Locations: Krishna

  • భారీ వర్షాలు.. వరద సహాయక చర్యలకు నిధుల విడుదల

    ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ 16 జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. విపత్తు నిర్వహణ రాష్ట్ర కార్యాలయంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.విజయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు.

  • ఎడ్లంక గ్రామంపై కలెక్టర్ ఫోకస్

    కృష్ణానది వరదలతో అవనిగడ్డ మండలంలోని పాత ఎడ్లంక గ్రామం కోతకు గురై కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. ఈ విషయాన్ని టీడీపీ నేత బొబ్బా గోవర్ధన్ కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్లో మాట్లాడి, ఇప్పటికే పలు ఇళ్లు నదీపాతానికి గురవడాన్ని వివరించారు. తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాని తహసీల్దార్‌ను.. కలెక్టర్ ఆదేశించారు.
  • పెడన అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం: కాగిత

    కృష్ణా: రాబోయే నాలుగేళ్లలో పెడన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రు.20 లక్షల ముడా నిధులతో బంటుమిల్లి మండలం ములపర్రు నుంచి రామన్నమోడి గ్రామం వరకు పీవీసీ పైపు లైన్ పనులను పునరుద్ధరణ చేయుటకు మంగళవారం శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ మట్టా ప్రసాద్ పాల్గొన్నారు.

  • కరకట్ట గండ్లు పూడ్చకపోతే ఆందోళన చేస్తాం: CPM

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలోని ఖాజీమాన్యం సుందరయ్య కరకట్ట గండ్లు పూడ్చాలని సీపీఎం మండల కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరకట్టకు గండ్లు పడ్డాయని తెలిపారు. స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని చెప్పారు. మండల అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి తక్షణమే గండ్లు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో కరకట్ట ప్రజలతో బుధవారం ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

  • ఉయ్యూరులో మిస్ వరల్డ్ సుచాత సందడి

    కృష్ణా: ఉయ్యూరు మండలం యాకుమూరు గ్రామంలో 2025 మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ మంగళవారం సందడి చేశారు. మెగా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించారు. ఆమెను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి పాల్గొన్నారు. మిస్ వరల్డ్ ఉయ్యూరు రావడం పరిసరప్రాంత ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.
  • సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానానికి విరాళం

    కృష్ణా: మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానం పథకానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు విరాళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన అబ్బూరి శేఖర్, మాధవి వనజ రూ.50,116  విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు దాతలు అందించారు.

  • కృష్ణా నదికి వరద ఉద్ధృతి.. దివిసీమ రైతుల కలవరం

    కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో దివిసీమ రైతులకు కంటి మీద కునుకు కరవైంది. వరద పరిస్థితి తెలుసుకునేందుకు పులిగడ్డ అక్విడెక్ట్‌కు క్యూ కడుతున్నారు. 5 లక్షల క్యూసెక్కుల నీరు దాటితే పంట పొలాలు నీటమునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు

    విజయవాడలోని హోటళ్ళు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 బృందాలు పాల్గొన్నాయి. ఆఫ్ బాయిల్డ్ చికెన్ వంటి వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసి వడ్డిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇలా చేయడం ప్రజల ఆరోగ్యానికి హానికరం అని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటేశ్వరరావు, రాజగోపాల్ హెచ్చరించారు.

     

  • అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు

    ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  • నేను రెడీ.. మీరు రెడీనా.. కొలికపూడి YCPకి సవాల్

    ఎన్టీఆర్: ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్‌ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతిపై చర్చకు తాను సిద్ధమని.. జగన్ మోహన్ రెడ్డి సిద్ధమా, లేకపోతే వైసీపీ నుంచి ఎవరూ వచ్చినా తాను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.