HYD: టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండి రమేష్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గంలోని పలు గణేష్ మండపాలను సందర్శించారు. కేపీహెచ్‌బీ కాలనీ, అల్లాపూర్, బాలానగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు శుభాకాంక్షలు తెలిపి, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
ఉప్పొంగిన పెనుగంగ నది
కుమ్రం భీం: సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట పోడ్స్ వద్ద పెనుగంగ నది ఉప్పొంగింది. బ్యాక్ వాటర్ కారణంగా బ్రిడ్జి పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు వంతెనను మూసివేసి పహారా ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. దీంతో ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-
మున్సిపాలిటీలో నోటిఫికేషన్ లేకుండా నియామకాలు
వికారాబాద్: మున్సిపాలిటీలో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పలుకుబడి ఉన్నవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని, ఒకే కుటుంబానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నియామకాలపై చర్యలు తీసుకోవాలని, అర్హులకు మాత్రమే నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను నిరుద్యోగులు కోరుతున్నారు.
-
లండన్‌లో మరణించిన చైతన్య కుటుంబానికి కొండా పరామర్శ
రంగారెడ్డి: లండన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బడంగ్‌పేట్‌కు చెందిన తర్రే చైతన్య యాదవ్ కుటుంబ సభ్యులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు అందెల శ్రీరాములు కూడా ఉన్నారు. చైతన్య మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోందని, లండన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడుతోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
-
ట్యాంక్‌బండ్ వద్ద భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఆందోళన
HYD: ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన జాలీలను తొలగించి, క్రేన్‌లను ఏర్పాటు చేయాలని కోరుతూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. వారి నిరసన కారణంగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన అక్కడ తాత్కాలికంగా ట్రాఫిక్ అంతరాయానికి దారితీసింది.
-
కవితను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయమే: మల్లారెడ్డి
HYD: పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ సరైన నిర్ణయమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలని శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు పార్టీయే ముఖ్యమని, పార్టీని ధిక్కరించేవారికి ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
-
L.B నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ గణపతి పూజలు
రంగారెడ్డి: ఆర్కే పురం డివిజన్‌లోని వాసవి కాలనీలో జరుగుతున్న 38వ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గణనాథుడి నిమజ్జనం
మేడ్చల్: నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో ఉన్న బంగారు ముత్యాలమ్మ ఆలయం వద్ద 18 అడుగుల గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ గణనాథుడిని వజ్రాలతో అలంకరించారు. 50 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న ఈ విగ్రహాన్ని మొయినాబాద్‌లో తయారు చేయించారు. చవితి రోజున మొదలైన అన్నదానం శనివారం వరకు కొనసాగుతుంది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
-
బాలాపూర్ గణేశుడి సేవలో కలెక్టర్, డీసీపీ సునీత
HYD: బాలాపూర్ గణనాథుడిని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు వారిని శలువాతో సన్మానించి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. బాలాపూర్ గణనాథుడు ఎంతో మహిమ గలవాడని కొనియాడారు.
-
షాబాద్‌లో ఈశ్వరి టిఫిన్ సెంటర్ ప్రారంభం
రంగారెడ్డి: షాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈశ్వరి టిఫిన్ సెంటర్‌ను రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్యతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.