
Locations: Krishna
-
కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్.. స్టూడెంట్స్ సేఫ్
కృష్ణా: గన్నవరం మండలం గొల్లనపల్లి నుంచి ఆగిరిపల్లి వస్తుండగా తోటపల్లి శివారులో ఓ హైస్కూల్ బస్ అదుపుతప్పి సైడ్ కాలువలోకి దూసుకెళ్లింది. బస్‌లోని విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వాహనం కాలువ నుంచి బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. -
వేటకు వెళ్లొద్దు.. మత్స్యకారులకు సూచనలు
ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతలైన రావిరాల, వేదాద్రి ప్రాంత మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రావిరాల ప్రాంతం వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని పంచాయితీ, పోలీస్ అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.
-
కొండ ప్రాంతవాసులకు వర్షాకాలంలో తప్పని తిప్పలు
AP : ముసురుకున్న వాతావరణంతో విజయవాడ నగరంలోని కొండ ప్రాంతాల ప్రజలు గజగజలాడుతున్నారు. నగర జనాభాలో 30శాతం మంది కొండపైనే జీవిస్తున్నారు. ముసురు పట్టినా, నాలుగైదు రోజులు వర్షాలు కురిసినా కొండ ప్రాంతాలు వణికి పోవాల్సిందే. ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించటానికి రిటెయినింగ్ వాల్స్ మాత్రమే పరిష్కారం. ఈ దిశగా అధికార యంత్రాంగాలు ఎప్పుడు కదులుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
-
గుంతలమయం.. ప్రమాదాలకు నిలయం
ఏలూరు: నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లే ప్రధాన రహదారి పోతిరెడ్డిపల్లి సెంటర్ వద్ద రహదారి గుంతల మయంగా తయారైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని వాహనాలు రాకపోకలతో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రయాణ సమయంలో గుంతలు తప్పించే క్రమంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.
-
పొంగిన వరద.. స్తంభించిన రాకపోకలు
ఎన్టీఆర్: వీరులపాడు మండలం దాములూరు శివారు కూడలి వద్ద వైరా, కట్టలేరులో వరద ప్రవాహం కొనసాగుతుంది. కూడలి- పల్లంపల్లి చప్టా మీదుగా గత ఏడు రోజులుగా రాకపోకలు నిలిచాయి. దీంతో నందిగామ, వీరులపాడు మండలాల్లోని 40గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. వరద తగ్గకపోవడంతో ఏరు దాటి పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.
-
గడిచిన 24గంటల్లో 77.0మి.మీ వర్షపాతం నమోదు
ఎన్టీఆర్: నందిగామ డివిజన్‌లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 77.0మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వత్సవాయిలో 22.2మి.మీ., జగ్గయ్యపేటలో 11.8మి.మీ., పెనుగంచిప్రోలులో 12.8మి.మీ., నందిగామలో 3.6మి.మీ., వీరులపాడులో 16.8మి.మీ., కంచికచర్లలో 7.0మి.మీ., చందర్లపాడులో 2.8మి.మీ.,నమోదైంది. డివిజన్‌లో సగటుగా 11.0మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
-
ట్రాక్టర్ బోల్తా.. గుంతలే కారణం
ఎన్టీఆర్: మైలవరం మండలం తోలుకోడులో మంగళవారం ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పొలం పనుల నిమిత్తం వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై ఏర్పడిన బారి గుంత కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రోడ్డుపై గుంతలు పూడ్చేవరకు ఇలాంటి ప్రమాదాలు తప్పవని, ప్రాణాలు పోవడం ఖాయమని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డు మరమమ్మతుల చేపట్టాలన్నారు.
-
ఉద్ధృతంగా కృష్ణమ్మ..లంకగ్రామాల ప్రజలకు హెచ్చరికలు
AP : ప్రకాశం బ్యారేజీ నుంచి 3.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఇన్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికి ఇన్ ఫ్లో 5లక్షల క్యూసెక్కులు, సాయంత్రానికి 6లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విపత్తు నిర్వహణ సంస్థ లంక గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
-
‘జనసేనకు అండగా ఉంటాం’
ఏలూరు: నూజివీడులోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్‌గా జనసేన నేత కస్తూరి రాము, కొండయ్య గారి సత్రం మెంబర్‌గా గొల్లపల్లి గిరిబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి కొలుసు పార్ధసారథి, నియోకవర్గ జనసేన సమన్వయకర్త బర్మా ఫణిబాబులకు ధన్యవాదాలు తెలిపారు. జనసేనకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
-
శిక్షణపై వెళ్లిన రమ్యకీర్తన.. ఆమె స్థానంలో ఆయన
ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ కె.షమ్మీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా వ్యవహరించిన బి.రమ్యకీర్తన విజయవాడ హ్యూమన్‌రైట్స్ డెవలప్మెంట్ ఇన్స్‌స్టిట్యూట్‌లో జరుగనున్న ప్రొఫెషనల్ శిక్షణకు వచ్చేనెల 20వ తేదీ వరకు హాజరుకానున్న నేపథ్యంలో షమ్మీని నియమిస్తూ..మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆరు వారాల పాటు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.