
Locations: Krishna
-
సైకిల్ TO చంద్రుడి వరకు ‘ఇస్రో’ ఘనకీర్తి
1963లో కేరళ తుంబాలో సైకిల్‌పై రాకెట్‌తో తీసుకెళ్లిన భారత్ నేడు 44 బిలియన్ల డాలర్ల అంతరిక్ష ఆర్థిక వ్యవస్థగా మారింది. విక్రమ్ సారాభాయ్ దార్శనికతతో ఇస్రో అంతరిక్ష సూపర్‌పవర్‌గా అవతరించింది. ఇస్రో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ‘ఆర్య భట్ట’ వెనుక సారాభాయ్ కృషి ఎంతగానో ఉంది. ఆగస్టు 23, 2023న ఇస్రో ప్రయోగించిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై దిగింది. నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. -
ఆంధ్రకేసరి సేవలు చిరస్మరణీయం: CM
ఎన్టీఆర్: “తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు” అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా టంగుటూరి చిత్రపటానికి పూలమాలలతో సీఎం నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశానికి, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి ప్రకాశం పంతులు చేసిన సేవలను స్మరించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
-
కాలువలో శవమై తేలిన యువకుడు
కృష్ణా: పెడన పట్టణంలోని మున్సిపల్ వాటర్ హౌస్ రామరాజు పంట కాలువలో మృతదేహం కలకలం రేపింది. పట్టణంలోని దక్షిణ తెలుగుపాలానికి చెందిన కోమట్ల శివ నాగరాజు(43)గా గుర్తించారు. శుక్రవారం తన బంధువు చనిపోవడంతో మట్టి చేయడానికి వెళ్లిన నాగరాజు కాలువలో స్నానానికి దిగాడు. శనివారం ఉదయం శవమై కనిపించాడన్న ఫిర్యాదు మేరకు సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్సై సత్యనారాయణ సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
-
నిండు ప్రాణం బలి.. కారణం వైద్యులేనా?
ఎన్టీఆర్: కొండపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నిండుప్రాణం బలైందంటూ మృతుని బంధువులు శనివారం ఆందోళన చేపట్టారు. “గురువారం రాత్రి కొండపల్లికి చెందిన ఎస్.కె.దావూద్(41) చాతి నొప్పితో హాస్పటల్‌కు వెళ్ళాడు. గ్యాస్ పెయిన్‌కి ఇంజెక్షన్ ఇచ్చి వైద్యులు ఇంటికి పంపారు. తగ్గకపోవడంతో దావూద్‌ను విజయవాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ నేటి ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
-
అన్నదానానికి విరాళం.. దాతకు సత్కారం
ఏలూరు: నూజివీడు మండలం గొల్లపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సీతారాంపురాని చెందిన కౌవులూరి యోగేశ్వరరావు అలియాస్ యోగి రూ.2.32లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా యోగేశ్వరరావును గొల్లపల్లికి చెందిన గంగానమ్మ తల్లి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనను సత్కరించి మెమెంటో అందజేశారు.
-
స్తంభం ఎక్కి వైరు సరిచేస్తుండగా షాక్.. కిందపడి స్పాట్ డెడ్!
ఎన్టీఆర్: చల్లపల్లి మండలం యార్లగడ్డలో పంచాయతీ కార్మికుడు విద్యుదాఘాతానికి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అతడి ఇంటిలో విద్యుత్ పోవడంతో వీధిలోని స్తంభంఎక్కి సర్వీస్‌వైరు సరిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ తీగలను తాకడంతో ఘాతానికి కిందపడ్డాడు. ఆసమయంలో విద్యుత్ స్తంభం కాంక్రీట్ దిమ్మకు తల తగిలి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
చెవిరెడ్డి పిటిషన్ కొట్టివేత
గుంటూరు: తనకు ఇంటి నుంచి వస్తున్న ఆహారానికి సంబంధించి వారాలను మార్చాలని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. తనకు మధ్యంతర, రెగ్యులర్ బెయిళ్లు మంజూరు చేయాలని చెవిరెడ్డి వేసిన పిటిషన్లపై తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 25వ తేదీకి వాయిదా పడింది.
-
మొదటి విడతలో 9 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి నాదెండ్ల
గుంటూరు: నాలుగు విడతల్లో ఏపీ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ దుకాణాల్లో ప్రతినెలా తనిఖీలు చేస్తున్నామన్న ఆయన.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో తొమ్మిది జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నాలుగో విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తామన్నారు.
-
నేనేం చేశాను పాపం.. నాకెందుకీ శాపం!
ఎన్టీఆర్: అభం శుభం తెలియని సుమారు మూడు నెలల పాప..అమ్మ ఒడిలో సేదదీరాల్సిన పాప కాలువ తీరాన పడి ఏడుస్తోంది. ఈఘటన స్థానిక న్యూరాజరాజేశ్వరి పేట సమీపంలో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. గేదెలకు మేత వేసేందుకు వెళ్లిన స్థానికుడు బేతాళం నాగరాజు ఆ శిశువు పాలిట దేవుడయ్యారు. స్థానికులు చేరదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టారు.
-
వంగవీటి రంగా విగ్రహాలకు అవమానం
ఏలూరు జిల్లాలో దివంగత నేత వంగవీటి రంగా విగ్రహాలకు అవమానం జరిగింది. విగ్రహాలకు దుండగులు పేడ పూసిన ఘటన కలిదిండిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. పక్కనే ఉన్న మరో గ్రామం రుద్రవరంలోనూ రంగా విగ్రహానికి అదే తీరులో అవమానం జరగడంపై వంగవీటి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటికి స్పందించకపోవడంతో అధికారులు మండిపడుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.