Locations: Krishna

  • ప్రమాదకరంగా మారిన ఆర్‌అండ్‌బీ రహదారి!

    కృష్ణా: మైలవరం మండలం తోలుకోడు ఊటవాగుపై ఉన్న ఆర్అండ్‌బీ రహదారి ప్రమాదకరంగా మారింది. వరుస ప్రమాదాలతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి రోడ్డు సైడ్ దిగబడింది. ఇదే వారంలో ఒక ట్రాక్టర్, స్కూల్ విద్యార్థుల వ్యాన్, ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ పరిస్థితులు జరగక ముందలే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

     

  • ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి : సీఐ

    కృష్ణా: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని మచిలీపట్నం ఆర్‌పేట సీఐ యేసుబాబు ఉత్సవ కమిటీ ప్రతినిధులను కోరారు. శనివారం ఆర్‌పేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉత్సవ కమిటీ ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • అల్లూరు పీఏసీఎస్ ప్రెసిడెంట్‌కు శుభాకాంక్షలు

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం అల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ ప్రెసిడెంట్ చలంశెట్టి సదాశివరావుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

     

  • పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

    కృష్ణా: పెనుగంచిప్రోలు మండలం అనిగల్లుపాడు గ్రామానికి చెందిన ఆత్మకూరు నాగరాజు(35) పురుగుమందు తాగి సుబ్బయ్య గూడెం రోడ్డు చెరువు కట్టమీద మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ‘సుందరాకాండ’ చిత్ర యూనిట్‌ సందడి

    ఎన్టీఆర్: విజయవాడలో  ‘సుందరాకాండ’ చిత్ర యూనిట్‌ శనివారం సందడి చేసింది. ఈ సందర్భంగా కథానాయకుడు నారా రోహిత్‌ మాట్లాడుతూ.. ‘సుందరాకాండ’ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, విఘ్నాలు లేకుండా గణేశుని ఆశీస్సులతో ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందని, అందరూ తప్పకుండా వీక్షించాలని కోరారు.

  • చల్లపల్లిలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’

    కృష్ణా: దోమల నిర్మూలన చర్యలు వేగవంతం చేసినట్లు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. చల్లపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని డ్రైనేజీల్లో దోమల లార్వా నిర్మూలనకు ఆయిల్ బాల్స్ వేశారు. దోమల ఆవాస ప్రాంతాల్లో స్ప్రేయింగ్ చేయించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కలిగించారు.

  • ఉత్సవ కమిటీలు నియమ నిబంధనలు పాటించాలి : సీఐ

    కృష్ణా: గణేష్ మండపాలు నిర్మించి.. వినాయక చవితి నవరాత్రులు నిర్వహించే ప్రతి ఒక్కరు తప్పక నియమ నిబంధనలు పాటించాలని బందర్ రూరల్ సీఐ కె.నాగేంద్రప్రసాద్ తెలిపారు. కమిటీ నిర్వాహకులు పోలీసుల నియమ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. పెడన నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో 197 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎస్సై జి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం’

    కృష్ణా: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కోల్ ఇండియా సౌజ న్యంతో సీఎస్ఆర్ నిధులతో బంటుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైక్రోఫిల్టర్ల ప్రారంభోత్సవాలు జరిగాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి ఎంపీ వాటిని ప్రారంభించారు. మల్లంపూడిలో ఎంపీ నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

     

  • చవితి ఉత్సవాలకు గట్టి బందోబస్తు : డీఎస్పీ

    కృష్ణా: పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐ, ఎస్సైలతో కలిసి వినాయక ఉత్సవ మండపాల కమిటీ సభ్యులతో డీఎస్పీ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. చవితి ఉత్సవాలకు పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు మండప నిర్వాహకులకు తెలిపారు. హోరెత్తించేలా పెద్ద శబ్దాలతో ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదన్నారు.

  • ‘బ్రిటీష్ తుపాకికి గుండె చూపిన ధీరుడు టంగుటూరి’

    కృష్ణా: బ్రిటిష్ తుపాకీకి గుండె చూపిన ధీరుడు ప్రకాశం పంతులు అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రకాశం చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.