
Locations: Krishna
-
90% వైకల్యం.. అయినా పెన్షన్ కట్!
కృష్ణా: పెడన మున్సిపల్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు బుధవారం నిరసన తెలిపారు. 90 శాతం అంగవైకల్యంతో మెడికల్ సర్టిఫికెట్ల ద్వారా అర్హత సాధించి, నెలకు రూ.15 వేలు పెన్షన్ పొందేవారని, కానీ కుటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌తో పర్సంటేజీ తగ్గించి పెన్షన్‌లో కోత విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లాగే పూర్తి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. -
అమరావతిలో 10 ఎకరాల్లో హడ్కో కన్వెన్షన్ సెంటర్
అమరావతిలో హడ్కో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు హడ్కో బోర్డు ఆమోదం తెలిపింది. ఈవిషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్‌ఖట్టర్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు లేఖ ద్వారా తెలిపారు. గుంటూరులో సీఆర్డీఏ కేటాయించిన 8 ఎకరాలను ఎకరం రూ.4కోట్ల చొప్పున కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతించింది. మొత్తం 10ఎకరాల్లో ఈకేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆమోదం లభించింది. ఈవివరాలను పెమ్మసాని చంద్రశేఖర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
-
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మండలి
కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పీఏసీఎస్ అధ్యక్షుడిగా తిరుమలశెట్టి బాల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిధులుగా మండలి వెంకట్రామ్, ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని వెంకట్రావ్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండే నాయకులతో సొసైటీ త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
-
కార్పొరేట్ సంపదతో పాటు పేదరికం పెరుగుతుంది: శ్రీనివాస్
ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ 12వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో కొండపల్లిలో జరుగున్నాయని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు, ప్రభుత్వరంగ సంస్థల రక్షణ, కార్మిక సంక్షేమానికి ఐక్య పోరాటాలు నిర్వహించనున్నట్లు చెెప్పారు. కార్పొరేట్ సంపదతో పాటు పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నాయని వెల్లడించారు. కార్మిక చట్టాల రద్దు, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి: మండవ
ఎన్టీఆర్: నందిగామ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి అధ్యక్షతన ఇంజనీరింగ్ సెక్రటరీల సమావేశం జరిగింది. ప్రధానమైన మంచినీటి సమస్యను, వీధిలైట్ల నిర్వహణను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుండాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని ఇంజనీరింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.
-
బాడవలో మహిళ అనుమానాస్పద మృతి
ఎన్టీఆర్: మైలవరం మండలం బాడవ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహాలక్ష్మి(55) తన ఇంటి బాత్రూంలో మృతి చెందినట్లు చెప్పారు. ఘటన స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
-
విద్యార్థులకు కొలుసు నితిన్ ప్రోత్సాహం
ఏలూరు: చదువుల్లోనే కాదు ప్రతిరోజు బడికి హాజరుకావడంలో కూడా రాణిస్తున్న విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేసి ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి కుమారుడు నితిన్ కృష్ణ తెలిపారు. చాట్రాయి మండలం పోలవరం హైస్కూల్‌కు గత విద్యా సంవత్సరంలో ఒక్కరోజు కూడా బడి మానకుండా హాజరైన విద్యార్థులకు ఆయన బుధవారం నగదు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున 15 మందికి రూ. 75వేలు బహుమతిగా ఇచ్చారు.
-
ట్రాఫిక్ సమస్యతో నిత్యం అవస్థలు
ఎన్టీఆర్: కంచికచర్ల నెహ్రూ సెంటర్ జాతీయ రహదారిపై విజయవాడ, హైదరాబాద్, మధిర రోడ్లు కలుస్తాయి. మూడు వైపుల నుంచి వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభిస్తుంది. గ్రామాల నుంచి వచ్చే వాహనాలు, ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఆటోలు, బస్సులు గొట్టుముక్కల రోడ్డు, డాక్టర్ అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇబ్బందులు పడుతున్నామని ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు వాపోయారు. -
రైతు రుణాలపై ప్రచారం పెంచండి: నెట్టెం
ఎన్టీఆర్: రైతులకు వేగవంతమైన రుణాల బట్వాడా చేయాలని నందిగామలో డీసీసీబీ ఛైర్మన్ నెట్టెం రఘురామ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నందిగామలో కృష్ణా డీసీసీబీ సమీక్ష సమావేశం జరిగింది. వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై ప్రచారం బలోపేతం చేయాలని రఘురామ్ సూచించారు. వాణిజ్య బ్యాంకులతో పోటీలో ముందంజలో ఉండాలని చెప్పారు. ఈ సంద్భంగా రైతులు, వినియోగదారుల అభిప్రాయాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు.