ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారం చేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి అని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గుర్తింపు కార్డ్ ఉంటేనే వ్యాపారం చేసుకునేందుకు అనుమంతించాలని అధికారులను ఆదేశించారు. వీధి విక్రయదారుల చట్టం-2014 ప్రకారం నగరంలో వీది వ్యాపారులకు కచ్చితంగా గుర్తింపు కార్డులు ఉండాలన్నారు.
Locations: Krishna
-
‘ఎరువుల కొరత అధిగమించేలా కృషి చేస్తాం’
కృష్ణా: మోపిదేవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) ఛైర్మన్‌గా పరుచూరి శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. త్రిసభ్య కమిటీ సభ్యులుగా ప్రసాద్, కొలుసు శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతులకు దీర్ఘ-స్వల్పకాలిక రుణాలను సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్లో అధికారుల సమన్వయంతో ఎరువుల కొరతను అధిగమించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
-
ప్రతీ స్కూల్‌లో చెస్ ఆట: రవినాయుడు
ఎన్టీఆర్: విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఎస్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ ఓపెన్&బ్లిడ్జ్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రష్యా, కెన్యా, కెనడా, యూఎస్ఏ దేశాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా శాప్ ఛైర్మన్ రవినాయుడు పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచం గర్వించదగ్గ చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఏపీ నుంచి రాణించడం గర్వకారణమన్నారు. విద్యాశాఖ సహకారంతో ప్రతీ పాఠశాలలో చదరంగాన్ని తప్పనిసరి చేస్తామన్నారు.
-
ఎకరాకు రూ.10వేల సాయం అందించాలి : CPM
ఎన్టీఆర్: రాష్ట్రంలో వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు భారీ నష్టం కలిగిందని CPM రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ పోలవరం పునరావాసానికి రూ.900 కోట్లు కేటాయిస్తే.. వాటిని బకాయిలు చెల్లించడానికి మళ్లించారని ఆరోపించారు. పునరావాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి వరదలతో నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం సహాయం చేయాలన్నారు.
-
జిల్లాస్థాయి యోగాసన పోటీలకు డేట్ ఫిక్స్
ఏలూరు: ఆగిరిపల్లిలో సెప్టెంబర్ 7వ తేదీన నుంచి జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో పోటీలు జరుగుతాయని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు యండూరు నరసింహమూర్తి, కార్యదర్శి బొద్దూరు సాంబశివరావు, తెలిపారు. 8 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9490335122, 9133402255 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
-
ఎదురుచూపులు.. ఇంకెన్ని గంటలు
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో నిర్వహించిన ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సదరన్ క్యాంపు సమయం 11 గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో క్యాంప్‌కి రీ ఎరిఫికేషన్‌కి వచ్చిన వికలాంగులు మండిపడుతున్నారు. 10.30 స్టార్ట్ అవ్వాల్సిన క్యాంపు 12 అవుతున్నా ప్రారంభం కాకపోవడం పట్ల దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
మినుముల దొంగలు అరెస్ట్
కృష్ణా: మినుముల దొంగలను పామర్రు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈనేపథ్యంలో పామర్రు పీఎస్‌లో ఎస్సై రాజేంద్రప్రసాద్ ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈనెల 4న దుకాణంలో రూ.2లక్షలు విలువచేసే 20క్వింటాళ్ల మినుములు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్, కాల్ డేటాలను పరిశీలించి శివరామకృష్ణ, మనోజ్‌కుమార్, గోపికృష్ణలు చోరీ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఓకార్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
-
రైతులకు పారదర్శకంగా సేవలందించాలి
ఎన్టీఆర్: విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్) త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారోత్సవం గురువారం జరిగింది. సొసైటీ ఛైర్మన్‌గా నాగవర్ధనరావు, సభ్యులుగా వెంకటరావు, వెంకటేశ్వరరావులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న కేడీసీసీబీ ఛైర్మన్ నెట్టెం రఘురాం, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు పారదర్శకంగా సేవలందించాలన్నారు. వ్యవసాయ అనుబంధ రుణాల మంజూరులో సొసైటీల పాత్ర కీలకమన్నారు.
-
నిలకడగా కృష్ణానది వరద
ఎన్టీఆర్: కృష్ణానది వరద నిలకడగా ఉందని ఇబ్రహీంపట్నం తహశీల్దార్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఉదయం కృష్ణా నది వరద ఉధృతిని ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆయన పరిశీలించారు. ఎప్పటికప్పుడు వరద అంచనా వేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముందు జాగ్రత్తగా పశ్చిమ ఇబ్రహీంపట్నం ట్రాక్ టర్మినల్ వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామమన్నారు.
-
జాతీయస్థాయి రోబోటిక్స్ పోటీలు అప్పుడే!
ఎన్టీఆర్: విజయవాడలోని సిద్ధార్థ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 18, 19 తేదీల్లో జాతీయస్థాయి రోబోటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. రోబో ఎక్స్- 2025 కార్యక్రమంలో భాగంగా పోటీలు జరుగుతాయన్నారు. యువ ఇంజినీర్లలో ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. ఆరు సాంకేతిక విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు రూ.2లక్షల నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.