హైదరాబాద్‌లో భారీ వర్షాలతో వచ్చే వరదల నివారణకు జీహెచ్ఎంసీ భూగర్భ జలాశయాలను నిర్మించింది. జపాన్ స్ఫూర్తితో రూ.15.69 కోట్లతో 11 ప్రాంతాల్లో ఈ ట్యాంకులు నిర్మించారు. ఇవి 3 సెం.మీ.ల వరకు కురిసే వర్షం నుంచి వంద శాతం రక్షణ ఇస్తున్నాయి. ఇటీవల కురిసిన 7-8 సెం.మీ.ల వర్షంలో కూడా ఇవి 40 శాతం ఉపశమనం కల్పించాయని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఈవిధానం విజయవంతమైందని పేర్కొన్నారు.
Locations: Hyderabad
-
ఆత్మహత్య ఆలోచనను మార్చే అద్భుతమైన ప్రవచనం
జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించే వారికి ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ చేసిన ప్రసంగం ఆలోచింపజేస్తోంది. కష్టకాలంలో చనిపోవాలనే ఆలోచన చాలామందికి వస్తుందని, కానీ అలా మరణిస్తే తర్వాత వచ్చే సంతోషాన్ని అనుభవించడానికి మనం బతికుండాలని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
-
భర్తను వదిలి వెళ్లిన భార్య
HYD: నాగోల్ పీఎస్ పరిధిలోని తట్టిఅన్నారంలో జైహిందర్ అనే వ్యక్తి భార్య సావిత్రి భర్తను వదిలి వెళ్ళింది. క్యాటరింగ్ చేసే ఆమె, భర్త తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. తన ఐదేళ్ల కుమారుడు విక్రాంత్‌తో కలిసి వెళ్తున్నానని లేఖ రాసిపెట్టింది. ఆమె బెంగళూరులో ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లిందని పోలీసులు భావిస్తున్నారు. భర్త జైహిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
-
HYDలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
హైదరాబాద్‌లో రహదారులపై అతి వేగం కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర రహదారుల శాఖ నివేదిక ప్రకారం.. 2021 నుంచి నగరంలో రోడ్డు ప్రమాదాలు ఏటా 10% పెరుగుతున్నాయి. 2023లో ప్రమాదాలు 17 % పెరిగాయి. ద్విచక్రవాహనదారులు, పాదచారులే ఎక్కువగా చనిపోతున్నారని నివేదిక తెలిపింది. హెల్మెట్ ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్‌రూట్ వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలు. పాదచారుల్లో వృద్ధులు, భిక్షాటకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు.
-
మ్యాన్‌హోల్స్ శుభ్రం చేయడానికి రోబో
హైదరాబాద్‌లో రోడ్ల ముంపు సమస్యను తగ్గించడానికి జీహెచ్ఎంసీ రోబో సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇటీవల మెహిదీపట్నంలో ఒక రోబోను విజయవంతంగా పరీక్షించారు. ఈ రోబో గంటలో ఒక లారీ పూడికను తొలగించగలదు. మ్యాన్‌హోల్స్‌లోని వ్యర్థాలు, రాళ్లను సులభంగా తొలగిస్తుంది. బురద, మురుగును బయటకు పంపిస్తుంది. రోబోలో ఉన్న కెమెరాలు పనితీరును రికార్డు చేస్తాయి. ముంపు సమస్యకు ఒక మంచి పరిష్కారం కాగలదని అధికారులు భావిస్తున్నారు.
-
ఒకే గ్రామం- ఒకటే మట్టి వినాయకుడు
రంగారెడ్డి: శంషాబాద్‌లోని రషీద్‌గూడ గ్రామం, ‘ఒకే గ్రామం- ఒకటే మట్టి వినాయకుడు’ అనే నినాదంతో ఐక్యతను చాటుకుంటోంది. 2010లో యువకులు తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్థులంతా కట్టుబడి ఉన్నారు. 1500లకు పైగా జనాభా ఉన్న ఈగ్రామంలో యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. అన్నివర్గాల ప్రజలు కలిసికట్టుగా పూజలు చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
-
యూనిఫాం వ్యాపారం పేరుతో రూ.150 కోట్లు మోసం
HYD: యూనిఫాం వ్యాపారంలో పెట్టుబడి పేరుతో ఓ మహిళ రూ.73కోట్లు మోసం చేసింది. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారికి శ్రీసాయిరామ్ ఎంటర్ప్రైజెస్ యజమాని సంధ్యారాణి పరిచయమైంది. పాఠశాలలకు యూనిఫాం ఆర్డర్లు ఉన్నాయని నమ్మించి, దశలవారీగా రూ.73కోట్లు వసూలు చేసింది. లాభాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడుల ముసుగులో రూ.150కోట్లకుపైగా వసూలు చేసినట్టు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి కీలక నిందితులను అరెస్ట్ చేశారు.
-
HYDలో పెరుగుతున్న విడాకుల కేసులు
TG: పెళ్లి చేసుకున్న కొంత కాలానికే విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య హైదరాబాద్‌లో పెరుగుతోంది. గ్రేటర్ హైదరాాబాద్‌లో ఏటా నమోదవుతున్న విడాకుల కేసులు 2500-3000 వరకు ఉంటన్నాయి. సర్దుకుపోవడం రాక, ఎందులో తక్కువ అనే భావన, అనవసర విషయాల్లో పెద్దల జోక్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు.
-
HYDలో 6వ తేదీన పోలీసులకు బిగ్గెస్ట్ టాస్క్..
హైదరాబాద్‌లో ఈ నెల 6న జరగనున్న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారింది. దీనికోసం పోలీసులు పక్కా రూట్‌మ్యాప్ విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ నుంచి పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి విగ్రహం, అంబేడ్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్‌కు గణేశ్ విగ్రహాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
రంగారెడ్డి: రాజేంద్రనగర్ అత్తాపూర్ పీఎస్ పరిధిలోని మూసీ నది ఒడ్డున దారుణ హత్య జరిగింది. ఇద్దరు యువకులు పాత గొడవలతో మద్యం సేవించిన తర్వాత గొడవ పడ్డారు. వాగ్వాదం తీవ్రం కావడంతో ఒక యువకుడు కత్తితో మరో యువకుడిని పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.