Locations: Krishna

  • ఈ-కేవైసీ తప్పనిసరి

    కృష్ణా: ఈ-కేవైసీ లేకపోవడంతో అర్హత ఉన్న చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారని పెడన వ్యవసాయ శాఖ అధికారిణి ఎస్.జెన్నీ తెలిపారు. నందమూరు, జింజేరు గ్రామాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో రైతు సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండించాలన్నారు.

  • కోలవెన్నులో ఫ్రీ మెడికల్ క్యాంప్ నేడే!

    కృష్ణా: కంకిపాడు మండలం కోలవెన్ను మండపాల కూడలిలోని వరసిద్ధి వినాయక గుడి ప్రాంగణంలో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. డీహెచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్ సహకారంతో శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నేత్ర, దంత, పిల్లల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, నిపుణులు వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు.

     

  • సివిల్‌ మెయిన్స్‌‌కు ఏర్పాట్లు పక్కాగా..!

    ఎన్టీఆర్: ఈనెల 22 నుంచి ఐదురోజుల పాటు నిర్వహించనున్న యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. పరీక్షలు లబ్బీపేట రెడ్‌ సర్కిల్‌ వద్ద ఉన్న బిషప్‌ అజరయ్య బాలికల కళాశాలలో జరుగుతాయన్నారు. పరీక్షలకు 106 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 11మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.

  • మట్టి మహా గణపతి!

    AP : విజయవాడలోని విద్యాధరపురం బస్‌డిపో పక్కన 72 అడుగుల మహా గణపతి రూపుదిద్దుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గణపతి విగ్రహాల్లో ఒకటైన ఈ ప్రతిమను పూర్తిగా పర్యావరణ హితంగా తయారు చేస్తున్నారు.సింహాసనంపై కూర్చొని వరాలందిస్తున్న ఈ ‘కార్యసిద్ధి మహాశక్తి గణపతి’కి రెండు వైపులా నగరేశ్వరస్వామి, వాసవీ కన్యకాపరమేశ్వరి విగ్రహాలను రూపొందిస్తున్నారు. 40 మంది కళాకారులు 2 నెలలుగా తయారీలో నిమగ్నమయ్యారు.

  • అవార్డ్ గెలుచుకున్న కృష్ణా కలెక్టర్

    కృష్ణా జిల్లా డీకే బాలాజీ ఉత్తమ ఐఏఎస్‌ అధికారిగా అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో నాలుగు వారాల పాటు జరిగిన మిడ్‌ క్యారియర్‌ శిక్షణ కార్యక్రమంలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచినందుకు ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ వర్దన్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని కలెక్టర్ స్వీకరించినట్లు సమాచార పౌరసంబంధాలశాఖ గురువారం వెల్లడించింది.

  • మహిళల పక్షపాతి CM

    కృష్ణా: పెడన నియోజకవర్గం కృత్తివెన్నులోని టీడీపీ కార్యాలయం వద్ద స్త్రీశక్తి (ఉచిత బస్సు ప్రయాణం) విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మహిళల పక్షపాతి అని, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి సుమారు రూ.1,942కోట్ల అదనపు భారం పడనుందని వెల్లడించారు.

     

     

  • మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి

    కృష్ణా: అన్ని మతాలకు చెందిన ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకుంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు.పెడనలోని మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన శాంతి కమిటి సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా పోలీసులు నిర్ణయించిన నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. గణేష్ నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలన్నారు.

  • మండలి కృష్ణారావుకు ఘన నివాళులు

    కృష్ణా: రాష్ట్ర అధికార భాషా సంఘానికి మాజీమంత్రి మండలి వెంకట కృష్ణారావు పేరును మంత్రివర్గం ఖరారు చేయటం హర్షణీయమని దివి ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణారావు పేరును నిర్ణయిస్తూ గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. సందర్భంగా అవనిగడ్డలోని కృష్ణారావు విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

  • ‘విద్యార్థులు మార్కులతో పాటు జ్ఞానం పెంచుకోవాలి’

    ఎన్టీఆర్: ఇంజనీరింగ్ విద్యార్థులకు నాలుగు సంవత్సరాల కోర్స్ చాలా ముఖ్యమైనదని అమ్రితసాయి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ యమ్.శశిధర్ తెలిపారు. మార్కులతో పాటు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకుని ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా సిద్ధం అవ్వాలని చెప్పారు. ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు గురువారం మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లితండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

  • ఆసుపత్రిలో మహిళా స్వీపర్ మిస్సింగ్.. అధికారులే కారణం?

    ఎన్టీఆర్: జీ.కొండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్ మిస్సింగ్‌పై కుటుంబసభ్యుల గురువారం ఆందోళన చేపట్టారు. హాస్పిటల్‌లో యూడీసీ పని ఒత్తిడి కారణంగానే తన తల్లి మనస్తపానికి గురైనట్లు సదరు మహిళ కూతురు ఆరోపించింది. ఉదయం ఫోన్ చేసి తనకు అన్యాయం జరిగిందని.. తనను వెతకొద్దని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలిపింది. స్వీపర్‌తో ఎలాంటి విభేదాలు లేవని ఆసుపత్రి అధికారులు, సిబ్బంది వెల్లడించారు.