కృష్ణా: మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో తాడేపల్లి లక్ష్మణకు 2020లో 75% సదరం సర్టిఫికెట్ లభించగా, 2022 నుంచి పెన్షన్ వస్తోంది. 2025 వెరిఫికేషన్‌లో 40% కంటే తక్కువ వైకల్యం ఉందంటూ అనర్హత నోటీసు జారీ అయింది. పెన్షన్‌పై ఆధారపడిన లక్ష్మణ కుటుంబం ఆందోళనలో ఉంది. అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు వారిని పరామర్శించి, వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Locations: Krishna
-
‘చిరస్మరణీయులైన సేవామూర్తులు ధన్యులు’
కృష్ణా: పేదలకు విస్తృత సేవలు చేసి చిరస్మరణీయులైన సేవామూర్తులు మాలెంపాటి సీతారామాంజనేయులు, అత్తలూరి వెంకట పిచ్చియ్య ధన్యులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గోగినేనిపాలెంలో మాజీ సీడీసీ ఛైర్మన్ మాలెంపాటి సీతారామాంజనేయులు, యన్.జి.రంగా జిల్లా పరిషత్ హైస్కూల్ వ్యవస్థాపకులు అత్తలూరి వెంకట పిచ్చియ్య విగ్రహాలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు.
-
గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి: CI
కృష్ణా: గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని పమిడిముక్కుల సీఐ చిట్టిబాబు తెలిపారు. పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలనే పెట్టుకోవాలన్నారు. పందిళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాన్ బెర్ కంపెనీకి చెందిన కెమెరాలు రూ.1200లకే లభిస్తున్నాయని చెప్పారు. కెమెరాలు ఉంటే అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవచ్చని పామర్రు సీఐ సుభాకర్ వెల్లడించారు. కార్యక్రమంపై నిర్వాహకులు బాధ్యతతో ఉండాలన్నారు.
-
7న దుర్గ గుడి మూసివేత.. కారణమిదే..!
ఎన్టీఆర్: చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలోని ప్రధాన ఆలయం, ఉపాలయాలన్నింటినీ మూసివేస్తున్నట్టు దేవస్ధానం ఈవో వికె.శీనానాయక్ తెలిపారు. ఆరోజు 3.30గంటలకు కవాట బంధనం చేయనున్నట్టు వైదిక కమిటీ తెలిపిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 8.30గంటల నుంచి తిరిగి భక్తులకు దర్శనం ఉంటుందని వెల్లడించారు.
-
డిప్యూటీ సీఎం బౌన్సరుకు పరామర్శ
కృష్ణా: నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఇటీవల ఆకుల రమాదేవి మృతి చెందగా ఆదివారం ఆమె సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. రమాదేవికి ముగ్గురు కుమారులు, ఒక అమ్మాయి కాగా, వారిలో ఒకరైన ఆకుల శివ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దగ్గర సెక్యూరిటీ(బౌన్సర్)గా పనిచేస్తున్నారు. వారిని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, సర్పంచ్ ఉదయభాస్కర్, పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు పరామర్శించారు. రమాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు.
-
‘టీడీపీని మరింత బలోపేతం చేయాలి’
ఎన్టీఆర్: టీడీపీని మరింత బలోపేతం చేసి, తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో విజయవాడలో టీడీపీ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ.నాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, సహచర ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు స్టార్ట్
ఎన్టీఆర్: ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దసరా మహోత్సవాల ఏర్పాట్లను దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్‌లతో సమీక్షించారు. వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. త్వరిత దర్శనం, తాగునీరు, అన్నప్రసాదాల కోసం ఏర్పాట్లు, విజయదశమి రోజున ఉచిత లడ్డూ ప్రసాదం అందించనున్నారు. పర్యావరణ హితంగా ప్లాస్టిక్‌కు బదులు రీసైకిల్ వస్తువులు వాడాలని నిర్ణయించారు.
-
టీడీపీ జిల్లా అధ్యక్షులుగా బొమ్మసాని
ఎన్టీఆర్: టీడీపీ జిల్లా అధ్యక్షులుగా బొమ్మసాని సుబ్బారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారావుకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
-
‘800 మంది ప్రజల ఆందోళనను పట్టించుకోండి’
కృష్ణా: అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామస్థుల నిరసన దీక్ష మూడో రోజుకు చేరింది. ఇళ్లు కూలిపోయి, గ్రామం కోతకు గురవుతుందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మాలమహానాడు నేత దోవా గోవర్ధన్ మాట్లాడుతూ, 800 మంది ప్రజల ఆందోళనను పట్టించుకోకపోవడం బాధాకరమని, అవనిగడ్డలో నిరసన కొనసాగిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
-
సత్తా చాటిన నాగాయలంక క్రీడాకారులు
కృష్ణా: శ్రీనగర్‌లో జరిగిన ప్రథమ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో నాగాయలంక క్రీడాకారులు నాగిడి గాయత్రి కే–1 ఉమెన్స్‌లో రజతం, నాగిడి రాజేష్ సీ–1 కెనోయింగ్ స్లాలమ్‌లో కాంస్యం సాధించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 8మంది ప్రాతినిధ్యం వహించారు. గాయత్రి, రాజేష్‌లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, తదితరులు అభినందించారు.