Locations: Krishna

  • రైతుల శ్రేయస్సే ధ్యేయంగా..!

    ఎన్టీఆర్: మైలవరం మండలం పుల్లూరు పీఏసీఎస్ త్రిసభ్య ఛైర్మన్‌గా వజ్రాల సురేష్ రెడ్డి, కమిటీ సభ్యులు యు.వెంకట నారాయణ, వైవీ శ్రీనివాసరావులు సొసైటీలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని త్రిసభ్య కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సు ప్రధాన ధ్యేయంగా త్రిసభ్య కమిటీ సభ్యులు సేవలందించాలని ఎమ్మెల్యే సూచించారు.

     

  • వాటర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన

    కృష్ణా: గ్రామాల అభివృద్ధిపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం తాడిగడప మున్సిపాలిటీ పోరంకిలోని రామాపురం కాలనీలో వాటర్ లైన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

  • కృష్ణా, గోదావరి వరదలపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్

    గుంటూరు: కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జయలక్ష్మి 13 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, నిత్యావసర వస్తువులు, మందులు, శానిటేషన్ సామగ్రి అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

     

  • రాజకీయాలకు అతీతంగా.. రైతులకు అండగా!

    ఎన్టీఆర్: మైలవరం మండలం చండ్రగూడెం పీఏసీఎస్ ఛైర్మన్‌గా మోర్ల వెంకట రోశాలు, కమిటీ సభ్యులు పి.తిరుపతిరావు, తోక నాగరాజులు సొసైటీలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని త్రిసభ్య కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సేవలందించాలని ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు సూచించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, వారికి అండగా ఉండాలన్నారు.

     

  • వెల్వడం ప్రజల నిరసన

    ఎన్టీఆర్: మైలవరం, నూజివీడు రహదారి పనులను పునరిద్దరించాలంటూ మైలవరం ఆర్ అండ్ బి కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వెల్వడం గ్రామస్తులు నిరసనకు దిగారు. నిరసన నేపథ్యంలో ఆర్ అండ్ బి ఈఈ స్పందించారు. సెప్టెంబర్ 3 వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఈఈ హామీ ఇవ్వడంతో నిరసనకారులు వెనుదిరిగారు.

  • ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

    ఎన్టీఆర్: విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు బ్యారేజీకి 3,97,250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. బ్యారేజీ 1 గేటు మూసి 69 గేట్లును పూర్తిస్థాయిలో ఎత్తి 4,07,087 క్యూసెక్కులు సముద్రంలో విడిచిపెట్టారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం లేదా రేపటికి 6 లక్షల క్యూసెక్కులు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

  • మోటార్ సైకిళ్ల దొంగలకు మూడేళ్ల జైలు

    ఎన్టీఆర్: మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మైలవరం సీఐ ఆధ్వర్యంలో ఎస్సై కేసు దర్యాప్తు చేపట్టి నాగతిరుపతిబాబు, మారేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు మైలవరం జ్యూడిషల్ మేజిస్ట్రేట్ ఎం.శైలజ మూడేళ్ల  జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.

     

  • లంక వాసులు అప్రమత్తంగా ఉండాలి : అనగాని

    ఎన్టీఆర్: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గ పరిధిలో కరకట్టకు అనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు వెల్లడించారు.

  • మరిన్ని బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం

    కృష్ణా: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. పథకం అమలైన తొలి మూడు రోజుల్లోనే 27లక్షల మంది మహిళలు ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకుని రూ.11.27కోట్లు లబ్ది పొందినట్లు వెల్లడించారు. మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, అందుకు తగ్గట్టుగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుందన్నారు.

     

  • వాటర్ ట్యాంక్‌కు మోక్షమెప్పుడో..!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం నక్కలంపేటలోని వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. వాటర్ ట్యాంక్ మెట్లు కూలినా పంచాయతీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి వాటర్ ట్యాంక్‌ను శుభ్రం కూడా చేయలేదని మండిపడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తూ..ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్‌కు మోక్షం కల్పించాలని కోరుతున్నారు.