Locations: Krishna

  • ఆయన బోధనలు సదా ఆచరణీయం: MLA

    ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సదా ఆచరణీయమన్నారు. సర్వశక్తివంతుడైన అల్లా ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నా అన్నారు.

     

     

  • ‘నా కుమారుడిని ఆదుకోండయ్యా..!’

    కృష్ణా: ఓపారిశుధ్య కార్మికురాలు తన కుమారుడి కోసం దాతల సాయం కోరుతుంది. చల్లపల్లిలోని నారాయణరావునగర్ ఎస్టీకాలనీలో నివసించే పారిశుధ్య కార్మికురాలు కుంభా సునీత కుమారుడు రవితేజ ఈఏడాది మార్చిలో జరిగిన రోడ్డుప్రమాదంలో కాళ్లు, చేతులు చచ్చుబడి వైద్యం చేయించుకునే స్థోమత లేక మంచానికి పరిమితమయ్యాడు. వైద్యనిమిత్తం దాతలు, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని వేడుకుంటుంది. 7842163961నంబర్‌కు ఫోన్‌పే, జీపే ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరింది.

  • PVN మాధవ్ ‘శోభాయాత్ర‘.. పార్టీకి బలం

    ఎన్టీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ‘సారథ్యం’లో భాగంగా నిర్వహించే శోభాయాత్ర పార్టీకి బలం చేకూరుతుందని నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పిట్టల శ్రీదేవి పేర్కొన్నారు. కంచికచర్ల పట్టణం నుంచి విజయవాడలో జరిగే ‘సారథ్యం’ శోభాయాత్రకు పార్టీ నేతలు బయలుదేరారు. ఈ సందర్భంగా జెండా ఊపి ఆమె బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాలవ మహేష్ బాబు పాల్గొన్నారు.

     

     

     

  • ఆయన జీవితం ఆదర్శం

    ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈద్-మిలాద్-ఉన్-నబి వేడుకలు కొండపల్లిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హజరత్ సయ్యద్ షాబుఖారి ఆస్థాన పీఠాధిపతులు అల్తాఫ్‌బాబా మహమ్మద్ ప్రవక్త చిహ్నంగా ఇస్లాం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అజ్మీర్ దర్గా పీఠాధిపతులు సయ్యద్ సుల్తాన్ చిస్టీబాబా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమానవాళికి శాంతి సందేశానిచ్చిన మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతిఒక్కరు శాంతి మార్గంలో పయనించాలన్నారు.

  • స్వచ్ఛందంగా విరాళాలు.. దాతలకు సత్కరాలు

    కృష్ణా: మోపిదేవిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రతిరోజూ భక్తులకు అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కొనసాగేందుకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. ఈక్రమంలో భీమవరం వాస్తవ్యులు ఆకులు వీరాస్వామిరాజా, పద్మజ దంపతులు భక్తిశ్రద్ధలతో నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు విరాళంగా అందించారు. దాతలను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

  • ‘ఆత్మ నిర్భర్ భారత్’ కోసం కలిసి అడుగులేద్దాం: మాధవ్

    ఎన్టీఆర్: ప్రజల నాడీ, వారి సమస్యలను తెలుసుకునేందుకే ‘చాయ్ పే చర్చ’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. విజయవాడలో పర్యటించిన ఆయన కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్‌లో నిర్వహించిన ‘చాయ్ పే చర్చ’లో పాల్గొని మాట్లాడారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం కలిసి అడుగులు వేద్దామన్నారు. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు.

     

     

  • కనికరించేనా.. కనుమరుగయ్యేనా..!

    కృష్ణా: ప్రతి శుక్రవారం పెడనలో జరిగే వారపు సంతకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే మత్స్యకారులు, ఇతర వర్తకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి సదుపాయం లేక స్థానిక బస్టాండ్‌లోనే రోజు గడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.17లక్షలను మార్కెట్ మార్కెట్ ఆధునికరణకు కేటాయించినప్పటికీ..నేటికీ అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడంతో సంత కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

     

     

  • ప్రతి గురువు దైవంతో సమానం: తంగిరాల

    ఎన్టీఆర్: ఉపాధ్యాయులందరికీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ.. విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమన్నారు. తల్లిదండ్రులు తర్వాత గురువును పూజిస్తామన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.

     

  • ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: MLA మండలి

    కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ రెండవ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామన్నారు.

  • నేడు ‘డయల్ యువర్ కలెక్టర్’

    ఎన్టీఆర్ జిల్లాలో నేడు ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరా, సమస్యలపై
    9154970454 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 10.30గంటల కార్యక్రమం జరుగుతుందన్నారు. రైతులతో పాటు డీలర్లు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు.. ఇలా ఎవ రైనా డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా మాట్లాడవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.