Locations: Krishna

  • కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు : ఎమ్మెల్యే

    కృష్ణా: రాష్ట్రంలో యువతకు మెగా డీఎస్సీ ద్వారా 16,347 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. మెగా డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేసిన సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటరులో కూటమి నాయకులు,డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ధ నుంచి ర్యాలీగా తరలివచ్చి మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

  • తుక్కులూరులో వైద్య సేవలు!

    ఏలూరు: నూజివీడు మండలం తుక్కులూరు ప్రధాన రహదారి నుండి క్వారీ రోడ్డు వెళ్లే మార్గంలో స్మశానం మట్టి తరలింపుతో పరిసర ప్రాంతవాసులు జ్వరాలతో బాధపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించారు.

     

  • టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

    ఏలూరు: నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం శోభనపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • గణేష్ ఉత్సవాల్లో సమన్వయంతో పనిచేయాలి: ఆర్డీవో

    ఎన్టీఆర్: గణేష్ ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని నందిగామ ఆర్టీవో బాలకృష్ణ కోరారు. తన కార్యాలయంలో ఉత్సవాలపై రెవెన్యూ, పోలీసు, విద్యుత్ మున్సిపల్, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. నందిగామ, జగ్గయ్యపేట సీఐలు నాయుడు, వెంకటేశ్వర్లు, ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తాహశీల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

  • 26న నందిగామలో ‘స్త్రీ శక్తి’ సమావేశం

    ఎన్టీఆర్: ఈ నెల 26వ తేదీ ఉదయం 10:00 గంటలకు నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ‘స్త్రీ శక్తి’ సమావేశం జరుగుతుంది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పాల్గొంటారని, కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.

  • అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: ఎస్సై

    కృష్ణా: పెడన మండలం నందమూరు కాలువ గట్టుపై నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరంపై ఎస్సై సత్యనారాయణ ఆకస్మికంగా దాడి చేశారు. అక్రమంగా జరుగుతున్న కోడిపందేలు, ఇతర జూద కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.

  • NDPS చట్టాలపై పోలీసులకు అవగాహన

    ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు ఆధ్వర్యంలో ఈగల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ NDPS చట్టాలు, అమలు విధానాలపై జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, రైటర్లు పాల్గొనగా, చట్టపరమైన విధానాలపై క్లాసులు, ప్రాక్టికల్ డెమోలు జరిగాయి. NDPS చట్టాల అమలులో సమగ్ర పరిజ్ఞానం పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది.

     

     

  • సూర్య ప్రకాష్‌కు సత్కారం

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 స్వర్ణసంకల్పం కార్యక్రమంలో మళ్ళ రంగమ్మ, మనుబోలు దుర్గా, గొట్టం లక్ష్మమ్మలను బాలాజీ మెడికల్ షాపు యజమాని బుడ్డి సూర్యప్రకాష్ దత్తత తీసుకున్నారు. శనివారం ఎంపీడీవో ఆయన్ను సత్కరించి, సహాయ వివరాలు తెలుసుకున్నారు. 12ఏళ్లుగా కరెంట్ లేని సమస్యను సూర్య ప్రకాష్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆరోగ్యం కోసం మెడిసిన్ అందిస్తున్నట్లు చెప్పారు.
  • మైక్రో ఫిల్టర్‌ ప్రారంభించిన ఎంపీ, MLA కాగిత

    కృష్ణా: కోల్ ఇండియా కంపెనీ 12.63 లక్షల CSR నిధులతో బంటుమిల్లి మండలం ముల్లపర్రు గ్రామంలో 0.5 MLD మైక్రో ఫిల్టర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మైక్రో ఫిల్టర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

  • VROకి శ్రీరాం తాతయ్య పరామర్శ

    ఎన్టీఆర్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జగ్గయ్యపేట మండలం అన్నవరం వీఆర్వో వరలక్ష్మీ  పరిస్థితి విషమంగా మారింది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వీఆర్వోల సంఘ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) పరామర్శించారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయటం వలనే వరలక్ష్మీ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.