Locations: Krishna

  • జగ్గయ్యపేటలో స్వచ్ఛాంధ్ర ర్యాలీ

    ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జోరుగా సాగుతుంది. ప్రతి నెల మూడో శనివారం ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా జగ్గయ్యపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య హాజరయ్యారు. పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టి ఎన్టీఆర్ సర్కిల్‌లో మానవహారం చేశారు.

  • బెజవాడలో సందడి చేయనున్న ‘సుందరకాండ’ మూవీ టీమ్

    నారా రోహిత్, వర్తి వఘాని నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఆగస్టు 27న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం విజయవాడకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ హోటల్లో మీడియా సమావేశం, తర్వాత 6 గంటలకు పీవీపీ మాల్‌లో ప్రోగ్రాముల్లో పాల్గొంటారని మూవీ ఓ యూనిట్ తెలిపింది.
  • వంగవీటి రంగ విగ్రహం ధ్వంసం.. చంద్రబాబు సీరియస్

    కృష్ణా జిల్లా కైకలూరులో వంగవీటి మోహనరంగా విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారికి బుద్ధి చెప్పాలని సీఎం అన్నారు.
  • కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి

    కృష్ణా: చల్లపల్లి మండలం యార్లగడ్డలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఎలక్ట్రిషియన్ బండారు బుజ్జిబాబు(48) కరెంట్ స్తంభం ఎక్కి సర్వీస్ వైరు సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో కాంక్రీట్ దిమ్మపై పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

  • బెజవాడలో TDP, BJP నేతల ఘర్షణ

    ఎన్టీఆర్: విజయవాడ కనకదుర్గ‌ నగర్ వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేత మైలవరపు వీరబాబు మధ్య గొడవ జరిగింది. రథం సెంటర్‌లో ఆటోస్టాండ్ ఓపెనింగ్‌కు బీజేపీ నేత శ్రీరామ్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆటో స్టాండ్ దిమ్మెను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత వీరబాబు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు ఆయనను నెట్టేసి, ఆగ్రహం వ్యక్తం చేసి దుర్భాషలాడారు.

  • యార్లగడ్డ కోలుకోవాలని పాదయాత్ర

    కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత పది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని నియోకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, యువకులు ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేశారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు కనకదుర్గమ్మ గుడి నుంచి బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వద్దకు కాలినడకన వెళ్లి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. వెంకట్రావ్ త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని వారు ఆకాంక్షించారు.
  • సర్పంచ్, ఉప సర్పంచ్ ఆత్మహత్య.. విచారణకు పవన్ ఆదేశం

    గుంటూరు జిల్లా చినలింగాయపాలెం సర్పంచ్, ఉపసర్పంచ్ బలవన్మరణాలకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. “వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో వీరిద్ధరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. వీరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఒకేగ్రామానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ మృతి చెందటం బాధాకరం. ఈఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను” అని ఎక్స్ వేదికగా పవన్ తెలిపారు.
  • ‘పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత’

    కృష్ణా: పెడన పట్టణంలోని రైతు బజారులో శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని పట్టణ ప్రజలకు శానిటేషన్, ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కమిషనర్ సూచించారు. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు.

  • CM సహాయనిధి పేదలపాలిట వరం: తాతయ్య

    ఎన్టీఆర్: సీఎం సహాయనిధి పేదలపాలిట వరమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో జగ్గయ్యపేట మండలానికి చెందిన పలువురుకి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మోత్తం రూ.10.87లక్షల నగదును చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

  • రాఘవేంద్రుడికి NTR వర్సిటీ VC పూజలు

    కర్నూలు: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శనార్థం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వైస్ ఛాన్స్‌లర్‌ డాక్టర్ పి. చంద్రశేఖర్ శనివారం మంత్రాలయం చేరుకున్నారు.  వీరికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి వీరికి శేష వస్త్రం జ్ఞాపిక, ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.