Locations: Krishna

  • ఫారెస్ట్ సిబ్బందిపై దాడి.. TDP MLAపై కేసు

    నంద్యాల: శ్రీశైలంలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జనసేన ఇన్‌ఛార్జి రౌత్ అశోక్‌కుమార్‌లపై కేసు నమోదైంది. ఈఘటనపై టీడీపీ అధిష్టానం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఐదు రోజులపాటు కృష్ణానదిలో వరద నీటి ప్రవాహం

    కృష్ణా: దివిసీమలో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. పులిగడ్డలోని  అక్విడెక్టు వద్ద బుధవారం సాయంత్రం 17 అడుగుల వరదనీటి ప్రవాహం సాగరుడి వైపు తరలిపోతోంది. అక్విడెక్టు అదనపు తొట్టె నుంచి వరదనీరు నదిలోకి జారుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 4.70 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు డీఈఈ బట్టు గణపతి పేర్కొన్నారు. మరో ఐదు రోజులపాటు కృష్ణానదిలో వరద నీటిప్రవాహం ఉంటుందని తెలిపారు.

  • స్వశక్తితో ర్యాపిడో డ్రైవర్‌గా రాణిస్తున్న మహిళ

    ఎన్టీఆర్: విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన భవాని.. డ్వాక్రా రుణం ద్వారా ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశారు. ర్యాపిడో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కష్టాలకు కుంగిపోకుండా.. స్వశక్తిలో రాణిస్తూ ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా సాధికారతకు సీఎం చూపిన బాటలో ఇప్పుడు ఆ మహిళ దూసుకుపోతున్నారు. తనకు బాసటగా నిలిచిన సీఎం చంద్రబాబు, కూటమి సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

  • గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: CI

    కృష్ణా: వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు గన్నవరం సీఐ శివప్రసాద్ మీడియాతో తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధిత డీఎస్పీని కలిసి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. విగ్రహం పెట్టే అడ్రస్సు, ఎత్తు, ఎన్ని రోజులు పూజలు చేస్తారనే వివరాలు, నిర్వాహకుల పేర్లు, ఫోన్ నెంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

  • మంత్రి దుర్గేష్‌తో తంగిరాల భేటీ

    ఎన్టీఆర్: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంత్రి కందుల దుర్గేష్‌తో గురువారం భేటీ అయ్యారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ ప్రాతంలో ద్వారక వెంకటేశ్వరస్వామి దేవాలయం, చారిత్రక విశేషతలు, కృష్ణ పుష్కరాల విజయం గురించి వివరించారు. ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
  • ప్రెస్ క్లబ్ ఏర్పాటుపై బోడె హర్షం

    కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో గురువారం ప్రెస్ క్లబ్‌ను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హజరయ్యారు. ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఏర్పాటును స్వాగతించారు. నూతన కమిటీ అధ్యక్షుడు కనకవల్లి దిలీప్ కుమార్, ఉపాధ్యక్షులు లంకా తారక సత్యవర ప్రసాద్‌లకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కూటమి నాయకులు, నియెజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి శుభాకాంక్షలు తెలియజేశారు.
  • దివ్యాంగుల పున:పరిశీలనలో అవస్థలు

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల పున:పరిశీలన కోసం గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ దివ్యాంగులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షలు 12 గంటలకు మొదలయ్యాయని తెలిపారు. డాక్టర్లను కలిసి త్వరితగతిన న్యాయంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. మనోహర్, చౌడవరపు జగదీష్ కలిసి వారికి అన్నదానం ఏర్పాటు చేశారు.
  • రాష్ట్ర అధికార భాషా సంఘానికి కృష్ణారావు పేరు.. బుద్ధప్రసాద్ థ్యాంక్స్

    కృష్ణా: రాష్ట్ర అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరును మంత్రివర్గం నిర్ణయించడంపై ఆయన కుమారుడు అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ బుద్ధప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన శత జయంతి సభలో పేరును ప్రకటించిన అతిత్వరలోనే మంత్రిమండలి నేడు ఆమోదించారు. మంత్రిమండలి సభ్యులకు థ్యాంక్స్ చెప్పారు.

  • ఏపీ రెవెన్యూ శాఖకు స్కోచ్‌ అవార్డులు

    ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూశాఖకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. 2025 ఏడాదికిగాను రాష్ట్ర రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్‌లు అవార్డులు వచ్చాయి. ఆన్‌లైన కోర్ట్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు దక్కాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు రెవెన్యూ శాఖకు వచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విప్లవాత్మక సంస్కరణలకు అవార్డులు వరించినట్లు తెలిపారు. వచ్చేనెల20న దిల్లీలో స్కోచ్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

  • ప్రేమ పెళ్లి.. ప్రియుడికోసం కట్టుకున్న భర్తను..

    కృష్ణా: గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో జరిగిన ఈహత్య కేసులో, లక్ష్మణ్‌ను అతని భార్య పావని, ఆమె ప్రియుడు ప్రదీప్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. లక్ష్మణ్, పావని 15ఏళ్లక్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే, పావనికి సమీప బంధువైన ప్రదీప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈవిషయం లక్ష్మణ్‌కు తెలియడంతో ఈనెల 13న హత్యచేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.