ఏలూరు: ఆగిరిపల్లిలో సెప్టెంబర్ 7వ తేదీన నుంచి జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో పోటీలు జరుగుతాయని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు యండూరు నరసింహమూర్తి, కార్యదర్శి బొద్దూరు సాంబశివరావు, తెలిపారు. 8 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9490335122, 9133402255 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Locations: Krishna
-
ఎదురుచూపులు.. ఇంకెన్ని గంటలు
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో నిర్వహించిన ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సదరన్ క్యాంపు సమయం 11 గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో క్యాంప్‌కి రీ ఎరిఫికేషన్‌కి వచ్చిన వికలాంగులు మండిపడుతున్నారు. 10.30 స్టార్ట్ అవ్వాల్సిన క్యాంపు 12 అవుతున్నా ప్రారంభం కాకపోవడం పట్ల దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
మినుముల దొంగలు అరెస్ట్
కృష్ణా: మినుముల దొంగలను పామర్రు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈనేపథ్యంలో పామర్రు పీఎస్‌లో ఎస్సై రాజేంద్రప్రసాద్ ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈనెల 4న దుకాణంలో రూ.2లక్షలు విలువచేసే 20క్వింటాళ్ల మినుములు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్, కాల్ డేటాలను పరిశీలించి శివరామకృష్ణ, మనోజ్‌కుమార్, గోపికృష్ణలు చోరీ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఓకార్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
-
రైతులకు పారదర్శకంగా సేవలందించాలి
ఎన్టీఆర్: విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్) త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారోత్సవం గురువారం జరిగింది. సొసైటీ ఛైర్మన్‌గా నాగవర్ధనరావు, సభ్యులుగా వెంకటరావు, వెంకటేశ్వరరావులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న కేడీసీసీబీ ఛైర్మన్ నెట్టెం రఘురాం, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు పారదర్శకంగా సేవలందించాలన్నారు. వ్యవసాయ అనుబంధ రుణాల మంజూరులో సొసైటీల పాత్ర కీలకమన్నారు.
-
నిలకడగా కృష్ణానది వరద
ఎన్టీఆర్: కృష్ణానది వరద నిలకడగా ఉందని ఇబ్రహీంపట్నం తహశీల్దార్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఉదయం కృష్ణా నది వరద ఉధృతిని ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆయన పరిశీలించారు. ఎప్పటికప్పుడు వరద అంచనా వేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముందు జాగ్రత్తగా పశ్చిమ ఇబ్రహీంపట్నం ట్రాక్ టర్మినల్ వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామమన్నారు.
-
జాతీయస్థాయి రోబోటిక్స్ పోటీలు అప్పుడే!
ఎన్టీఆర్: విజయవాడలోని సిద్ధార్థ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 18, 19 తేదీల్లో జాతీయస్థాయి రోబోటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. రోబో ఎక్స్- 2025 కార్యక్రమంలో భాగంగా పోటీలు జరుగుతాయన్నారు. యువ ఇంజినీర్లలో ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. ఆరు సాంకేతిక విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు రూ.2లక్షల నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
-
రాజముద్రతో భూ యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం
కృష్ణా: రైతుల భూములకు సంబంధించి కీలకమైన పట్టాదారు పాసు పుస్తకాలకు రాజముద్ర పడింది. ఈ మేరకు రాజముద్రదతో కూడిన పుస్తకాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కొత్త పుస్తకాలు రెవెన్యూ కార్యాలయాలకు ఇప్పటికే చేరాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పెడన మండల ఇన్‌ఛార్జ్ తహసిల్దార్ అనిల్ కుమార్ తెలిపారు.
-
నాలుగు దేవాలయాల్లో దొంగల హల్‌చల్
AP : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. రామాలయం, వేణుగోపాల స్వామి, గంగానమ్మ, శ్రీ వినాయక దేవాలయాల్లో హుండీలను పగులగొట్టి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. సుమారు 5 లక్షల విలువ చేసే నాలుగు కేజీల 9 వెండి కిరీటాలు, చటారాలు, పలు ఆభరణాలు చోరీకి గురైన వాటిలో ఉన్నాయి. CC కెమెరాలను పరిశీలిస్తూ దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
-
HP పెట్రోల్ బంక్‌లో నిధుల స్వాహా
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలోని NTTPS కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే HP పెట్రోల్‌బంక్‌లో భారీ నిధుల స్వాహా ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ ఉద్యోగి నగదు మాయం చేశాడని ఫిర్యాదురాగా.. అదే వ్యక్తి కనిపించకుండా పోయాడని ఆయన భార్య ఈనెల 8న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
-
తాళాలు వేసిన దేవాలయాల్లో చోరీ!
కృష్ణా: మొవ్వ మండలం కోసూరులో దొంగలు హల్‌చల్ చేశారు. అర్ధరాత్రి నాలుగు దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. రామాలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో సుమారు రూ.5లక్షలు విలువచేసే నాలుగు కేజీల వెండి కిరీటాలు, చటారాలు, పలు ఆభరణాలు అపహరించారు. గంగానమ్మ, శ్రీవినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనపై కూచిపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.