Locations: Krishna

  • ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌కు MLA సత్కారం

    ఎన్టీఆర్: నందిగామ ఏరియా హాస్పిటల్‌కు ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా లాబ్ టెక్నీషిన్ రవి కిరణ్‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అభినందించారు. అన్ని విభాగాల్లో జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దేవినేని వెంకటరమణ ఏరియా హాస్పిటల్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని సౌమ్య ఆకాంక్షించారు. హాస్పిటల్ ఛైర్మన్ వేపూరి నాగేశ్వరావు ఆధ్వర్యంలో రోగులకు మంచి సేవలు అందుతున్నాయని ప్రసంశించారు.

  • సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ భేటీ

    అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో, సీఎంను కలిసి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ సిద్ధమయ్యారు.

  • సీఎం చంద్రబాబుకు నమస్కరించిన రోబో

    గుంటూరు: మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‍ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కొత్త ఆవిష్కరణలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అక్కడ ఉన్న ఒక రోబో ముఖ్యమంత్రికి నమస్కరించింది. ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది.

  • అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

    ఎన్టీఆర్: గతవారం రోజులుగా కురిసిన వర్షాలకు కంచిచర్ల మండల కేంద్రంలో మురుగునీరు ఎక్కడపడితే అక్కడ నిలిపోయింది. దీంతో దుర్వాసన, రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తోంది. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ వంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక సమస్యలు తీవ్రమవుతున్నాయి. పంచాయతీ అధికారులు తక్షణం డ్రైనేజీ సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

  • చర్యలకు సిద్ధంగా ఉండాలి: మండలి

    కృష్ణా: వరద పరిస్థితి అంచనాకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణానది వరద పరిస్థితిని ఆయన పరిశీలించారు. అక్కడే అధికారులతో సమావేశమై వరద పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ బాలవర్దిరావు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు స్వర్ణలత, డీసీ ఛైర్మన్ బండ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • వంగ పంటలో ఇలా అధిక దిగుబడులు!

    కృష్ణా: ఘంటశాల మండలం కొడాలి గ్రామంలోని బంతి, వంగ పంటలను కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డా.మంజువాణి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త కృష్ణవేణి బుధవారం పరిశీలించారు. పూత, కాపు దశలో ఉన్న వంగలో కాండం తొలుచు, రసం పీల్చే పురుగులను గమనించి రైతులకు నివారణ చర్యలను వివరించారు. 40వ రోజున ప్రధానకాండం చివరలను తుంచాలని సూచించారు. దీనివలన అధిక దిగుబడి పొందవచ్చన్నారు.
  • దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత రాజీవ్: బొర్రా

    ఎన్టీఆర్: భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దిన మహానేత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ తెలిపారు. దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఆయన ప్రాణాలు అర్పించారని కొనియాడారు. కొండపల్లి బి.కాలనీ సెంటర్‌లో రాజీవ్‌ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ విగ్రహానికి కిరణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.

  • వామ్మో.. ఒక్కసారిగా టమాటా ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే?

    మొన్నటి వరకు కిలో టమాటా ధర రూ.20-30ఉండగా..తాజాగా హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.60-70 పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ టమాటా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా వ్యాపారులు అంటున్నారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో కేజీ టమాటా ధర రూ.50-60 వరకు పలుకుతుంది. ఇక, మిగతా జిల్లాల్లో 35-45 వరకు పలుకుతుంది.

  • దోమలను ఇలా నియంత్రించండి!

    ఎన్టీఆర్: ఇళ్ల పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కంచికచర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మధురిమ తెలిపారు. తద్వారా దోమలను నియంత్రించి విష జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య కేంద్రంలో దోమల వ్యాప్తి వలన కలిగే వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మలేరియా నివారణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

  • రైతన్న శ్రేయస్సే లక్ష్యం: తంగిరాల

    ఎన్టీఆర్: రైతన్న శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. నందిగామలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన ఎరువుల విక్రయ కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. నాణ్యమైన ఎరువులు, సాంకేతిక సహాయం, శిక్షణ ద్వారా రైతుల ఉత్పాదకత పెంచడమే లక్ష్యమని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతుల ఆర్థిక స్థితిని కూటమి ప్రభుత్వం మెరుగు పరుస్తుందని స్థానికులు ప్రశంసించారు.