Locations: Krishna

  • ఎంపీ, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

    కృష్ణా: ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు మచిలీపట్నం పట్టాభి మెమోరియల్ సాధన కమిటీ సభ్యులు పాలాభిషేకం చేశారు. పట్టాభిస్మారక భవన నిర్మాణానికి వెనక్కి వెళ్లిపోయిన నిధులను మరల తీసుకురావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. స్మారక భవనాన్ని గతంలో రూ.40 కోట్లతో బాలశౌరి తీర్చిదిద్దుతానంటే వైసీపీ మేయర్, కార్పొరేటర్లు అడ్డుపడ్డారని కమిటీ ప్రధాన కార్యదర్శి ఫణి కుమార్ వెల్లడించారు.

  • పెరిగన మిర్చి ధరలు

    ఎన్టీఆర్: గత కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న మిర్చి ధరలు సోమవారం కొంత ఆశాజనకంగా మారాయి. రేటు పెరగడంతో కంచికచర్ల శీతల గిడ్డంగిలో  మిర్చి పంటను విక్రయించేందుకు రైతులు ఉత్సాహం చూపించారు. ఆర్మూర్, 334 లావు, తేజాలు సన్నరకం గతవారం ధరలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి సుమారు రూ.1000కి పైగా ధర పెరిగినట్లు రైతులు తెలిపారు.

  • మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి సహా నిందితులకు ఎదురుదెబ్బ

    తూ.గో.: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ మిథున్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. వీరి పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగించిన న్యాయస్థానం..నేడు తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్‌ వాదనతో ఏకీభవిస్తూ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. వీరితో పాటు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లనూ కోర్టు కొట్టివేసింది.

  • నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

    ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. జోరు వానల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజీ డ్రోన్‌ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

  • పెళ్లి చేసిన చెవినొప్పి.. ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి…మెక్సికో అమ్మాయి

    కృష్ణా: గన్నవరం మండలంలో ఆంధ్రా అబ్బాయి,మెక్సికో అమ్మాయి వివాహబంధంతో ఒక్కటయ్యారు. మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి యశ్వంత్‌ మెక్సికోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఒకరోజు అతనికి చెవినొప్పి రావటంతో..సమీపంలోని ఓఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఓమహిళా డాక్టర్‌ జ్యాన్యజాయ్‌ రూయిజ్‌ అంజర్‌..యశ్వంత్‌కు వైద్యం చేసింది. వారిద్దరి మధ్య ఏర్పడిన ఆపరిచయం ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల పెద్దలను ఒప్పించి..భారతీయ సంప్రదాయం ప్రకారం వారు పెళ్లిచేసుకున్నారు.

  • పొక్కునూరు ZPH స్కూల‌్‌‌లో MLA ఆకస్మిక తనిఖీ

    ఎన్టీఆర్: చందర్లపాడు మండలం పొక్కునూరు ZPH స్కూల‌్‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశీలించి, సౌకర్యాలు, పరిస్థితులపై సమీక్షించారు. సౌమ్య విద్యార్థులతో కరచలనం చేసి, స్నేహపూర్వకంగా మాట్లాడారు. వారి అభ్యసన ప్రగతి, పాఠశాలలో జరిగే కార్యక్రమాలు, విద్యార్థుల అనుభవాల వివరాలను తెలుసుకున్నారు. లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట తదితరులు పాల్గొన్నారు.

  • అన్నదాతలకు అండగా కూటమి: తంగిరాల

    ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. సోమవారం చందర్లపాడు మండలం కాసరబాధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సౌమ్య రైతుల కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని వివరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ కోమటి వెంకటకృష్ణరావును ఆమె శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

  • ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలి: RDO

    ఎన్టీఆర్: నందిగామ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఆర్డీవో బాలకృష్ణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 9 ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖ నుంచి 3, సర్వే విభాగం 1, విద్యాశాఖ 1, మున్సిపాలిటీ 3, పంచాయతీ రాజ్ 1 వచ్చాయి. సంబంధిత అధికారులు ప్రతి ఫిర్యాదును పరిశీలించి, వాస్తవస్థితి ఆధారంగా బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని పరిష్కరించాలని ఆర్డీవో ఆదేశించారు.
  • సొసైటీ ప్రెసిడెంట్ సురేష్‌కు MLA సత్కారం

    ఎన్టీఆర్: నందిగామ మండలం అడవిరావులపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణస్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గర్మిడి సురేష్‌ను ఆమె ఛైర్మన్ కుర్చీలో కూర్చోపెట్టి  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ కోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

  • కొల్లేరుకు వరద ఉద్ధృతి

    కృష్ణాజిల్లాతో పాటు తెలంగాణలో పెద్దఎత్తున వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే మండవల్లి మండలంలోని కొన్ని కొల్లేరు లంకగ్రామాలకు రోడ్డుమార్గాలు తెగిపోయాయి. పెనుమాకలంక, పెదఎడ్లగాడి రోడ్డుపై నుంచి 2,3చోట్ల కొల్లేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోపక్క వరద ఉద్ధృతి అంతకంతకూ పెరగడంతో ఆయాగ్రామాలతో పాటు మణుగునూరు, కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు గ్రామాల్లో ఆందోళన నెలకొంది.