HYD: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొన్ని పోలీస్‌స్టేషన్లలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిప్రాంతాల్లో నిమజ్జనాలకు పాడ్‌బ్యాండ్‌ను అనుమతిస్తుండగా..మరికొన్ని చోట్ల కేసులు పెడుతున్నారు. ఉన్నతాధికారుల సూచనలను పట్టించుకోకుండా, కొంతమంది పోలీసులు తమ ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వనస్థలిపురం డివిజన్‌లో పక్కపక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లలో విభిన్నమైన ఆంక్షలు భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈవ్యవహారంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Locations: Hyderabad
-
Real Estate Alert: 18న బాచుపల్లి ప్లాట్ల ఈ–వేలం
హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) బాచుపల్లి లేఅవుట్‌లోని 70 ఖాళీ ప్లాట్లకు ఈనెల18న ఈ-వేలం నిర్వహించనుంది. ఈవేలంపై బుధవారం ప్రీ-బిడ్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అధికారులు వేలంపాట విధానం, ప్లాట్ల వివరాలు వివరించారు. ఈ ప్రాంతం అభివృద్ధి అవకాశాలపై ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్లో వివరాలు చూడవచ్చు.
-
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ కోసం హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులని సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
-
HYDలో పెరుగుతున్న విష జ్వరాలు
HYD: గ్రేటర్ పరిధిలో విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.హైదరాబాద్‌లో వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్న రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, ఫీవర్ ఆసుపత్రులతో పాటు ఉస్మానియా, గాంధీఆసుపత్రులలో ఓపీ రోగుల సంఖ్య 50% పెరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలో కూడా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
-
‘మారేడ్‌పల్లిని బాలకార్మిక రహిత మండలంగా తీర్చిదిద్దుదాం’
HYD: మారేడ్‌పల్లిని బాలకార్మిక రహిత మండలంగా తీర్చిదిద్దుదామని డిప్యూటీ IOS మదన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏసీఎస్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రమాదేవి, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, కాంపల్లి, సువర్ణ, సుమలత తదితరులు పాల్గొన్నారు.
-
ఉట్టికొట్టే కార్యక్రమంలో విషాదం..
మేడ్చల్ పట్టణం కిందిబస్తీలో ఉట్టికొట్టే కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఉట్టి కొట్టేందుకు ఇనుప వైరును విద్యుత్ స్తంభాలకు కట్టగా.. అది తెగిపోయింది. ఆ వైరును ఎస్‌బీఐ బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి నరేశ్ (30) పట్టుకున్నాడు. చెప్పులు లేకపోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
-
చేతివృత్తుల కళలకు అద్దం పట్టిన ‘చర్ణ్-2025’
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ(సీసీటీ) ఆధ్వర్యంలో ‘చర్ణ్-2025..యాన్ ఆర్టిజన్స్ మండి’ పేరుతో హస్త, శిల్ప కళాకృతుల ప్రదర్శన జరిగింది. కళలకు ఆదరణ పెంచడం, వాటి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏటా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి 25 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్రంలోని ఎల్లమ్మ తండా ప్రాంతాల్లో రూపొందించిన కళాకృతులు ఆకర్షణగా నిలిచాయి.
-
గణనాథుడిని దర్శించుకున్న మంచు మనోజ్ దంపతులు
HYD: సికింద్రాబాద్‌లోని సీతాఫలమండిలో టీఆర్‌టీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడిని సినీ నటుడు మంచు మనోజ్ సతీమణి మౌనిక దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం తమకు ఆనవాయితీగా వస్తోందని మంచు మనోజ్ తెలిపారు. తమ ప్రేమ, పెళ్లి గురించి వినాయకుడి దయ వల్లే బయటి ప్రపంచానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
-
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
HYD: పది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,06,860కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.97,950 గా పలుకుతోంది. ఇటు కేజీ వెండి ధర రూ.1,37,000గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.