రంగారెడ్డి: చేవెళ్ల మల్లికార్జున కాలనీలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని బుధవారం శ్రీశైలంలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో వడ్డే లింగం గారు రూ.22 వేలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. నిమజ్జనం అనంతరం భక్తులు శ్రీశైలంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర యూత్ అసోసియేషన్ సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
రామంతపూర్‌లో గణేష్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే
మేడ్చల్ : రామంతపూర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 33వ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, బిజెపి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
మినీ ట్యాంక్ బండ్ వద్ద మెడికల్ క్యాంపు
HYD: సఫిల్‌గూడ మినీ ట్యాంక్ బండ్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, సిబ్బంది కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర యాదవ్ ఈ క్యాంపును పరిశీలించారు. నిమజ్జనం జరిగే సమయంలో వైద్య సహాయం అవసరమైన వారికి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ. లక్ష్మణ్, డి.ఈ. మహేష్, ఏ.ఎం.ఓ.హెచ్. మంజుల తదితరులు పాల్గొన్నారు.
-
సర్పంచ్‌ను పరామర్శించిన స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్: మర్పల్లి మండలం, కల్కోడా మాజీ సర్పంచ్ రాచన్న రోడ్డు ప్రమాదంలో గాయపడి శంకర్‌పల్లిలోని గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన్ని పరామర్శించారు. రాచన్నకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు స్పీకర్ తెలిపారు. ఈ పరామర్శలో స్థానిక కాంగ్రెస్ నాయకులు స్పీకర్‌తో పాటు పాల్గొన్నారు.
-
జిల్లెలగూడ గణేష్ ఉత్సవాల్లో సీఐలు
రంగారెడ్డి: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో ఏడవ రోజున మీర్‌పేట్ సీఐ శంకర్ నాయక్, భోనగిరి ట్రాఫిక్ సీఐ మధుసూదన్ పాల్గొన్నారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్కల కాశీనాథ్ రెడ్డి, సభ్యులు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు
-
హైదరాబాద్‌లో అక్రమ మద్యం పట్టివేత
హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని చత్రినాకలో పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ.50,000/- విలువ చేసే 70.2 లీటర్ల మద్యం, బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు శోభారాణి అలియాస్ లలితమ్మతో పాటు దీపక్ కుమార్, నితీష్ కుమార్‌లను అరెస్టు చేశారు. శోభారాణిపై గతంలో కూడా అనేకకేసులు నమోదయ్యాయి. మద్యంషాపులు మూసినతర్వాత అధికధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
గణేష్ నిమజ్జనం.. షవర్ బాత్ చేసిన గణపతి
HYD: సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్నంగా గణేష్ నిమజ్జనం చేశారు. జీహెచ్‌ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని డీజేలు, ఆర్భాటాలు లేకుండా, కార్యాలయం ఆవరణలోనే ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు కోలాటాలు ఆడుతూ గణపతికి వీడ్కోలు పలికారు.
-
బాలాపూర్ గణేష్‌ను సందర్శించిన సీపీలు, కలెక్టర్
HYD: బాలాపూర్ గణేషుడిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్ బాబు, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తదితరులు దర్శించుకున్నారు. నిమజ్జనం జరిగే రూట్‌ను బస్సులో పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు అధికారులను సత్కరించారు.
-
ప్రింట్ మీడియా అధ్యక్షులు బూర్గుల ఫణీంద్రకు సన్మానం
రంగారెడ్డి: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) షాద్‌నగర్ డివిజన్ ప్రింట్ మీడియా అధ్యక్షులు బూర్గుల ఫణీంద్రకు ఘన సన్మానం జరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ ఆగిరి రవికుమార్ గుప్తా ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, ఇన్ముల్ నర్వ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాలువా, పూలమాలలతో ఫణీంద్రను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
-
దొంగ ఓట్ల తొలగింపునకు ఫిర్యాదు
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్ మెట్ మండలం, మజీద్‌పూర్ గ్రామంలో 120కి పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని తహశీల్దార్ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు అందింది. స్థానిక నివాసం లేని వారి ఓట్లను తొలగించాలని ఇప్పటికే బీఎల్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని తహశీల్దార్ తెలిపారు. పారదర్శక ఎన్నికల కోసం నిజాయితీగా పనిచేయని బీఎల్‌ఓలను తొలగించాలని కూడా కోరారు.