Locations: Krishna

  • తాళాలు వేసిన దేవాలయాల్లో చోరీ!

    కృష్ణా: మొవ్వ మండలం కోసూరులో దొంగలు హల్‌చల్ చేశారు. అర్ధరాత్రి నాలుగు దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. రామాలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో సుమారు రూ.5లక్షలు విలువచేసే నాలుగు కేజీల వెండి కిరీటాలు, చటారాలు, పలు ఆభరణాలు అపహరించారు. గంగానమ్మ, శ్రీవినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనపై కూచిపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

     

     

     

  • జిల్లాలో 53,759 బంగారు కుటుంబాలు

    కృష్ణా: పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావటమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. పీ4 పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 53,759 మంది పేద కుటుంబాలను బంగారుకుటుంబాలుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 48,375 బంగారుకుటుంబాలను 4,272 మార్గదర్శిలకు అనుసంధానం చేశామన్నారు. ఉన్నత వర్గాలు, ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి, సంప్రదించి వారికి పీ4 కార్యక్రమంపై సంపూర్ణ అవగాహన కలిగించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

  • బీటెక్ విద్యార్థినికి బీజేపీ సాయం

    ఎన్టీఆర్: నందిగామ మండలం కమ్మవారిపాలానికి చెందిన బి.మౌనిక మిక్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెకు ల్యాప్‌టాప్ కొనడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో బీజేపీ సీనియర్ నాయకులు సైదా స్పందించి దాతల సహకారంతో ఆమెకు రూ.27వేలు ఆర్థికసాయం అందించారు. పార్టీ సీనియర్ నాయకుడు కేదార్నాథ్ శర్మ ల్యాప్‌టాప్ అందజేశారు. ఈ సందర్భంగా మౌనిక బీజేపీ నాయకులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది.

  • VRA.. డ్రైవర్‌గా.. కార్ క్లీనర్‌గా..!

    ఏలూరు: ముసునూరు తహశీల్దార్ ప్రశాంతి.. సురేపల్లి వీఆర్ఏ సీతయ్యను డ్రైవర్‌గా, కారు కడిగే పనులకు ఉపయోగించుకుంటున్నారని స్థానికంగా చర్చలు మొదలయ్యాయి. గతంలో చాట్రాయి మండలంలో తహశీల్దార్‌గా పనిచేసిన ప్రశాంతి సస్పెండ్ అయ్యారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. డ్రైవర్ అందుబాటులో లేనందున సీతయ్య డ్రైవర్‌గా వినియోగించుకున్నట్లు వివరించారు. అయితే వీఆర్ఏను సొంత పనులకు వాడుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. 
  • పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు

    కృష్ణా: నందమూరులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి చేశారు. పెడన మండలం నందమూరులోని ఓ పేకాట శిబిరంపై డీఎస్పీ ప్రత్యేక బృందం దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది ఆటగాళ్లు పట్టుబడగా, మరో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.74,336 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

  • 90% వైకల్యం.. అయినా పెన్షన్ కట్!

    కృష్ణా: పెడన మున్సిపల్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు బుధవారం నిరసన తెలిపారు. 90 శాతం అంగవైకల్యంతో మెడికల్ సర్టిఫికెట్ల ద్వారా అర్హత సాధించి, నెలకు రూ.15 వేలు పెన్షన్ పొందేవారని, కానీ కుటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌తో పర్సంటేజీ తగ్గించి పెన్షన్‌లో కోత విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లాగే పూర్తి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు.
  • అమరావతిలో 10 ఎకరాల్లో హడ్కో కన్వెన్షన్‌ సెంటర్‌

    అమరావతిలో హడ్కో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు హడ్కో బోర్డు ఆమోదం తెలిపింది. ఈవిషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్‌ఖట్టర్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు లేఖ ద్వారా తెలిపారు. గుంటూరులో సీఆర్డీఏ కేటాయించిన 8 ఎకరాలను ఎకరం రూ.4కోట్ల చొప్పున కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతించింది. మొత్తం 10ఎకరాల్లో ఈకేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆమోదం లభించింది. ఈవివరాలను పెమ్మసాని చంద్రశేఖర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

  • శ్రీశైలం ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

    శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో అటవీ సిబ్బందిపై దాడి జరిగిందని వచ్చిన వార్తలపై ఆయన ఆరా తీశారు. అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే గొడవపడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనపై అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

  • రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మండలి

    కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పీఏసీఎస్ అధ్యక్షుడిగా తిరుమలశెట్టి బాల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిధులుగా మండలి వెంకట్రామ్, ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని వెంకట్రావ్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండే నాయకులతో సొసైటీ త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

  • కార్పొరేట్ సంపదతో పాటు పేదరికం పెరుగుతుంది: శ్రీనివాస్

    ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ 12వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీ‌హెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో కొండపల్లిలో జరుగున్నాయని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు, ప్రభుత్వరంగ సంస్థల రక్షణ, కార్మిక సంక్షేమానికి ఐక్య పోరాటాలు నిర్వహించనున్నట్లు చెెప్పారు. కార్పొరేట్ సంపదతో పాటు పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నాయని వెల్లడించారు. కార్మిక చట్టాల రద్దు, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.