HYD: మారేడ్‌పల్లిని బాలకార్మిక రహిత మండలంగా తీర్చిదిద్దుదామని డిప్యూటీ IOS మదన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏసీఎస్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రమాదేవి, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, కాంపల్లి, సువర్ణ, సుమలత తదితరులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
ఉట్టికొట్టే కార్యక్రమంలో విషాదం..
మేడ్చల్ పట్టణం కిందిబస్తీలో ఉట్టికొట్టే కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఉట్టి కొట్టేందుకు ఇనుప వైరును విద్యుత్ స్తంభాలకు కట్టగా.. అది తెగిపోయింది. ఆ వైరును ఎస్‌బీఐ బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి నరేశ్ (30) పట్టుకున్నాడు. చెప్పులు లేకపోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
-
చేతివృత్తుల కళలకు అద్దం పట్టిన ‘చర్ణ్-2025’
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ(సీసీటీ) ఆధ్వర్యంలో ‘చర్ణ్-2025..యాన్ ఆర్టిజన్స్ మండి’ పేరుతో హస్త, శిల్ప కళాకృతుల ప్రదర్శన జరిగింది. కళలకు ఆదరణ పెంచడం, వాటి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏటా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి 25 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్రంలోని ఎల్లమ్మ తండా ప్రాంతాల్లో రూపొందించిన కళాకృతులు ఆకర్షణగా నిలిచాయి.
-
గణనాథుడిని దర్శించుకున్న మంచు మనోజ్ దంపతులు
HYD: సికింద్రాబాద్‌లోని సీతాఫలమండిలో టీఆర్‌టీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడిని సినీ నటుడు మంచు మనోజ్ సతీమణి మౌనిక దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం తమకు ఆనవాయితీగా వస్తోందని మంచు మనోజ్ తెలిపారు. తమ ప్రేమ, పెళ్లి గురించి వినాయకుడి దయ వల్లే బయటి ప్రపంచానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
-
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
HYD: పది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,06,860కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.97,950 గా పలుకుతోంది. ఇటు కేజీ వెండి ధర రూ.1,37,000గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-
దయనీయ స్థితిలో యువకుడు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
HYD: ఎస్సార్‌నగర్ ప్రధాన రహదారిపై యువకుడు దయనీయ స్థితిలో కాలం వెళ్ళదీస్తున్నాడు. మెహిదీపట్నానికి చెందిన అశోక్(32) చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి..ఆ తర్వాత తల్లిని కూడా కోల్పోయాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒంటరిగా జీవించడంతో నరాల వ్యాధి బారిన పడి కాళ్లు చచ్చుబడ్డాయి. దీంతో రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై దాతలు ఇచ్చిన బండిపై నివసిస్తున్నాడు. కనీసం దివ్యాంగుల పింఛనైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
-
బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు శోభాయాత్ర
HYD: ఈనెల6న జరిగే గణేశ్ శోభాయాత్రకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఈ యాత్ర సాగుతుంది. నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను నిమజ్జనం కోసం సిద్ధం చేశారు. క్రేన్లు, లైట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. మరోవైపు, బుధవారం తోపులాట జరిగిన నేపథ్యంలో, ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఖైరతాబాద్ గణేశ్ దర్శనాలను అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నారు.
-
ఆరోజు కూడా ఆంక్షలా.. పోలీసులపై భక్తుల మండిపాటు
HYD: గణేశ్ ఉత్సవాల సందర్భంగా డీజే సౌండ్స్ ఉపయోగించవద్దని పోలీసులు గణేశ్ ఉత్సవ కమిటీలను హెచ్చరిస్తున్నారు. ఈహెచ్చరికలు కమిటీ సభ్యులలో ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువులు తమ పండుగను వైభవంగా జరుపుకునే ఏకైకరోజు గణేశ్ ఉత్సవమని, ఈరోజు కూడా ఆంక్షలు విధించడం సరికాదని భక్తులు వాదిస్తున్నారు. మిగతా రోజులలో పెద్దగా సౌండ్ పెట్టేవారిపై పోలీసులు చర్యలు తీసుకోరని, కేవలం పండుగరోజునే ఆంక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
-
ఇప్పటికి సరిపడ వర్షాలు.. ఇక నుంచి కురిస్తే బోనస్సే..!
హైదరాబాద్:నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు సంతృప్తికర స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతానికి మించి వానలు పడ్డాయి. అయితే ఈ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంది కాబట్టి.. ఇకపై కురిసే వర్షాలు అదనమేనని, వర్షాలు కురిస్తే సగటు సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.