ఎన్టీఆర్: నందిగామ మండలం పెద్దవరం గ్రామ సచివాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాలెంపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో కేఎంఆర్ హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ వారిచే 200 మంది రోగులను వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ చెరుకుమల్లి శ్రీనివాసరావు, ప్రతినిధులు మందరపు సీతారామయ్య, చల్ల గాంధీ, రాయల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో సమత క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు.
-
సోమశేఖరరావుకు మాజీ ఎమ్మెల్యే నివాళి
ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో ప్రముఖులు సూదుల సోమశేఖరరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు పట్టణ వైసీపీ నాయకులతో కలిసి వారి సోమశేఖరరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
-
మైనర్ బాలిక కిడ్నాప్.. ఫోక్సో కేసు నమోదు
కృష్ణా: కృత్తివెన్ను మండలంలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరో యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై పైడిబాబు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లలోపు బాలికలను ప్రేమ పేరుతో వేధించే ఈవ్ టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
-
సైకిల్ తొక్కిన ఎస్పీ గంగాధరరావు
కృష్ణా: ‘ఫిట్ ఇండియా’లో భాగంగా “Sundays on Cycle” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఎస్పీ గంగాధరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ రాజా, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొని లక్ష్మీ టాకీస్, హౌసింగ్ బోర్డు, కోనేరు సెంటర్ మీదుగా సైక్లింగ్ చేశారు. ఎస్పీ ఉత్సాహంగా సైకిల్ తొక్కి, ఆరోగ్య జీవనశైలిని ప్రోత్సహించారు.
-
విజయవాడలో పోలీసుల సైకిల్ ర్యాలీ
ఎన్టీఆర్: ఫిట్ ఇండియాలో భాగంగా విజయవాడలోని ఐదో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పని ఒత్తిడి తగ్గించేందుకు సిటీ పోలీసు కమిషనర్ ఆదేశాలతో పోలీసులు వారంలో ఒక రోజు ఆదివారం సైకిల్‌తో స్టేషన్‌కు రావాలని నిర్ణయించారు.
-
చిరస్మరణీయులైన సేవామూర్తులు ధన్యులు: ఎమ్మెల్యే
కృష్ణా: పేదలకు విస్తృత సేవలు చేసి చిరస్మరణీయులైన సేవామూర్తులు మాలెంపాటి సీతారామాంజనేయులు, అత్తలూరి వెంకట పిచ్చియ్య ధన్యులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం ఘంటసాల మండలం గోగినేనిపాలెంలో మాజీ సీడీసీ ఛైర్మన్, మాలెంపాటి కాంస్య విగ్రహావిష్కరణ, ఎన్జీ రంగా జిల్లా పరిషత్ హైస్కూల్ వ్యవస్థాపకులు అత్తలూరి విగ్రహావిష్కరణల మహోత్సవం ఘనంగా జరిగింది.
-
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్
కృష్ణా: ఈ నెల 25వ తేదీ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.
-
డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన మంత్రి
కృష్ణా: మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు అదేశాలు ప్రకారం అక్టోబర్ 2నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్‌ను పూర్తిగా తొలగిస్తామని, ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం రాబోయే రెండేళ్లలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
-
‘సింహాశయన బుద్ధ ప్రాజెక్టును పూర్తిచేయండి’
కృష్ణా: ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘంటసాల అభివృద్ధి చెందేందుకు చేపట్టిన ‘సింహాశయన బుద్ధ’ ప్రాజెక్టు పూర్తిచేయడానికి ప్రభుత్వం సహకరించాలని మంత్రి కందుల దుర్గేష్‌ను ఘంటసాలకు చెందిన బౌద్ధ గురువు భంతే ధమ్మ ధజథెరో కోరారు. రాజమండ్రిలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుద్ధ సర్క్యూట్‌లో భాగంగా ఈప్రాజెక్టును గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేసేందుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు భంతే ధమ్మ ధజథెరో తెలిపారు.