ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయవాడ-గుంటూరు వారధి వద్ద కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న శ్రీభవానీ జలశంకర దేవాలయం నీట మునిగింది. వరద ఉద్ధృతి కారణంగా నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.
Locations: Krishna
-
అన్న క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి
ఎన్టీఆర్: విజయవాడలోని రాణిగారితోట బాలాజీ నగర్‌లో గల అన్న క్యాంటీన్‌ను మంత్రి సవిత సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో కలిసి ఆమె భోజనం చేశారు. భోజనం గురించి, వారి వృత్తి, ఊరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న వారంతా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు.
-
కొండపల్లి బొమ్మ.. జ్ఞాపకాల కొమ్మ..
ఎన్టీఆర్: అందాన్ని వర్ణించాలంటే కొండపల్లి బొమ్మతో పోల్చుతారు. అందులో కొండపల్లి నాట్య బొమ్మ(డ్యాన్సింగ్ డాల్) అంటే ప్రతిఒక్కరికీ ఎంతో ఇష్టం. అందమైన నాట్య బొమ్మలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని కొండపల్లిలో తయారు చేస్తారు. వాస్తవానికి ఓ ప్రత్యేకమైన కర్రతో బొమ్మలు తయారు చేస్తారు. దానిని సహజ సిద్ధమైన రంగులు అద్దుతారు. అంతే చూడచక్కని కొండపల్లి నాట్య బొమ్మ సిద్ధమవుతుంది.
-
రైతాంగ అభ్యున్నతే అజెండా: గుడివాడ ఎమ్మెల్యే
కృష్ణా: రైతాంగ అభ్యున్నతే అజెండాగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం గుంటాకోడూరు, మోటూరు వ్యవసాయ పరపతి సహకార సంఘాల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని కమిటీ సభ్యులను అభినందించారు. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో అందరం కలిసి పని చేద్దామని కూటమి నాయకత్వానికి ఆయన పిలుపునిచ్చారు.
-
గణేష్ ఉత్సవాల్లో రూల్స్ పాటించాలి: సీఐ
కృష్ణా: వినాయక చవితి ఉత్సవాల్లో నియమ నిబంధనలు పాటించాలని పెడన సర్కిల్ సీఐ కె.నాగేంద్రప్రసాద్ సూచనలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సీఐ ఉత్సవ కమిటీలను కోరారు. మండపాలను ఏర్పాటు చేసుకునే ప్రతి కమిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తరువాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు.
-
వర్షాకాలంలో కొండ ప్రాంతవాసులు బిక్కుబిక్కు
ఎన్టీఆర్: ముసురుకున్న వాతావరణంతో విజయవాడ నగరంలోని కొండ ప్రాంతాల ప్రజలు గజగజలాడుతున్నారు. ఇటీవల వరుసగా వర్షాలు పడటంతో కొండలు నానాయి. తాజాగా ముసురు పట్టడంతో మరింతగా నానుతున్నాయి. ఇటీవల ప్రైజర్‌పేట కొండపై రిటెయినింగ్ వాల్ విరిగిపడింది. ముసురు వాతావరణం, భారీ వర్షాలతో ఆయా ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నగర జనాభాలో 30శాతం మంది కొండపైనే జీవిస్తున్నారు.
-
చల్లపల్లి బస్టాండ్‌ను సందర్శించిన కొనకొళ్ల
కృష్ణా: చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ను ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు సందర్శించారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా అమలు చేసిన ఉచిత బస్ ప్రయాణంపై మహిళా ప్రయాణికులు, కళాశాల యువతులతో ముచ్చటించారు. ప్రయాణంపై వారి అభిప్రాయాలు అడిగి తెలసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై మహిళలు తమ సంతోషాన్ని ఛైర్మన్‌తో పంచుకున్నారు.
-
నిత్యాన్నదానానికి విరాళం
కృష్ణా: మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నిత్యాన్నదానం పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు విరాళం అందించారు. డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అబ్బూరి శేఖర్, మాధవీవనజలు రూ.50,116 నగదు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
-
రైతుల శ్రేయస్సే ధ్యేయంగా..!
ఎన్టీఆర్: మైలవరం మండలం పుల్లూరు పీఏసీఎస్ త్రిసభ్య ఛైర్మన్‌గా వజ్రాల సురేష్ రెడ్డి, కమిటీ సభ్యులు యు.వెంకట నారాయణ, వైవీ శ్రీనివాసరావులు సొసైటీలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని త్రిసభ్య కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సు ప్రధాన ధ్యేయంగా త్రిసభ్య కమిటీ సభ్యులు సేవలందించాలని ఎమ్మెల్యే సూచించారు.
-
వాటర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా: గ్రామాల అభివృద్ధిపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం తాడిగడప మున్సిపాలిటీ పోరంకిలోని రామాపురం కాలనీలో వాటర్ లైన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.