Locations: Krishna

  • రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రాము

    కృష్ణా: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండల పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా వెనిగళ్ళ నాగేశ్వరరావు, డైరెక్టర్లుగా నవాబు, చింతల సూర్యచంద్రరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. నూతన కమిటీకు శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందించారు.

  • భారీ వర్షాలు.. రైతుల ఆందోళన!

    ఎన్టీఆర్: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని కృష్ణా నది పరివాహక గ్రామాలైన కొత్తపేట, చెవిటికల్లు, గని ఆత్కూరు వద్ద ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణా నదిలో నీటి ప్రవాహం క్రమేపి పెరుగుతోంది. కంచికచర్లలో కోతకొచ్చిన పెసర పంటలు నీటిలో నిలిచి పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికందేలా లేదని, నష్టం తప్పదని వాపోతున్నారు.

     

  • కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే

    కృష్ణా: కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. మొవ్వ మండలం కోసూరు గ్రామ శివారు తురకపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

  • 5 నెలల శిశువుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్!

    AP : విజయవాడలో కేవలం 5నెలల పసికందుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడికి ఈ అరుదైన ఆపరేషన్ సాధ్యమైంది. గడిచిన మూడేళ్ళలో ఈ ప్రోగ్రామ్ ద్వారా 10మందికిపైగా పిల్లలకు మణిపాల్ హాస్పిటల్‌లో లివర్ మార్పిడి జరిగి, 90శాతానికిపైగా విజయవంతం అయ్యాయి.ఈ సందర్భంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి సెంటర్లు 5-7మాత్రమే ఉన్నాయన్నారు.

  • ఎమ్మెల్యే రవికుమార్‌కు నాయకుల సంఘీభావం

    కృష్ణా: ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని జిల్లా కలింగ సంఘ నాయకులు అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జిల్లా కలింగ సంఘ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. తల్లిదండ్రుల ఆవేదన, విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించడం నేరం ఎలా అవుతుందన్నారు.

  • ‘దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే’

    ఎన్టీఆర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జన్మదినోత్సవం కంచికచర్లలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవిబాబు ఆధ్వర్యంలో చెవిటికల్ సెంటర్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం గద్ద కార్యక్రమం నిర్వహించారు. నందిగామ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వజ్రయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని, రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐటీ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందని వజ్రయ్య కొనియాడారు.

     

  • పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

    కృష్ణా: పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడలోని ప్రజా వేదిక కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 37 మందికి రూ.20,42,048 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అందజేశారు.

     

  • ‘అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తాం’

    కృష్ణా: అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని దివ్యాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. అనర్హులైన దివ్యాంగులకు పింఛన్లను తొలగిస్తే స్వాగతిస్తామని, కానీ అర్హులవి కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3987 మంది దివ్యాంగులకు నోటీసులు పంపారన్నారు. అర్హత ఉండి పింఛను కోల్పోయిన దివ్యాంగులు 9291902360 నంబర్‌కు సమాచారమిస్తే వారి తరఫున కమిటీ పోరాడుతుందని పేర్కొన్నారు.

  • చింతగుంటలో వ్యక్తి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి!

    కృష్ణా: గన్నవరం మండలం చిక్కవరం గ్రామ శివారు చింతగుంటలో ఆలస్యంగా హత్య కథనం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన డోలా లక్ష్మణ్‌కుమార్ ఈనెల 10న హార్ట్‌ఎటాక్‌తో మరణించారని సమాచారం. అయితే లక్ష్మణ్‌కుమార్ భార్య బిందుకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె ప్రియుడితో కలిసి తమ కొడుకును హత్య చేసిందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై రీపోస్టుమార్టం చేయాలని అధికారులను వారు ఆశ్రయించారు.

     

  • నూజివీడులో వాహన తనిఖీలు

    ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సిబ్బందితో కలిసి రహదారి ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా నిర్మూలన కోసం వాహన తనిఖీలు నిర్వహించారు. ‘ఫేస్ వాష్ కార్యక్రమం’ ద్వారా నిద్రమత్తులో డ్రైవింగ్ ప్రమాదాలను వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకూడదని ఆయన సూచించారు.