ్రోఫిలిక్ ఫోమ్‌పై మొక్కలతో రూపొందించారు. ఖరీదు లక్షన్నర. ముంబయి నుంచి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మట్టిలాంటి ఫోమ్‌లో మొక్కలకు అవసరమైన పోషకాలు అందిస్తారు. మియాపూర్‌లో కొత్తగా ఏర్పాటైన యునిస్పేస్ షోరూంలోని ఈఎల్‌టీ ఇండియా స్టాల్‌లో ప్రదర్శించారు.
-
ఈ నెల 6న సాలార్జంగ్ మ్యూజియం బంద్
హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియానికు ఈనెల 6వ తేదీన సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. గణేశ్ శోభయాత్ర, నిమజ్జనోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో మ్యూజియం సందర్శన నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దూర ప్రాంతం నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్ సందర్శకులకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
-
గణేశ్ నవరాత్రుల వేళ.. ఒక్కో ఠాణాలో.. ఒక్కో రూల్
HYD: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొన్ని పోలీస్‌స్టేషన్లలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిప్రాంతాల్లో నిమజ్జనాలకు పాడ్‌బ్యాండ్‌ను అనుమతిస్తుండగా..మరికొన్ని చోట్ల కేసులు పెడుతున్నారు. ఉన్నతాధికారుల సూచనలను పట్టించుకోకుండా, కొంతమంది పోలీసులు తమ ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వనస్థలిపురం డివిజన్‌లో పక్కపక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లలో విభిన్నమైన ఆంక్షలు భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈవ్యవహారంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
-
Real Estate Alert: 18న బాచుపల్లి ప్లాట్ల ఈ–వేలం
హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) బాచుపల్లి లేఅవుట్‌లోని 70 ఖాళీ ప్లాట్లకు ఈనెల18న ఈ-వేలం నిర్వహించనుంది. ఈవేలంపై బుధవారం ప్రీ-బిడ్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అధికారులు వేలంపాట విధానం, ప్లాట్ల వివరాలు వివరించారు. ఈ ప్రాంతం అభివృద్ధి అవకాశాలపై ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్లో వివరాలు చూడవచ్చు.