Locations: Krishna

  • ఏపీ రెవెన్యూ శాఖకు స్కోచ్‌ అవార్డులు

    ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూశాఖకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. 2025 ఏడాదికిగాను రాష్ట్ర రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్‌లు అవార్డులు వచ్చాయి. ఆన్‌లైన కోర్ట్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు దక్కాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు రెవెన్యూ శాఖకు వచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విప్లవాత్మక సంస్కరణలకు అవార్డులు వరించినట్లు తెలిపారు. వచ్చేనెల20న దిల్లీలో స్కోచ్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

  • ప్రేమ పెళ్లి.. ప్రియుడికోసం కట్టుకున్న భర్తను..

    కృష్ణా: గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో జరిగిన ఈహత్య కేసులో, లక్ష్మణ్‌ను అతని భార్య పావని, ఆమె ప్రియుడు ప్రదీప్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. లక్ష్మణ్, పావని 15ఏళ్లక్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే, పావనికి సమీప బంధువైన ప్రదీప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈవిషయం లక్ష్మణ్‌కు తెలియడంతో ఈనెల 13న హత్యచేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.  
  • మహిళల పక్షపాతి చంద్రబాబు: ఎమ్మెల్యే

    కృష్ణా: ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల పక్షపాతి అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. కృత్తివెన్నులోని టీడీపీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

  • Jr. NTRపై అసభ్య వ్యాఖ్యలు.. టీడీపీ ఎమ్మెల్యేలకు CM వార్మింగ్

    జూనియర్ ఎన్టీఆర్‌‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

  • టచ్ ఫోన్ల కోసం దరఖాస్తు చేసుకోండి!

    కృష్ణా: వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బధిరులకు టచ్ ఫోన్లను ఉచితంగా అందజేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి కామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు వయసు కలిగి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై సైగల భాష వచ్చిన వారు, 40 శాతం, అంతకన్నా ఎక్కువ వికలాంగత్వం కలిగి, కుటుంబ సభ్యుల వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా చేసుకోవాలన్నారు.

  • డిజిటల్ పీపుల్ సర్వీసులో ఏపీ అగ్రస్థానం: గుడివాడ ఎమ్మెల్యే

    కృష్ణా: విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ డిజిటలైజేషన్‌లో దూసుకుపోతోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. విశాఖ సైబర్ సెక్యూరిటీ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ.. లోకేష్ నాయకత్వంలో ఐటీ రంగం అభివృద్ధి పథంలో ఉన్నదని చెప్పారు. డిజిటల్ పీపుల్ సర్వీసులో ఏపీ తొలి స్థానంలో నిలిచిందని, డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ కీలకమని ఆయన ఉద్ఘాటించారు.

     

  • మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా ధర్మేంద్ర

    కృష్ణా: మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కోసూరి ధర్మేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత, నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

     

  • వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

    కృష్ణా: అవనిగడ్డలో వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు సీఐ యువ కుమార్, ఎస్సై శ్రీనివాసరావులు గణేష్ మండప కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మండపాలు, విగ్రహాలు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, మైకులకు అనుమతి తప్పనిసరని, రాత్రి 10 తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరపరాదని సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు,బారికేడ్లు ఏర్పాటు చేయాలిని తెలిపారు.

  • చెస్‌తో మానసిక స్థైర్యం పెంపు: శాప్ ఛైర్మన్

    ఎన్టీఆర్: విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో ఎస్.ఆర్.ఆర్.ఇంటర్నేషనల్ ఓపెన్ అండ్ బ్లిట్జ్ ఫిడేరేటింగ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రష్యా, కెన్యా, కెనడా, యూఎస్‌ఏ వంటి దేశాల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ..ప్రపంచం గర్వించదగ్గ గ్రాండ్ మాస్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం గర్వకారణమని తెలిపారు. చెస్ మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

  • ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిపై సబ్‌ కలెక్టర్ ఫైర్

    ఏలూరు: లింగపాలెం ఎంపీడీవో కార్యాలయాన్ని నూజివీడు సబ్‌ కలెక్టర్ బి.వినూత్న తనిఖీ చేశారు. రికార్డ్ రూమ్ తనిఖీ చేయడానికి వెళ్లగా.. తాళాలు లేవని డిప్యూటీ ఎంపీడీవో, ఏవో సమాధానం ఇవ్వడం, సబ్ కలెక్టర్ వస్తున్నారని ముందే తెలిసినా.. ఎంపీడీవో సెలవు పెట్టడంపై వినూత్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపై ఎంపీడీవో, ఏవో, డిప్యూటీ ఎంపీడీవోపై సబ్‌కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.