ఎన్టీఆర్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జగ్గయ్యపేట మండలం అన్నవరం వీఆర్వో వరలక్ష్మీ పరిస్థితి విషమంగా మారింది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వీఆర్వోల సంఘ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) పరామర్శించారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయటం వలనే వరలక్ష్మీ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
Locations: Krishna
-
DSCలో డిస్టిక్ ఫస్ట్.. ఇతడే!
ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలం రేపూడి తండా గ్రామానికి చెందిన భూక్యా జాన్సన్ DSC ఫలితాల్లో ప్రతిభ చాటాడు. SGT కేటగిరిలో 100 మార్కులకు గాను 95 మార్కులు సాధించి ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచాడు. దీంతో జాన్సన్ తల్లిదండ్రులు, బంధువులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
-
‘సొసైటీల్లో యూరియా కొరత లేకుండా చూడాలి’
ఎన్టీఆర్: రైతులకు సొసైటీల ద్వారా యూరియాను అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నందిగామ పట్టణంలో యూరియా కొరత నివారించాలని శనివారం ఆర్డీఓ బాలకృష్ణకి వినతిపత్రం ఇచ్చారు. పలు ఎరువుల దుకాణంలో యూరియా కట్ట కావాలంటే రూ.500 విలువచేసే గుళికలు తీసుకోవాలని షరతులు పెడుతున్నారని సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు తెలిపారు.
-
పరిసరాలు శుభ్రంగా ఉంటేనే గ్రామాలు బాగుంటాయి: కలెక్టర్
ఎన్టీఆర్: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని ముందుగా మొక్కలు నాటారు. వర్మీ కంపోస్ట్, మెడికల్ స్టాల్స్‌ను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ ఆంధ్ర దిశగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే గ్రామాలు బాగుంటాయని చెప్పారు. 2047 నాటికి స్వచ్ఛాంధ్ర సాధించడమే లక్ష్యమన్నారు.
-
అన్నవరం VRO ఆత్మహత్యాయత్నం!
ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం అన్నవరం వీఆర్వో వరలక్ష్మి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామ శివారులో అపస్మారకస్థితిలో పడివున్న ఆమెను స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
నా కెరీర్ రూ.5వేల జీతంతో స్టార్ట్: MLA
ఎన్టీఆర్: నందిగామలోని KVR కాలేజ్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళా యువతకు ఉపాధి అవకాశాలను అందించింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్న ఉద్యోగంతో ప్రారంభించి కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నిరుద్యోగులకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ఆమె తన రూ.5వేల టీచర్ ఉద్యోగ అనుభవాన్ని పంచుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, స్కిల్ డెవలప్మెంట్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. -
రూ.12.63 లక్షల CSR ఫండ్‌తో మైక్రో ఫిల్టర్
కృష్ణా: బంటుమిల్లి మండలం సాతులూరు గ్రామంలో కోల్ ఇండియా సౌజన్యంతో రూ.12.63 లక్షల CSR ఫండ్‌తో 0.5 MLD మైక్రో ఫిల్టర్ నిర్మించారు. శనివారం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. గ్రామస్తుల సమక్షంలో మైక్రో ఫిల్టర్‌ను వారు ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
చీపిరి పట్టిన MLA తంగిరాల
ఎన్టీఆర్: స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. శనివారం నందిగామ పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్థానిక ప్రజల్లో స్ఫూర్తి నింపింది. ఎమ్మెల్యే సౌమ్య స్వయంగా పాల్గొని స్వచ్ఛతా ఉద్యమానికి నాయకత్వం వహించారు. రహదారుల పక్కన ఉన్న కాలువలను పారిశుధ్య కార్మికులతో కలిసి శుభ్రపరిచారు.
-
‘తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు టంగుటూరి’
ప్రకాశం: తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక అయిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన ప్రకాశం పంతులు దేశభక్తుడని, ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
-
పారిశుద్ధ్య కార్మికుడిలా మారిన మంత్రి.. చీపురు చేతబూని..
ఏలూరు: గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుడిలా మారిన మంత్రి.. చీపురు పట్టుకొని వీధుల్ని శుభ్రం చేశారు. ఆయనతో పాటు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, తెదేపా కార్యకర్తలు సైతం రోడ్లను శుభ్రం చేశారు.