Locations: Krishna

  • వత్సవాయిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

    ఎన్టీఆర్: వత్సవాయి గ్రామంలోని మోడల్ కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. బావిలో తేలి ఉండటాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. మహిళ వయసు సుమారు 30-35 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  • ‘మా పదవులు మాకే ఇవ్వండి’

    ఎన్టీఆర్: రిజర్వేషన్ ప్రకారం మా పదవులు మాకే ఇవ్వాలని జగ్గయ్యపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత మహిళలు శుక్రవారం మౌనదీక్ష చేశారు. రోస్టర్ పద్ధతిలో జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి ఎస్సీ మహిళకు వచ్చింది. దానిని వారికి దక్కకుండా అగ్రకులాల వారు అడ్డుపడుతున్నారని మహిళలు తెలిపారు. సీఎం చంద్రబాబు స్పందించి ఛైర్మన్ పీఠం దళిత వర్గాలకే కట్టబెట్టాలని కోరారు.

  • కాకానికి జగన్మోహన్‌రావు పరామర్శ

    ఎన్టీఆర్: పలు కేసుల్లో జైలు నుంచి బెయిల్‌పై ఇటీవల విడుదలైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు శుక్రవారం కలిశారు. తాడేపల్లిలోని కాకాని అతిథిగృహంలో ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని జగన్మోహన్‌రావు విమర్శించారు.

  • స్వీపర్‌ మిస్సింగ్.. హాస్పిటల్‌పై దాడి

    ఎన్టీఆర్: జి.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 28 ఏళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్న మందా చిరంజీవి.. అధికారుల ఒత్తిడితోనే గురువారం అదృశ్యం అయ్యిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హాస్పిటల్ యూడీసీ దురుసుగా ప్రవర్తించడంతో మన:స్ధాపానికి గురై కనబడకుండా వెళ్ళిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బంధువులు శుక్రవారం ఆసుపత్రి అద్దాలు పగలగొట్టారు. యూడీసీ తనకేం సంబంధం లేదన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • మచిలీపట్నంలో గోడ కూలి ఒకరి మృతి

    కృష్ణా: మచిలీపట్నంలో విషాధం శుక్రవారం చోటు చేసుకుంది. రాడార్ కేంద్రం సమీపంలో ఓ భవన నిర్మాణానికి పునాది తీస్తుండగా పక్కనే ఉన్న గోడ కూలిపోయింది. ఘటనలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు పట్టణంలోని బలరాముని పేటకు చెందిన రాజుగా గుర్తించారు. చిలకలపూడి పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

  • ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా తగ్గుతున్న వరద ప్రవాహం

    ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. ఇప్పటికే అధికారులు 69 గేట్లుఎత్తి దాదాపు 4లక్షల 32వేల 844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కెనాల్స్ కు 16, 222 క్యూసెక్కుల మళ్లిస్తున్నారు. బ్యారేజి నీటిమట్టం 12.5 అడుగులు కాగా..పులిచింతల నుంచి 4లక్షల క్యూసెక్కులు నీరు వస్తుంది. ఉదయం నుంచి 20వేల క్యూసెక్కుల వరద ప్రవాహం తగ్గింది. ఇంకా బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

  • ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్

    కృష్ణా: బందరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నున్న రాజు ఆధ్వర్యంలో జాతీయ రహదారి 216లోని హర్ష కాలేజ్ సమీపంలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, వారికి ISI మార్క్ హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం గురించి వివరించి, వారిని గమ్యస్థానాలకు పంపించారు.

  • జగన్‌కు పైత్యం ఎక్కువైంది: నెట్టెం రఘురాం

    ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం విస్సన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. రోజులు గడుస్తున్న కొద్ది జగన్‌కు పైత్యం ఎక్కువైందని, పులివెందులలోనూ టీడీపీ జెండా రెపరెపలాడిందని అన్నారు. రైతులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందరికీ అందజేస్తుందని తెలిపారు.

     

  • యూరియా కొరతతో రైతుల ఇక్కట్లు!

    కృష్ణా: యూరియా కొరతతో గన్నవరంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద క్యూలైన్‌లో గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి కేవలం ఒక కట్ట యూరియా మాత్రమే లభిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     

  • ఆయుష్య హోమంలో పాల్గొన్న ఎమ్మల్యే

    కృష్ణా: మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి టీటీడీ కళ్యాణ మండపంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా లోక కళ్యాణార్థం ఆయుష్య హోమం నిర్వహించారు. కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా స్వామి వారిని దర్శించి, నాగపుట్ట వద్ద పాలు పోసి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.