హైదరాబాద్‌లో తొమ్మిదో రోజు వినాయకులను నిమజ్జనం చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనితో బ్యాంక్‌బండ్, ట్యాంక్‌బండ్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు, వేలాది బైకులు రోడ్లపై నిలిచిపోయాయి. అర్ధరాత్రి వరకు ప్రజలు నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు వస్తున్నారు. ఇందిరాపార్క్, లిబర్టీ, రాణిగంజ్ వంటి రూట్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఈ మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Locations: Hyderabad
-
శోభాయాత్రలో రాహుల్ సిప్లిగంజ్, సీఐ డాన్స్
HYD: నవరాత్రులు పూజలందుకున్న గణేశుడిని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన అపార్ట్మెంట్‌లో నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ బందోబస్తుకు ఏర్పాటు చేశారు. రాహుల్, సీఐని శాలువాతో సత్కరించారు. డ్యూటీలో బిజీగా ఉన్నప్పటికీ రాహుల్‌తో కలిసి డప్పు చప్పుళ్లకు కాలు కదిపి సందడి చేశారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
-
బైక్, కారు కడిగాడు.. రూ.10 వేల జరిమానా
HYD: బంజారాహిల్స్‌లో తాగునీటిని దుర్వినియోగం చేసిన ఇద్దరిపై జలమండలి కఠిన చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, ఓవర్‌ఫ్లో అయ్యేలా నీరు వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు తాగడానికి మాత్రమేనని, ఇలా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. ఉదయాన్నే రోడ్లు, ఇంటి పరిసరాలు నీటితో కడిగేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
-
ఇవాళ రాత్రి 12 గంటల వరకే ఛాన్స్!
TG: ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ఇవాళే లాస్ట్. నేటి అర్ధరాత్రి 12 గంటల తర్వాత గణేశ్ దర్శనానికి భక్తులను అనుమతించరు. ఎల్లుండి నిమజ్జనం ఉండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లను రేపు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఎల్లుండి ఉదయం 6గంటలకు శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఇప్పటివరకు 30లక్షలమంది గణేశ్‌ను దర్శించుకున్నారు. మరోవైపు 9వరోజు నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి నుంచి ట్యాంక్‌బండ్ వైపు వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
-
ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు
TG: ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 8వ రోజు విశ్వరూప మహాగణపతి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బడా గణేష్‌ను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, సచివాలయం మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వారం రోజుల్లో దాదాపు 12 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
-
హరీశ్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్ ఓడిపోయారు: కవిత
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. తన కజిన్స్ అయిన హరీశ్ రావు, సంతోష్ కుమార్ వల్లే పార్టీతో పాటు తన తండ్రి కేసీఆర్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డితో వారికి రహస్య ఒప్పందం ఉందని, పార్టీలోని ఓ వర్గం తనను కుటుంబం నుంచి వేరుచేసేందుకు కుట్ర పన్నిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
-
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ సీపీ
మేడ్చల్: సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) గజరావ్ భూపాల్ పరిశీలించారు. నిమజ్జనం సజావుగా జరిగేలా ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
-
చేవెళ్ల గణపతి విగ్రహాన్ని శ్రీశైలంలో నిమజ్జనం
రంగారెడ్డి: చేవెళ్ల మల్లికార్జున కాలనీలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని బుధవారం శ్రీశైలంలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో వడ్డే లింగం గారు రూ.22 వేలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. నిమజ్జనం అనంతరం భక్తులు శ్రీశైలంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర యూత్ అసోసియేషన్ సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
-
రామంతపూర్‌లో గణేష్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే
మేడ్చల్ : రామంతపూర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 33వ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, బిజెపి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
మినీ ట్యాంక్ బండ్ వద్ద మెడికల్ క్యాంపు
HYD: సఫిల్‌గూడ మినీ ట్యాంక్ బండ్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, సిబ్బంది కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర యాదవ్ ఈ క్యాంపును పరిశీలించారు. నిమజ్జనం జరిగే సమయంలో వైద్య సహాయం అవసరమైన వారికి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ. లక్ష్మణ్, డి.ఈ. మహేష్, ఏ.ఎం.ఓ.హెచ్. మంజుల తదితరులు పాల్గొన్నారు.