Locations: Krishna

  • కృష్ణా నదికి వరద ఉద్ధృతి.. దివిసీమ రైతుల కలవరం

    కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో దివిసీమ రైతులకు కంటి మీద కునుకు కరవైంది. వరద పరిస్థితి తెలుసుకునేందుకు పులిగడ్డ అక్విడెక్ట్‌కు క్యూ కడుతున్నారు. 5 లక్షల క్యూసెక్కుల నీరు దాటితే పంట పొలాలు నీటమునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు

    విజయవాడలోని హోటళ్ళు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 బృందాలు పాల్గొన్నాయి. ఆఫ్ బాయిల్డ్ చికెన్ వంటి వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసి వడ్డిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇలా చేయడం ప్రజల ఆరోగ్యానికి హానికరం అని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటేశ్వరరావు, రాజగోపాల్ హెచ్చరించారు.

     

  • అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు

    ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  • నేను రెడీ.. మీరు రెడీనా.. కొలికపూడి YCPకి సవాల్

    ఎన్టీఆర్: ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్‌ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతిపై చర్చకు తాను సిద్ధమని.. జగన్ మోహన్ రెడ్డి సిద్ధమా, లేకపోతే వైసీపీ నుంచి ఎవరూ వచ్చినా తాను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

  • అధికారులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

    కృష్ణా: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నందున అధికారులందరూ వారి ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో అప్రమత్తంగా ఉండి అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వరద పరిస్థితులపై జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. వరదలు నియంత్రణకు వచ్చేంతవరకు ఎవరికి ఎటువంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు.

     

  • 23న మెగా జాబ్‌మేళా.. పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచార పోస్ట‌ర్ల‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నందిగామలోని KVR కాలేజీ ప్రాంగ‌ణంలో ఈ నెల 23వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మెగా జాబ్ మేళా జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ జాబ్ మేళాను యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • భారీ వర్షాలు.. నీట మునిగిన పత్తి, పెసర పంటలు

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గని ఆత్కూరు, కొత్తపేట గ్రామాల పల్లపు ప్రాంతంలో గత వారంగా కురుస్తున్న భారీ వర్షాలతో పత్తి, పెసర పంటలు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో పత్తి పంటలు పూర్తిగా నీటిలో మునిగి, ఆకులు నల్లగా మారుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     

  • KGVB ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యే కూన రియాక్షన్ ఇదే!

    శ్రీకాకుళం: ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు తాళలేక కేజీబీవీ(KGBV) ప్రిన్సిపాల్‌ రేజేటి సౌమ్య ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సౌమ్య ఆరోపణలపై రవికుమార్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవని కొట్టి పడేశారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకు అధికారులను ప్రశ్నించే హక్కు లేదా అని అన్నారు.

  • ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తంగిరాల అన్నారు. నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన రాచమల్లు నాగేశ్వరరావు గుండెపోటు సమస్యతో బాధపడుతుండగా, సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. ఈ ఎల్‌ఓసీని ఎమ్మెల్యే మంగళవారం నాగేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

     

  • తిరుమల కొండపై వరకు వెళ్లవచ్చు: కొనకళ్ల

    కృష్ణా: మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకూ పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రకటించారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్టీసీ బస్టాండును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వర్లులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. బస్టాండు, బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం బస్టాండులో మహిళల, పురుషుల మరుగుదొడ్లను పరిశీలించారు.