Locations: Krishna

  • సబ్సిడీ యూరియా చేరాల్సింది వారికే!

    కృష్ణా: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ యూరియాను కేవలం సాధారణ రైతులకు చేరాలని కలెక్టర్ డీకే బాలజీ స్పష్టం చేశారు. ఫౌల్ట్రీ, ఆక్వా పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరరాలకు యూరియాను వినియోగించకూడదని హెచ్చరించారు. దీని పర్యవేక్షణ కోసం వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా యూరియాను వినియోగిస్తున్నట్లు తెలిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

     

  • ఘర్షణలు లేకుండా గణేష్ ఉత్సవాలు

    కృష్ణా: అల్లర్లు, ఘర్షణలు లేకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆర్.పేట సీఐ యేసుబాబు సూచించారు. రాబర్ట్‌సన్‌పేట, మచిలీపట్నం, బందరు తాలూకా పోలీస్‌స్టేషన్ల పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీకి సీఐ పలు సూచనలు చేశారు. పోలీసుల అనుమతి తీసుకొని మాత్రమే మైకులు, సౌండ్ బాక్స్‌లు వంటివి పెట్టుకోవాలన్నారు. గణేషుడి ఊరేగింపులో మద్యం సేవించి శాంతిభద్రతలుకి భంగం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • MDS తాజా నోటిఫికేషన్‌

    AP : నీట్‌-పీజీ (MDS) కటాఫ్‌ శాతాన్ని 19.863కి తగ్గించిన నేపథ్యంలో విజయవాడ NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్‌/యాజమాన్య కోటా సీట్ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కటాఫ్‌ తగ్గించిన తరువాత అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 18 రాత్రి 7 గంటల నుంచి 21 వరకు రాత్రి 7 గంటల్లోగా కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • యాచకులను వృద్ధాశ్రమాలకు తరలింపు

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని యాచకులను సోమవారం సాయంత్రం వృద్ధాశ్రమాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు మాట్లాడుతూ.. విజయవాడ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మతిస్థిమితం లేని యాచకులను గుర్తించి, ప్రత్యేక వాహనంలో వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. యాచకత్వం సాగిస్తూ రోడ్లు దాటే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ క్రమంలో 10 మందిని వృద్ధాశ్రమాలకు పంపించినట్లు వెల్లడించారు.
  • లంకబాబు అనుభవం సొసైటీ అభివృద్ధికి సోపానం: మండలి

    కృష్ణా: సీనియర్ రాజకీయవేత్త లంకబాబు అనుభవం సొసైటీ అభివృద్ధికి సోపానమని మండలి వెంకట్రామ్ అన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం పీఏసీఎస్ కార్యాలయంలో నూతన ఛైర్మన్ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్(లంకబాబు), సభ్యులు తోట రాజేశ్వరరావు, సూదాని పూర్ణచంద్రరావు ప్రమాణస్వీకారం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులుగా వెంకట్రామ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

  • దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: వెనిగండ్ల

    కృష్ణా: దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. సోమవారం గుడివాడలోని విఘ్నేశ్వరస్వామి దేవస్థాన మండపంలో దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ముందుగా రాము స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ ఛైర్మన్‌గా సాయన రాజేష్, ఇతర సభ్యులచే ఆలయ అధికారులు ప్రమాణం చేయించారు.

  • చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌పై గుంతలో పడి పేలిన భారీ కంటైనర్ టైర్

    ఎన్టీఆర్: విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌పై రోడ్డులో ఉన్న గుంత కారణంగా ఒక భారీ కంటైనర్ టైరు పేలిపోయింది. దీంతో ఫ్రంట్ టైరు పగిలిపోయిన వాహనం అక్కడే నిలిచిపోయింది. దీనివల్ల ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, భారీ వాహనాలు బారులు తీరాయి. అంతేకాక, పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 112 కూడా పనిచేయకపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.

  • ఎంపీ, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

    కృష్ణా: ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు మచిలీపట్నం పట్టాభి మెమోరియల్ సాధన కమిటీ సభ్యులు పాలాభిషేకం చేశారు. పట్టాభిస్మారక భవన నిర్మాణానికి వెనక్కి వెళ్లిపోయిన నిధులను మరల తీసుకురావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. స్మారక భవనాన్ని గతంలో రూ.40 కోట్లతో బాలశౌరి తీర్చిదిద్దుతానంటే వైసీపీ మేయర్, కార్పొరేటర్లు అడ్డుపడ్డారని కమిటీ ప్రధాన కార్యదర్శి ఫణి కుమార్ వెల్లడించారు.

  • పెరిగన మిర్చి ధరలు

    ఎన్టీఆర్: గత కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న మిర్చి ధరలు సోమవారం కొంత ఆశాజనకంగా మారాయి. రేటు పెరగడంతో కంచికచర్ల శీతల గిడ్డంగిలో  మిర్చి పంటను విక్రయించేందుకు రైతులు ఉత్సాహం చూపించారు. ఆర్మూర్, 334 లావు, తేజాలు సన్నరకం గతవారం ధరలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి సుమారు రూ.1000కి పైగా ధర పెరిగినట్లు రైతులు తెలిపారు.

  • మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి సహా నిందితులకు ఎదురుదెబ్బ

    తూ.గో.: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ మిథున్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. వీరి పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగించిన న్యాయస్థానం..నేడు తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్‌ వాదనతో ఏకీభవిస్తూ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. వీరితో పాటు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లనూ కోర్టు కొట్టివేసింది.