HYD: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టత ఇచ్చారు. ఆధార్‌కార్డులో తెలంగాణ చిరునామా ఉంటే చాలు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఆధార్ కార్డులో రాష్ట్రంపేరు ఆంధ్రప్రదేశ్ ఉన్నా.. చిరునామా తెలంగాణ పరిధిలో ఉంటే సరిపోతుంది. ఆధార్‌తో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు.