Locations: Krishna

  • రైల్వే గేట్ క్లోజ్.. 25 నుంచి!

    కృష్ణా: మండవల్లి నుంచి గన్నవరం వెళ్లే దారిలోని రైల్వే గేటును మూసివేయనున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ గేట్ మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్, వివిధ మరమ్మతుల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.

  • ఉయ్యూరుకు ‘పుర’వైభవం.. గ్రేడ్‌-2 మున్సిపాలిటీగా ప్రకటన

    ఎన్టీఆర్: విజయవాడ, మచిలీపట్నం నగరాలకు మధ్యలో ఉన్న ఉయ్యూరు నగర పంచాయతీని ద్వితీయ శ్రేణి(గ్రేడ్‌02) మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ఏప్రిల్‌లో దీనిపై కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ వివరాలు పరిశీలించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ దీనికి ఆమోద ముద్ర వేశారు.

  • 140ఏళ్లైనా చెక్కుచెదరని బందిపోటు కోరిక

    ఎన్టీఆర్: రాఘవాపురంలో ఓబందిపోటు కోరిక మేరకు నిర్మించిన పరిశుద్ధ మార్కు దేవాలయానికి 140ఏళ్లు నిండాయి. మతగురువుల బోధనలతో దోపిడీలకు స్వస్తి చెప్పిన గ్రామానికి చెందిన పాగోలు వెంకయ్య గ్రామంలో ఓచర్చి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి ఇంగ్లండ్‌ రెవరెండ్‌ థామస్‌ యంగ్‌ డార్లింగ్‌ అనే మత గురువును కోరగా..1883లో చర్చి నిర్మాణం ప్రారంభమై, 1885లో పూర్తైంది. ఇన్నేళ్లైనా నిర్మాణం చెక్కు చెదరకపోవడం విశేషం.

  • మడ అడవులపై అక్రమార్కుల కన్ను

    కృష్ణా: మడ అడవులపై అక్రమార్కుల కన్నుపడింది. పెడన, బంటుమిల్లి, బందరు, కృత్తివెన్ను మండలాల్లో 15వేల ఎకరాల మడఅడవుల్లో 5వేల ఎకరాలను అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. చెట్లను నరికి, రొయ్యల చెరువులుగా మారుస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ల శాటిలైట్ చిత్రాలు దీనికి సాక్ష్యమంటున్నారు. తుఫాన్లు, సునామీల నుంచి రక్షణ కల్పించే మడ అడవులు అంతరించిపోతే ప్రమాదం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

     

  • యూరియా కోసం బారులు

    కృష్ణా: ప్రస్తుత వానాకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అధిక ధరలకు యూరియాను ఇతర పెస్టిసైడ్‌లతో లింకు చేసి అమ్ముతుండడంతో సహకార సంఘాల వైపు పరుగులు పెడుతున్నారు. నందమూరు సహకార సంఘంలో గురువారం యూరియా అందుబాటులో ఉండటంతో రైతులు ఎగబడ్డారు. పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయంతో యూరియా పంపిణీ చేశారు.

  • గోనె సంచిలో గుర్తుతెలియని మృతదేహం

  • గంటలమ్మకు సౌమ్య ప్రత్యేక పూజలు

    ఎన్టీఆర్: నందిగామ మండలం అనాసాగరంలోని గంటలమ్మ దేవాలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు జరిగాయి. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గంటలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. నందిగామ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సౌమ్య తెలిపారు. ఈ పవిత్ర మాసంలో భక్తులతో పాటు బీజేపీ కన్వీనర్ తుర్లికొండ సీతారామయ్య పాల్గొన్నారు.

  • కీసరలో స్వామిత్వ సర్వే

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో స్వామిత్వ సర్వేను డీపీవో పి.లావణ్య కుమారి శుక్రవారం పరిశీలించారు. సర్వే ద్వారా గ్రామస్థాయిలో భూసంబంధిత హక్కుల పత్రాలు స్పష్టంగా అందుతాయని, ఆస్తి వివాదాలు తగ్గుతాయని ఆమె వివరించారు. అధికారులు, సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సర్పంచ్ పెరమ్ నరసమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ పి.యేసుబాబు, పంచాయతీ కార్యదర్శి వి.సుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

  • కోసూరులో రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 4 ఆలయాల్లో..

    కృష్ణా: మొవ్వ మండలం కోసూరులో దొంగలు రెచ్చిపోయారు.  ఒకేరోజు రాత్రి 4ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి గ్రామం నడిబొడ్డున రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, దానిపక్కనే ఉన్న క్షత్రియ రామాలయం తాళాలు పగులగొట్టి 9వెండి కిరీటాలు, చటారాలతో పాటు పలు ఆభరణాలు, నగదు, సమీపంలోని గంగానమ్మ, వినాయకుడి ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి వాటిలోని నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

  • కాకాణిపై సోమిరెడ్డి పరువు నష్టం కేసు.. సెప్టెంబరు 3కు వాయిదా!

    నెల్లూరు: సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వేసిన పరువు నష్టం కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం సెప్టెంబరు3వతేదీకి వాయిదా వేసింది. తన పరువుకు భంగం కలిగించారంటూ ఆయన… వైసీపీ నాయకుడు, మాజీమంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈకేసు విజయవాడ ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. గురువారం విచారణకు రాగా.. సెప్టెంబరు3కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.