Locations: Krishna

  • 13 మంది లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

    ఎన్టీఆర్: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు నిజమైన వరమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ.5,00,654 విలువైన చెక్కులను ఎమ్మెల్యే తాతయ్య స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. ప్రతి అర్హుడికి ఈ సాయం చేరేలా నేను కృషి చేస్తానని హామీఇచ్చారు.

  • కాచవరం కాలువ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట నియోజకవర్గం కాచవరం కాలువ చివరలోని ఆయుకట్టు భూములు అయిన త్రిపురవరం, అన్నవరం ఎక్స్‌టెన్షన్ ప్రాంతాలకు నీటి లభ్యత సరిగా లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం గమనించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయుకట్టు భూములకు సరిపడా నీరు చేరడానికి అక్విడక్ట్, కాలువ లైనింగ్ పనులు చేపట్టడం అత్యవసరమని తెలిపారు.

  • బైకును ఢీకొన్న లారీ.. తల్లి, బిడ్డ మృతి

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కిసర పెండ్యాల రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఓ లారీ బైక్‌ను ఢీకొట్టింది. విజయవాడకు చెందిన నాగబాతిన చైతన్య (20), ఆమె 3నెలల కుమారుడు అద్విక్‌తో బైక్‌పై వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో అద్విక్ మృతిచెందగా.. చైతన్యకు తీవ్ర గాయాలలు కాగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఎస్సై పి.విశ్వనాథ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: ఏసీపీ

    ఎన్టీఆర్: సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి నేరాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ బీ.తిలక్ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం పరిటాల అమిత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణ సదస్సు ఏర్పాటుచేశారు. వ్యక్తిగత సమాచారాలు ఎవరికి చెప్పవద్దని.. సైబర్ మోసగాళ్లకు చిక్కితే వెంటనే 1930కి ఫోన్ చేయాలన్నారు.

  • కూటమి అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ఇవ్వాలి: పవన్

    ఏలూరు: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోళ్ళ పవన్‌కుమార్ విజ్ఞప్తిచేశారు. తెలుగు జాతి గౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, గతంలో వెంకయ్య నాయుడు, పీవీ నరసింహారావులకు సహకరించినట్లే, ఇప్పుడు సుదర్శన్‌రెడ్డి గెలుపుకు బాధ్యత వహించాలన్నారు. ఇది తెలుగు జాతికి అవసరమని పవన్ పేర్కొన్నారు.
  • బాలరామ అమ్మవారికి ప్రత్యేక పూజలు

    ఏలూరు: ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో వేంచేసిన శ్రీదుగ్గిరాల బాలరామ అమ్మవారికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దయతో పాడిపంటలు వర్ధిల్లాలని.. రైతుల కష్టానికి తగిన ఫలితం సిద్ధించాలని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరేపల్లి శ్రీపద్మ, శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి ఛైర్మన్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

     

  • మంత్రి పార్ధసారథి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

    ఏలూరు: నూజివీడులో మంత్రి కొలుసు పార్ధసారథి ఆధ్వర్యంలో భారతగ్యాస్ బీపీసీఎల్ డిస్ట్రిబ్యూటర్ సామాజిక బాధ్యతతో వినియోగదారుల భద్రత విషయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఫ్రీ హెల్త్ క్యాంప్, వంటల పోటీలు, స్కూల్ పిల్లలకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వినియోగదారులకు భద్రత, ఎల్పీజీ వినియోగంపై అవగాహన కల్పించారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించి సామాజిక బాధ్యతను గుర్తుచేశారు.

  • సీఎంఆర్‌ఎఫ్ పేదవారీ పాలిట వరం: మంత్రి

    ఏలూరు: వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం సహాయ నిధి అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. నూజివీడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు శుక్రవారం CMRF చెక్కులను ఆయన పంపిణీచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు అందిస్తున్న టీడీపీ ప్రభుత్వం వచ్చాక అనారోగ్యానికి గురైన పేదవారీ పాలిట వరంలా మారిందని మంత్రి అన్నారు.

  • ఆరోపణలు ఎదుర్కోలేక జగన్ డైవర్షన్‌ పాలిటిక్స్‌: ఆనం

    AP: వైసీపీ నేతలు భగవంతుడిని సైతం రాజకీయాల్లోకి లాగుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శల పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆరోపణలు ఎదుర్కోలేక జగన్ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలమేరకు దేవాదాయ శాఖలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టామని మంత్రి ఆనం తెలిపారు.

  • కంకటావలో గోనే సంచి కలకలం.. తెరిచి చూస్తే శవం

    తిరుపతి: గూడూరు మండలం కంకటావలో గోనే సంచి కలకలం రేపుతుంది. పొదల మాటున ఓ గోనె సంచిలో శవం లభ్యమైంది. అదే గ్రామానికి చెందిన యజ్ఞ (37) అనే యువకుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.