Locations: Krishna

  • ఇంట్లో చెప్పకుండా వెళ్లిన మైనర్లు.. పేరెంట్స్ ఫిర్యాదు

    ఎన్టీఆర్: పటమటకు చెందిన నలుగురు మైనర్ బాలురు పవన్‌కుమార్, పెద్దపల్లి శశిధర్, మురపాక కార్తీక్, తాడేపల్లి నిక్కీ ఇంట్లో చెప్పకుండా బందర్ బీచ్‌కు వెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పటమట పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు వారిని బీచ్ వద్ద కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో బృందం గంటలలో ఆచూకీ కనుగొని, బాలురను తల్లిదండ్రులకు అప్పగించారు.

  • ‘అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

    ఎన్టీఆర్: నందిగామలో కెవిఆర్ కాలేజ్ కాల్వకట్ట నుంచి నేషనల్ హైవే 65వరకు NSP కాల్వ పూడికతీత పనులను ఎమ్మెల్యే సౌమ్య శుక్రవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ పనులు వరద సమస్యలను నివారించి, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తాయని, పట్టణ జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని సౌమ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, డీసీ ఛైర్మన్ చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

  • ‘రైతుల శ్రేయస్సే ప్రధాన ధ్యేయం’

    ఎన్టీఆర్: మైలవరం వెల్వడం పీఏసీఎస్ ఛైర్మన్‌గా పురమ సతీష్ కుమార్, సభ్యులుగా గంజా ఆంజనేయులు, ప్రతిపాటి వినోద్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వారిని అభినందించారు. కూటమి ప్రభుత్వం రైతుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, నీటి వనరులు, విత్తనాలు, ఎరువులు, కనీస మద్దతు ధరల కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

  • బీజేపీకి వైసీపీ.. బీ టీమ్‌: షర్మిల

    ఎన్టీఆర్: వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బీజేపీకి వైసీపీ..బీ-టీమ్‌ అని నిజనిర్ధరణ జరిగిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతుతో మరోసారి తేటతెల్లమైందని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీపక్షమేనని తేలింది. కేసులకు భయపడి బీజేపీకి వైసీపీ మళ్లీ దాసోహం అంటోంది. ఓటుచోరీతో రాజ్యాంగం ఖూనీఅయ్యేది వైసీపీకు కనిపించదు అని షర్మిల ప్రశ్నించారు.

  • కన్నుల పండుగగా చిరంజీవి జన్మదిన వేడుకలు

    ఎన్టీఆర్: మైలవరం, వెల్వడం గ్రామాల్లో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పాల్గొని కేక్ కట్ చేసి, వంగవీటి మోహనరంగా విగ్రహానికి నివాళులర్పించారు. చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ స్థాపనతో సేవా కార్యక్రమాలకు మారుపేరని కొనియాడారు. జనసేన ఇన్‌ఛార్జి అక్కల రామ్మోహనరావు, అభిమానులు పాల్గొన్నారు.

  • ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల

    ఎన్టీఆర్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉద్ధృతి ఉండడంతో భవాని ఐలాండ్‌కు తిరిగే పర్యాటక బోట్ల సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.

  • సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్

    కృష్ణా: పెడన మండలం నేలకొండపల్లి గ్రామంలో జరుగుతున్న సర్వే పనులను కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం పరిశీలించారు. సర్వే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. సర్వేలో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని డీకే బాలాజీ అధికారులకు సూచించారు.

  • జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

    కృష్ణా: గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్‌లో జనసేన ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానుల నినాదాల మధ్య కేక్ కట్ చేసిన శ్రీకాంత్, చిరంజీవి నిండు నూరేళ్లు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చిరంజీవి మార్గంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సేవలకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.

  • ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

    ఏలూరు: నూజివీడులో జనసేన సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు8. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఫణిబాబు కోరారు. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసిన సేవలు మరువలేనివని, ఆయన మహా వృక్షమని ప్రశంసించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

  • ముగిసిన శ్రావణ మాసోత్సవాలు

    కృష్ణా: గుడివాడలోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. చివరి శుక్రవారం చీరల అలంకారంలో అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు చేశారు. నెల రోజులపాటు శ్రీ లక్ష్మి, లలిత సహస్రనామార్చనలు నిర్వహించినట్లు వేద పండితులు పునీత్ శర్మ తెలిపారు. మహిళా భక్తులు మోక్కులు చెల్లించారు. అమ్మవారి కరుణతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.