Locations: Hyderabad

  • రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా..

    HYD: సైబర్ నేరగాళ్లు కరెంట్, వాటర్ బిల్లులు, పెండింగ్ చలాన్ల పేరుతో కొత్తతరహాగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షల పేరుతో ఏపీకే లింకులను పంపుతున్నారు. ఆ లింకులను ఓపెన్ చేస్తే మొబైల్ హ్యాక్‌చేసి, బ్యాంకు ఖాతా సమాచారం సేకరిస్తున్నారు. ఈసమాచారంతో ఆఖరికి పీఎఫ్‌ ఖాతాల్లోని డబ్బు కూడా కొట్టేస్తున్నారు. ఇలాంటి లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    HYD:  పది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,06,860కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.97,950 గా పలుకుతోంది. ఇటు కేజీ వెండి ధర రూ.1,37,000గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

  • దయనీయ స్థితిలో యువకుడు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

    HYD: ఎస్సార్‌నగర్ ప్రధాన రహదారిపై యువకుడు దయనీయ స్థితిలో కాలం వెళ్ళదీస్తున్నాడు. మెహిదీపట్నానికి చెందిన అశోక్(32) చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి..ఆ తర్వాత తల్లిని కూడా కోల్పోయాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒంటరిగా జీవించడంతో నరాల వ్యాధి బారిన పడి కాళ్లు చచ్చుబడ్డాయి. దీంతో రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై దాతలు ఇచ్చిన బండిపై నివసిస్తున్నాడు. కనీసం దివ్యాంగుల పింఛనైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

  • బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు శోభాయాత్ర

    HYD: ఈనెల6న జరిగే గణేశ్ శోభాయాత్రకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ఈ యాత్ర సాగుతుంది. నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను నిమజ్జనం కోసం సిద్ధం చేశారు. క్రేన్లు, లైట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. మరోవైపు, బుధవారం తోపులాట జరిగిన నేపథ్యంలో, ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఖైరతాబాద్ గణేశ్ దర్శనాలను అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నారు.

  • ఆరోజు కూడా ఆంక్షలా.. పోలీసులపై భక్తుల మండిపాటు

    HYD: గణేశ్ ఉత్సవాల సందర్భంగా డీజే సౌండ్స్ ఉపయోగించవద్దని పోలీసులు గణేశ్ ఉత్సవ కమిటీలను హెచ్చరిస్తున్నారు. ఈహెచ్చరికలు కమిటీ సభ్యులలో ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువులు తమ పండుగను వైభవంగా జరుపుకునే ఏకైకరోజు గణేశ్ ఉత్సవమని, ఈరోజు కూడా ఆంక్షలు విధించడం సరికాదని భక్తులు వాదిస్తున్నారు. మిగతా రోజులలో పెద్దగా సౌండ్ పెట్టేవారిపై పోలీసులు చర్యలు తీసుకోరని, కేవలం పండుగరోజునే ఆంక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

  • ఇప్పటికి సరిపడ వర్షాలు.. ఇక నుంచి కురిస్తే బోనస్సే..!

    హైదరాబాద్‌:నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు సంతృప్తికర స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతానికి మించి వానలు పడ్డాయి. అయితే ఈ సీజన్‌ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంది కాబట్టి.. ఇకపై కురిసే వర్షాలు అదనమేనని, వర్షాలు కురిస్తే సగటు సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

  • చిరునామా ఉంటే చాలు.. RTC ప్రయాణం ఉచితమే

    HYD: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ స్పష్టత ఇచ్చారు. ఆధార్‌‌కార్డులో తెలంగాణ చిరునామా ఉంటే చాలు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఆధార్‌ కార్డులో రాష్ట్రంపేరు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నా.. చిరునామా తెలంగాణ పరిధిలో ఉంటే సరిపోతుంది. ఆధార్‌తో పాటు ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు.

     

  • HYDకు 40 శాతం రక్షణ ‘గొడుగు’

    హైదరాబాద్‌లో భారీ వర్షాలతో వచ్చే వరదల నివారణకు జీహెచ్‌ఎంసీ భూగర్భ జలాశయాలను నిర్మించింది. జపాన్ స్ఫూర్తితో రూ.15.69 కోట్లతో 11 ప్రాంతాల్లో ఈ ట్యాంకులు నిర్మించారు. ఇవి 3 సెం.మీ.ల వరకు కురిసే వర్షం నుంచి వంద శాతం రక్షణ ఇస్తున్నాయి. ఇటీవల కురిసిన 7-8 సెం.మీ.ల వర్షంలో కూడా ఇవి 40 శాతం ఉపశమనం కల్పించాయని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఈవిధానం విజయవంతమైందని పేర్కొన్నారు.

  • ఆత్మహత్య ఆలోచనను మార్చే అద్భుతమైన ప్రవచనం

    జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించే వారికి ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ చేసిన ప్రసంగం ఆలోచింపజేస్తోంది. కష్టకాలంలో చనిపోవాలనే ఆలోచన చాలామందికి వస్తుందని, కానీ అలా మరణిస్తే తర్వాత వచ్చే సంతోషాన్ని అనుభవించడానికి మనం బతికుండాలని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన   వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

     

     

  • భర్తను వదిలి వెళ్లిన భార్య

    HYD: నాగోల్ పీఎస్ పరిధిలోని తట్టిఅన్నారంలో జైహిందర్ అనే వ్యక్తి భార్య సావిత్రి భర్తను వదిలి వెళ్ళింది. క్యాటరింగ్ చేసే ఆమె, భర్త తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. తన ఐదేళ్ల కుమారుడు విక్రాంత్‌తో కలిసి వెళ్తున్నానని లేఖ రాసిపెట్టింది. ఆమె బెంగళూరులో ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లిందని పోలీసులు భావిస్తున్నారు. భర్త జైహిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.