Locations: Krishna

  • అయ్యో.. 9 నెలలకే నూరేళ్లు నిండాయా పాపా!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండల పరిధిలోని కీసర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో 9 నెలల పాప అక్కడికక్కడే మృతి చెందగా.. ఇరువురికి రక్త గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • నందిగామలో రేపు మెగా జాబ్ మేళా

    ఎన్టీఆర్: నందిగామలోని కెవిఆర్ కళాశాలలో శనివారం ఉదయం 9 గంటల నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ సహకారంతో 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా జరగనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా అధికారులు ముఖ్య అతిథులుగా రానున్నారు. యువత బయోడేటా, ఆధార్ కార్డు జిరాక్స్‌తో హాజరై ఉపాధి పొందాలని కోరారు. కూటమి నేతలు, మీడియా హాజరుకావాలని టీడీపీ నాయకులు తెలిపారు.

  • యూరియా కొరత.. అన్నదాతల గుండెకోత

    కృష్ణా: సరైన సమయంలో సరిపడ యూరియాని అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుకుంటున్నారు. గన్నవరంలో యూరియా కొరతతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యూరియా అందించడం కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు స్టాక్ పాయింట్ల వద్ద క్యూలో నిల్చొని గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. గన్నవరం అగ్రికల్చర్ ఏఓ శివప్రసాద్ మాట్లాడుతూ.. యూరియా సరఫరా తక్కువగా ఉందన్నారు. త్వరలో స్టాక్ వస్తుందని హామీ ఇచ్చారు.

     

     

     

     

     

  • మెరుగైన వైద్యం కోసమే CMRF: కొలుసు

    ఏలూరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముసునూరులో మూడు కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.7లక్షల ఎల్ఓసీ పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం కొలుసు మాట్లాడుతూ.. మెరుగైన వైద్యానికి కూటమి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుందని, ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • అంకమ్మ తల్లి.. సౌభాగ్య లక్ష్మిగా..!

    ఎన్టీఆర్: శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని శ్రీ సౌభాగ్య లక్ష్మీ అమ్మవారిగా అలంకరణ చేసి కుంకుమార్చన చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగనాథ్ స్వామి తెలిపారు. కార్యక్రమంలో గ్రామ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ఛైర్మన్ గోగినేని రామారావు పాల్గొన్నారు.

  • రేపు రాత్రి వరకే ఛాన్స్!

    ఎన్టీఆర్: అన్ని మతాల వారు శాంతియుతంగా పండుగలు జరుపుకుని, మత సామరస్యాన్ని చాటాలని రెడ్డిగూడెం ఎస్ఐ మోహనరావు అన్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేవారు ఈనెల 23వ తేదీ రాత్రి 8గంటలలోపు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహించాలన్నారు.

     

  • సమస్యను తెలిపినా.. నిర్లక్ష్యమే..!

    ఎన్టీఆర్: కంచికచర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రోడ్డుపై గత నెల రోజులుగా సెప్టిక్ ట్యాంక్ నుంచి నీరు చేరి దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణం ఇబ్బందిగా సాగుతుందంటూన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • చిచ్చు పెట్టిన పింఛను

    ఎన్టీఆర్: దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు పెట్టింది. కళ్లుండి చూడలేని డాక్టర్లు కాళ్లు, చేతులు లేని వారికి సైతం 40శాతం కంటే తక్కువగా పర్సంటేజ్ ఉందని పెన్షన్ ఎగ్గొట్టేలా ప్రవర్తిస్తున్నారు. కంచికచర్ల మండలం చెవిటికల్లుకు చెందిన షేక్ బడేమియ్యకు కాళ్లు, చేతులు లేకపోయినప్పటికీ కూడా అతనికి 40శాతం లోపు పర్సంటేజ్ వచ్చిందని, సెప్టెంబర్ 1 నుంచి పెన్షన్ నిలిపివేస్తున్నట్లు నోటీసులిచ్చారు. తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

  • వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం

    కృష్ణా: శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కప్పలదొడ్డి గ్రామ శివాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. కప్పలదొడ్డి గ్రామ కార్తీకమాస సమారాధన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు.

  • ‘మూవీ మాస్టర్స్’.. ఓ సినీ చరిత్ర

    కృష్ణా: ‘మూవీ మాస్టర్స్’ గ్రంథం సినీ చరిత్ర వివరించే ఉత్తమ గ్రంథమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు స్వగృహంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో కళారత్న ఎస్వీ.రామారావు రచించిన ‘మూవీ మాస్టర్స్’ గ్రంథావిష్కరణ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా మండలి పాల్గొని గ్రంథం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పాతతరం నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్ల వివరాలను ఈతరానికి తెలియచేసే గ్రంథంగా నిలుస్తుందన్నారు.